S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/10/2017 - 03:34

హైదరాబాద్, జనవరి 9: అఖిల భారత వైస్ చాన్సలర్ల సదస్సు ఏప్రిల్ 27న హైదరాబాద్‌లో జరగనుంది. అలాగే మరుసటి రోజు ఏప్రిల్ 28న ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ జరగనుంది. ఈ రెండు కార్యక్రమాలకు ఉస్మానియా యూనివర్శిటీ వేదిక కానుంది.

01/10/2017 - 03:31

హైదరాబాద్, జనవరి 9: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అక్టోబర్ కల్లా నీరు విడుదల చేసే లక్ష్యంగా పనులను వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టు సంస్థలను నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసి ఆసియాలోనే రికార్డు నెలకొల్పాలని మంత్రి అధికారులకు సూచించారు. బ్యారేజీలు, పంపుహౌజ్‌ల డిజైన్లను వెంటనే సమర్పించాలని సెంట్రల్ డిజైనింగ్ విభాగాన్ని మంత్రి ఆదేశించారు.

01/10/2017 - 03:29

హైదరాబాద్, జనవరి 9: స్వచ్ఛ భారత్ మిషన్‌లో (పట్టణ ప్రాంతాలు) చేపడుతున్న వివిధ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధుల కేటాయింపును పెంచారు. ఈ మేరకు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

01/10/2017 - 03:04

హైదరాబాద్, జనవరి 9: దేశవ్యాప్తంగా ఉన్న 20 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష ‘కామన్ అడ్మిషన్ టెస్టు’ (క్యాట్) ఫలితాలను నిర్వాహక సంస్థ బెంగళూరు ఐఐఎం సోమవారం సాయంత్రం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 138 నగరాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 2,32,434 మంది రిజిస్టర్ చేసుకోగా, అందులో 1.95 లక్షలు అర్హత సాధించారు.

01/10/2017 - 03:03

హైదరాబాద్, జనవరి 9: ఉత్తర తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయి. ఓ వైపు తెలంగాణలో నక్సలైట్లు లేరని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ మరోవైపు నక్సలైట్లు రాజకీయ నాయకులను బెదిరించడం, మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో జిల్లా అధికారులు పర్యటించడం వంటి సంఘటనలతో మావోయిస్టుల కదలికలు స్పష్టమవుతున్నాయి.

01/10/2017 - 03:02

హైదరాబాద్/గచ్చిబౌలి, జనవరి 9: ఉద్యోగాలు, బ్యాంకు అధికారుల మంటూ మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ ఎం భగవత్ సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరమని, ఈనేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

01/10/2017 - 03:00

హైదరాబాద్, జనవరి 9: కేరళలోని శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ దేవాదాయ మంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం పంపాసంగమం పేరుతో సోమవారం ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. అయ్యప్ప భక్తులు శబరిమలకు ఎంత మంది వచ్చినప్పటికీ, తొక్కిసలాట జరగకుండా శాస్ర్తియ విధానంలో చర్యలు తీసుకోవాలని సూచించారు.

01/10/2017 - 02:59

హైదరాబాద్, జనవరి 9: దేశంలో ఇపిఎఫ్ ఖాతాదారులు ఆధార్‌తో అనుసంధానం కావలసిందేనని కేంద్ర కార్మిక మంత్రి బండారుదత్తాత్రేయ పేర్కొన్నారు. సోమవారం సాయం త్రం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మార్చి 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఖాతాదారులను, సంస్థలను కోరామన్నారు. 4.30 కోట్ల మంది ఇపిఎఫ్ ఖాతాదారులున్నారని, 50 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని వివరించారు.

01/10/2017 - 02:57

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో సంక్రాంతి సెలవుల్లో మార్పు చేసినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య తెలిపారు. క్రైస్తవ, మైనార్టీ సంస్థలు మినహా మిగిలిన విద్యాసంస్థల్లో ఈ నెల 11 నుండి 15వ తేదీ వరకూ సెలవులు ప్రకటించారు. అయితే తాజాగా ఈ సెలవులను ఈ నెల 12 నుండి 16 వరకూ మార్పు చేసినట్టు ఆమె చెప్పారు.

01/10/2017 - 02:56

హైదరాబాద్, జనవరి 9: భారతదేశంలో తొమ్మిదో బ్యాచ్ స్పెల్ బీ పోటీలు పెద్దఎత్తున ప్రారంభం కానున్నాయి. క్లాస్‌మేట్ సంస్థ ఈ పోటీలను నిర్వహించబోతోంది. 30 నగరాల్లో వెయ్యి స్కూళ్లలో దీనిని నిర్వహిస్తారు. ఇందులో మూడు లక్షల మంది విద్యార్ధులు పాల్గొనే వీలుంది. క్లాస్ మీట్ స్పెల్ బీ సీజన్‌లో జాతీయ ఛాంపియన్‌కు రెండు లక్షల రూపాయిల నగదును అందిస్తారు.

Pages