S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/14/2017 - 03:19

హైదరాబాద్, జనవరి 13: హైదరాబాద్ నగరశివారులోని పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా నిబంధనలు పాటించని 28 ప్రైవేట్ బస్సులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

01/14/2017 - 02:50

హైదరాబాద్/మహేశ్వరం, జనవరి 13: ప్రపంచ పటంలోనే తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు వచ్చేలా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహించడానికి ప్రభుత్వం చొరవ తీసుకుందని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సిఎం మహమూద్ అలీ అన్నారు.

01/14/2017 - 02:46

హైదరాబాద్, జనవరి 13: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకులతో బస్సుస్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కే సమయంలో తొక్కిసలాట జరిగింది. ప్రయాణికుల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీ చార్జి జరిపారు. ఎంఎంటిఎస్ రైళ్లతోపాటు, దూరప్రాంతాలకు వెళ్లే రైళ్ల వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

01/14/2017 - 02:42

హైదరాబాద్, జనవరి 13: కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా అథారిటీ లైసెన్సు ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. కేంద్రప్రభుత్వం కేంద్ర మోటారు వాహనాల రూల్స్‌కు చేసిన సవరణను అనుసరించి, కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర రోడ్డు రవాణా అథారిటీ ఈ ఫీజులను పెంచింది.

01/14/2017 - 02:38

హైదరాబాద్, జనవరి 13: ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటిని సరఫరా చేయనున్నట్టు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఇంటింటికి 2017 చివరికల్లా మంచినీటి కనెక్షన్ ఇస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గడువులోగానే సురక్షితమైన మంచినీటిని అందిస్తామని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.

01/14/2017 - 02:37

హైదరాబాద్, జనవరి 13: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదం పన్ను (ఇటి) మినహాయింపు ఇవ్వవద్దని వాయిస్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు పాండురంగా రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పన్ను మినహాయింపు జీవోను వెంటనే ఉపసంహరించుకోకపోతే తాను కోర్టును ఆశ్రయిస్తానని ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. చిత్రంలో చరిత్రను వక్రీకరించారని ఆయన ఆరోపించారు.

01/14/2017 - 02:36

హైదరాబాద్, జనవరి 13: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ జంతుజీవ శాస్త్ర నిపుణుడు ప్రొఫెసర్ బాలసుబ్రమణియన్ సెంథిల్‌కుమార్‌ను నేషనల్ సైన్స్ అకాడమి ఫెల్లోగా ఎంపిక చేశారు. చేపల పునరుత్పత్తి పరిశోధనల్లో సెంథిల్ కుమార్ సేవలు విశిష్టమైనవి. బెనారస్ హిందూ యూనివర్శిటీ నుండి ఎంఫిల్, పిహెచ్‌డి చేసిన సెంథిల్ కుమార్ పునరుత్పత్తి జీవ శాస్త్రంలో నిపుణులు.

01/14/2017 - 02:36

హైదరాబాద్, జనవరి 13: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అన్ని విధాల ‘చేయూత’నిస్తున్నామని గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి సంస్ధ (హడ్కో) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) డాక్టర్ ఎం. రవికాంత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే 31,168 కోట్ల విలువైన ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. ముఖ్యంగా తెలంగాణలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, మిషన్ భగీరథ పథకాలకు పెద్ద ఎత్తున సహకరిస్తున్నట్లు చెప్పారు.

01/14/2017 - 02:28

హైదరాబాద్, జనవరి 13: ఉన్నత విద్య కోసం అర్రులు చాస్తున్న విద్యార్థుల కోరికను ప్రైవేటు విద్యాసంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. తెలంగాణలో పరిమితంగా వ్యవసాయ కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో సీట్లు రాని వేలాది మంది విద్యార్థులు ప్రైవేటు కాలేజీల్లో చేరాలని కోరుకోవడంతో కొన్ని సంస్థలు వారికి సీట్లు ఇచ్చే పేరుతో మోసం చేస్తున్నాయి.

01/14/2017 - 02:27

హైదరాబాద్, జనవరి 13: మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 98వ జయంతిని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. డాక్టర్ చెన్నారెడ్డి తనయుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం. కోదండరెడ్డి, జి. నిరంజన్, శ్యాంమోహన్ ప్రభృతులు తొలుత ఇందిరా పార్కులోని చెన్నారెడ్డి స్మృతి వనానికి చేరుకుని నివాళి అర్పించారు.

Pages