S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/17/2017 - 04:14

హైదరాబాద్, జనవరి 16: చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసినట్టుగానే త్వరలో గొర్రెలను పంపిణీ చేయనున్నట్టు పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మత్స్య పరిశ్రమ, గొర్రెల పెంపకం పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవలసిన చర్యలను సూచించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ తలసాని నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు.

01/17/2017 - 04:09

హైదరాబాద్/ ఖైరతాబాద్, జనవరి 16: యూనివర్శిటీల్లో కులవివక్షను రూపుమాపేందుకు రోహిత్ చట్టాన్ని తీసుకువచ్చే వరకు పోరాటం ఆగదని రోహిత్ సంస్మరణ సభలో వక్తలు స్పష్టం చేశారు. సోమవారం టిపిసిసి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రోహిత్ వేముల సంస్మరణ సభను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు.

01/17/2017 - 04:06

న్యూఢిల్లీ, జనవరి 16: జిఎస్‌టికి సంబంధించిన కేంద్రం రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన క్రాస్ ఎంపవర్‌మెంట్ అంశంపై అంగీకారం కుదిరిందని తెలంగాణా ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. జిఎస్‌టిని ఎప్రిల్ ఒకటికి బదులు జూలై నెల నుండి అమలు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని రాజేందర్ వెల్లడించారు.

01/17/2017 - 04:05

హైదరాబాద్, జనవరి 16: గర్భిణీ స్ర్తిలకు వైద్య సహాయంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆర్థిక సహాయం ఎంత అనేది ఇంకా నిర్ణయం జరగలేదు. ఈ అంశంపై ఇటీవల రాష్ట్ర అధికారుల బృందం స్మితా సబర్వాల్ నేతృత్వంలో తమిళనాడులో పర్యటించి వచిచంది. అక్కడ ప్రజా ఆరోగ్యం దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా బాగుంది. ప్రభుత్వ ఆస్పత్రులలోనే ఎక్కువగా ప్రసవాలు నమోదు అవుతున్నాయి.

01/17/2017 - 04:04

హైదరాబాద్, జనవరి 16: ఈ నెల 17 నుంచి 23 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణారావు తెలిపారు. ఆర్టీసీలో ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.

01/17/2017 - 02:38

హైదరాబాద్, జనవరి 16: భారతదేశంలో పంటల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందని, సాంకేతిక ఆధునిక నైపుణ్యమే ఇందుకు కారణమని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) ప్రతినిధి బృందం ప్రతినిధి డాక్టర్ ఆర్.సి. మహేశ్వరి పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐసిఎఆర్ నిధులతో చేపట్టిన విద్య, పరిశోధన తదితర కార్యక్రమాలు, పథకాలను పరిశీలించేందుకు ఈ బృందం వచ్చింది.

01/17/2017 - 02:37

హైదరాబాద్, జనవరి 16: ఇంటర్మీడియట్ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు బోర్డు అధికారులు అనేక చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం లేదా మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు చేపట్టింది. అత్యధిక మార్కులను సాధించడం కోసం అడ్డదారులు తొక్కుతున్న ప్రైవేటు కాలేజీలకు ముకుతాడు వేసేందుకు చర్యలు చేపట్టింది.

01/17/2017 - 02:36

హైదరాబాద్, జనవరి 16: ఉద్యాన యూనివర్సిటీ, ఎన్విరాన్ మెంట్ ఫారెస్ట్ విభాగాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యాన యూనివర్సిటీలో మొత్తం 35 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశారు. సైంటిస్ట్‌లు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మంజూరు చేశారు. ఎన్విరాన్ మెంట్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో మొత్తం 201 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు.

01/17/2017 - 02:35

హైదరాబాద్, జనవరి 16: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష తుది కీని ఖరారు చేశారు. నాలుగు పేపర్ల నుండి 17 ప్రశ్నలను తొలగించారు. మరో 8 ప్రశ్నలకు రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాధానాలు సరైనవని పేర్కొంది. వాటిలో ఏది రాసినా సరైన జవాబు అవుతుందని కమిషన్ తెలిపింది. తొలగించిన ప్రశ్నలను మినహాయించి మిగతా ప్రశ్నలకు మార్కులను లెక్కిస్తారు.

01/17/2017 - 02:34

న్యూఢిల్లీ, జనవరి 16: తెలంగాణ ప్రభుత్వం 26 బీసీ కులాల తొలిగించడంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణను పది వారాలకు వాయిదా వేసింది.

Pages