S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/16/2017 - 02:39

హైదరాబాద్, జనవరి 15: గోసంపదను పెంచుకోవడం, గో ఆధారిత సేద్యాన్ని పాటించి తన ధర్మాలను రైతు నిర్వహించాలని కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. ‘ఆవులు-ఎడ్లు-సుళ్లు’ పుస్తకాన్ని పరిపూర్ణానందస్వామి ఈ రోజు శ్రీపీఠంలో ఆవిష్కరించారు.

01/16/2017 - 02:35

హైదరాబాద్, జనవరి 15: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించి, నామినేషన్ దాఖలు చేసిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజరుద్దీన్‌కు చుక్కెదురైంది. అజర్ దాఖలు చేసిన నామినేషన్‌ను హెచ్‌సిఎ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఈ నెల 17న హెచ్‌సిఎకు ఎన్నికలు జరగనున్నాయి.

01/16/2017 - 02:32

సికిందరాబాద్, జనవరి 15: ప్రయాణికుల భద్రతతోపాటు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం సికిందరాబాద్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ మధ్యనే జిఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అధికారుల నుంచి ముందుగా వివరాలు తెలుసుకొని, అనంతరం స్టేషన్‌కు తనిఖీలకు వెళ్లారు.

01/14/2017 - 03:33

మహబూబాబాద్, జనవరి 13:ప్రజలు మీట నొక్కితే నాయకులు తయారవుతారని, అంతే తప్ప నాయకులు చెప్పినట్లుగా ప్రజలు నడుచుకోవాల్సిన అవసరం లేదని జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. స్వప్రయోజనాల కోసం, కాంట్రాక్టులకోసం నాయకులు పార్టీ ఫిరాయించడాన్ని జేఎసి వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.

01/14/2017 - 03:31

మహబూబ్‌నగర్, జనవరి 13: కర్వెన రిజర్వాయర్ నుండే నారాయణపేట నియోజకవర్గంతో పాటు ఇటీవల వికారాబాద్ జిల్లాలో కలిసిన కొడంగల్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు.

01/14/2017 - 03:29

వరంగల్, జనవరి 13: అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు కావాలని బీసీలు డిమాండ్ చేస్తున్నారే తప్ప ఇవన్నీ ఇచ్చేందుకు అవకాశం ఉన్న రాజ్యాధికారం గురించి ఆలోచించటం లేదని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇతరుల ఓట్లు ఎలా ఉన్నా బిసిల ఓట్లు బిసి అభ్యర్థులకు వేసుకుంటే విజయం తథ్యమని, అధికారం తప్పదనే విషయాన్ని గమనించాలని సూచించారు.

01/14/2017 - 03:26

సిద్దిపేట, జనవరి 13: మల్లన్నసాగర్‌లో నకిలీ పట్టాలు, పాస్‌బుక్కులు సృష్టించి కోట్లాది రూపాయలు పరిహారం కాజేయాలని పథకం పన్నిన మాయగాళ్లు, వారికి సహకరించిన రెవిన్యూ సిబ్బంది పాత్రపై దర్యాప్తునకు సైబర్ టీం రంగంలోకి దిగింది. ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. సిపి శివకుమార్ నేతృత్వంలో సైబర్‌క్రైం ప్రత్యేక బృందంతో పాటు మరో టీమ్‌ను పోలీసుశాఖ ఏర్పాటు చేసింది.

01/14/2017 - 03:24

సంగారెడ్డి, జనవరి 13: రైతులు పండించిన కందులకు నాణ్యమైన మద్దతు ధరను ప్రకటించి మొత్తం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని ఆగ్రహించిన మంత్రి హరీష్‌రావు సూచనల మేరకు మొత్తం 16 మంది అధికారులకు చార్జిమెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

01/14/2017 - 03:23

హైదరాబాద్, జనవరి 13:తెలంగాణ రవాణాశాఖను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రమాదరహిత రాష్ట్రంగా రూపొందిస్తామని రోడ్డు రవాణా శాఖ మంత్రి డాక్టర్ పి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆర్టీసిలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పిస్తామని చెప్పారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు భద్రత లోగోను, రోడ్డు భద్రత వారోత్సవాల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

01/14/2017 - 03:20

నల్లగొండ, జనవరి 13: ఖైదీ నెంబర్ 150 సినిమాను థియేటర్‌లో అక్రమంగా సెల్‌ఫోన్‌తో వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెట్టి విక్రయిస్తున్న ఇరువురిని అరెస్టు చేసినట్లుగా నల్లగొండ డిఎస్పీ సుధాకర్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈకేసు వివరాలను వెల్లడించారు.

Pages