S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/13/2017 - 05:21

హైదరాబాద్, జనవరి 12: రాష్టవ్య్రాప్తంగా 31 జిల్లాల్లో 138 ఎక్సైజు స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ఎక్సైజుశాఖ మంత్రి టి పద్మారావు చెప్పారు.

01/13/2017 - 05:21

హైదరాబాద్, జనవరి 12: మిషన్ భగీరథ పనుల్లో ఏ స్థాయిలోని అధికారులు అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంతరెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో గురువారం ఆయన మిషన్ భగీరథ పనులపై సమీక్షించారు. ఇష్టపడి పనిచేస్తేనే విజయవంతం అవుతాయని, సులువుగా చేసేందుకు వీలుంటుందన్నారు.

01/13/2017 - 05:20

హైదరాబాద్, జనవరి 12: నకిలీ బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి రుణాలు తీసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను రాచకొండ ఎస్‌వోటి పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముత్తూట్, మణప్పురం ఫైనాన్స్ కంపెనీల్లో నకిలీ బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి మోసానికి పాల్పడుతోన్న ఈ ముఠాలో మహరాష్ట్ర, కర్నాటకకు చెందిన వారు ఉన్నట్టు తెలిసింది. నిందితుల నుంచి రూ.

01/13/2017 - 05:19

హైదరాబాద్, జనవరి 12: వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు గడించవచ్చని, ఇది పెట్టుబడుల వ్యాపారమంటూ రూ. 27 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో ఎస్‌విఎస్‌సి వెల్త్‌మేనేజ్‌మెంట్ డైరెక్టర్లను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

01/13/2017 - 03:59

హైదరాబాద్, జనవరి 12: నగరంలోని నెక్లెస్ రోడ్డులో నైట్ కైట్ ఫెస్టివల్ కన్నుల పండువగా ప్రారంభమైంది. అంతర్జాతీయ పతంగుల పండగను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ కనపరిచారని, ఈ ఏడాది హైదరాబాద్‌తోపాటు యాదాద్రి, వరంగల్ జిల్లాకేంద్రాల్లోనూ ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేసినట్లు పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రకటించారు.

01/13/2017 - 03:56

హైదరాబాద్, జనవరి 12: రాష్టవ్య్రాప్తంగా నగరాలు, పట్టణాలలో గోడలపై రాతలు రాసినా, పోస్టర్లు, ఫ్లెక్సీలు అంటించినా కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌శాఖ మంత్రి కె తారకరామారావు అధికారులను ఆదేశించారు.

01/13/2017 - 03:49

హైదరాబాద్, జనవరి 12: భారతదేశం భవిష్యత్తు యువతపైనే ఉందని, వారు తలచుకుంటే దేశాన్ని ప్రపంచంలోనే ఉన్నతస్థితికి తీసుకురాగలుతారని తెలంగాణ రాష్ట్ర ఐటి మంత్రి కె. తారకరామారావు అన్నా రు. యువత తమ శక్తియుక్తులను దేశాభివృద్ధికి వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 155 వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రామకృష్ణామఠంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

01/13/2017 - 03:44

హైదరాబాద్, జనవరి 12: తెలంగాణ రాష్ట్రంలో రానున్నవేసవి కాలంలో 9500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడుతుందని, దీనిని తట్టుకునేందుకు విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వ్యవసాయంలో ఒక్క ఎకరం పొలం ఎండిపోయినా చర్యలు తప్పవన్నారు. రైతులు విద్యుత్ కనెక్షన్‌తో పాటు విద్యుత్ సమస్యలకు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దన్నారు.

01/13/2017 - 03:42

గోదావరిఖని, జనవరి 12: రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా వెలుగులను ప్రసాదించి విద్యుత్ ఉత్పత్తిలో రారాజుగా నిలిచిన రామగుండం బి థర్మల్ విద్యుత్ కేంద్రం మూసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బొగ్గు, నీరు, భూమి సమృద్ధిగా ఉన్నప్పటికీ త్వరలో కనుమరుగు కాబోతోంది. 200 మెగవాట్లకన్నా తక్కువ సామర్థ్యం ఉన్న, ప్లాంట్ స్థాపించి 25 సంవత్సరాలు దాటి అధిక కాలుష్యం వెదజల్లే విద్యుత్ కేంద్రాలను మూసివేసే అవకాశాలున్నాయి.

01/13/2017 - 03:38

హైదరాబాద్, జనవరి 12: జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉండాలని, దేశానికి ఆదర్శంగా నిలిచేలా పనిచేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు పిలుపునిచ్చారు. సచివాలయంలో గురువారం ఆయన పంచాయితీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీతో పాటు హరితహారం, ఉపాధి శిక్షణలో కూడా దేశానికి ఆదర్శంగా నిలిచేలా చూడాలని సూచించారు.

Pages