S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/06/2016 - 04:55

హైదరాబాద్, డిసెంబర్ 5: లెక్కల్లో చూపని రూ.58లక్షల కొత్త నోట్లను దక్షిణ మండలం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 30 శాతం కమీషన్‌తో పాత నోట్ల స్థానంలో కొత్తనోట్లను మార్పిడి చేసేందుకు యత్నించిన 8 మందిని అరెస్టు చేసినట్లు దక్షిణ మండలం డిసిపి వి.సత్యనాయణ తెలిపారు. సంతోష్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో నోట్లు మార్పిడి జరుగుతున్నట్టు తమకు వచ్చిన సమాచారం ఆధారంగా నిఘాను ముమ్మరం చేసి ఈ ముఠాను పట్టుకున్నామన్నారు.

12/06/2016 - 04:54

హైదరాబాద్, డిసెంబర్ 5: ఆసరా పథకం కింద పెన్షన్లను మొత్తం ఆన్‌లైన్‌లోనే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. వివిధ పెన్షన్ పథకాలకు నిధులు ఆన్‌లైన్‌లోనే చెల్లించడం గత నెల నుంచే ప్రారంభం అయింది. అయితే దాదాపు మూడు లక్షల ఖాతాలను మాత్రం ఇంకా ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేయలేదు.

12/06/2016 - 04:54

హైదరాబాద్, డిసెంబర్ 5: రాష్ట్రానికి రూ. 1100 కోట్లు కరెన్సీ నోట్లు వచ్చాయి. ఈ మేరకు ఆర్బీఐ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖకు సమాచారం అందింది. గురువారం రాష్ట్రానికి రూ. 1800 కోట్లు కరెన్సీ రాగా, సోమవారం రూ. 1100 కోట్లు వచ్చాయి. ఈ కరెన్సీ మొత్తం చిన్న నోట్ల రూపంలోనే ఉందని అధికారులు తెలిపారు. ఆసరా, పింఛన్ కింద వృద్ధులకు ఇచ్చేందుకు అవసరమైన కరెన్సీ లేదు.

12/06/2016 - 04:53

హైదరాబాద్, డిసెంబర్ 5: పెద్ద నోట్ల రద్దుతో కాశ్మీర్ ఉగ్రవాదానికి, దేశీయ తీవ్రవాదానికి అడ్డుకట్ట పడిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలో పేదరికాన్ని నిర్మూలించి వారిని అభివృద్ధిలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు.

12/06/2016 - 04:52

వికారాబాద్, డిసెంబర్ 5: నవమాసాలు మోసి కని పెంచిన కొడుకే కన్నతల్లిని దారుణంగా చంపిన సంఘటన వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ జి.రవి తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారంలోని సాయిబాబా కాలనీలో నివాసముండే వడ్డే అంజమ్మ (40) పలు ఇళ్ళలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె కొడుకు వెంకటయ్య కల్లు దుకాణంలో దినసరి కూలీగా పనిచేస్తాడు.

12/06/2016 - 04:52

హైదరాబాద్, డిసెంబర్ 5: అంతర్జాతీయంగా విత్తనాలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరిందని, విత్తనోత్పత్తిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘విత్తన నమూనా, స్వచ్ఛత, అంకురోత్పత్తి’ అంశంపై హైదరాబాద్‌లోని పార్క్ హోటల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ఐదురోజుల వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు.

12/06/2016 - 04:51

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: పెద్ద నోట్ల రద్దు ఇక్కట్లపై సోమవారం లోక్‌సభలో చర్చ ప్రారంభించిన తెరాస పక్షం నాయకుడు జితేందర్ రెడ్డిని ప్రతిపక్ష పార్టీల సభ్యులు కొట్టినంత పని చేశారు. నోట్ల రద్దుతో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు 193 నియమం కింద జితేందర్ రెడ్డి నోటీసు ఇచ్చారు.

12/06/2016 - 04:43

హైదరాబాద్/సిద్ధిపేట, డిసెంబర్ 5: తెలంగాణలో సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ దేశంలోనే రెండవ నగదురహిత గ్రామం, దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామంగా నిలిచింది. వంద శాతం నగదురహిత కార్యకలాపాల ద్వారా దేశంలో రెండవ గ్రామంగా రికార్డు సృష్టించింది. సిద్దిపేట నియోజక వర్గం పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామాన్ని మంత్రి తన్నీరు హరీశ్‌రావు దత్తత తీసుకున్నారు.

12/06/2016 - 04:40

కరీంనగర్, డిసెంబర్ 5: తెలంగాణ రాష్ట్ర సాధన పోరులో కీలకపాత్ర పోషిస్తూ తెలంగాణ జాతిని ఏకతాటిపైకి తీసుకువచ్చిన సమయంలో వారు ఉద్యమకారులు..నేడేమో వారు ద్రోహులా అంటూ టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, శాసనసభ పక్ష ఉప నేత టి.జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ అవలంభిస్తున్న వైఖరి, వైఫల్యాలపై మాట్లాడితే చాలు వారిని ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

12/06/2016 - 04:37

చిత్రం..హైదరాబాద్‌లో సోమవారం నగదు కోసం ట్యాంక్ బండ్ ఎస్‌బిహెచ్ వద్ద పెద్ద సంఖ్యలో
బారులు తీరిన ప్రజలు

Pages