S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/03/2016 - 06:10

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రప్రభుత్వం ఏ విధంగా భూమి సేకరణకు నోటిఫికేషన్‌ను జారీ చేస్తుందని హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది.

11/03/2016 - 04:20

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణ సచివాలయం కోసం కొత్త భవనాలు నిర్మించాలన్న సిఎం కెసిఆర్ ఆలోచనలకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. హైకోర్టులో నమోదైన కేసుతో తాజా పరిస్థితిపై కెసిఆర్ ప్రభుత్వంలోని ముఖ్యులతో బుధవారం చర్చించారని తెలిసింది. అడ్వకేట్ జనరల్, న్యాయనిపుణులతో సిఎస్ రాజీవ్ శర్మ ఫోన్‌లో చర్చించారని తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టుకు ఏం చెప్పాలన్న అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

11/02/2016 - 07:26

గోదావరిఖని, నవంబర్ 1: రైతుల త్యాగాల ఫలితంగానే సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతోందని, అలాంటి రైతుల భూమి సేకరించేటప్పుడు అవగాహన కల్పించి న్యాయమైన పరిహారం చెల్లించి భూములు తీసుకోవాలని, అలాకాకుండా భయభ్రాంతులకు గురిచేయడం సరైంది కాదని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.

11/02/2016 - 07:26

గజ్వేల్, నవంబర్ 1: ఫార్మారంగానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఇందుకోసం కందుకూరు వద్ద 6వేల ఎకరాలు కేటాయించినట్లు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ శివారులో ఫార్మసి కళాశాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాలుష్యరహిత పరిశ్రమల స్థాపనపై దృష్టి సారిస్తున్న సర్కార్ పెట్టుబడుల సాధన రేసులో ముందున్నట్లు స్పష్టం చేశారు.

11/02/2016 - 07:25

నల్లగొండ, నవంబర్ 1: ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ రంగ సంస్థలు ఆలస్యంగానైనా జోరు పెంచాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఐకెపి, పిఏసిఎస్ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జోరు పెంచిన పౌరసరఫరాల సంస్థ రైతులకు ధాన్యం డబ్బుల చెల్లింపుల్లో మాత్రం ఆన్‌లైన్‌తో తంటాలు పడుతోంది. మూడు జిల్లాల పరిధిలో 2 లక్షల 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరపాలని లక్ష్యంగా నిర్ణయంచింది.

11/02/2016 - 07:23

నిజామాబాద్, నవంబర్ 1: ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆకాంక్షతో పోస్టు గ్రాడ్యుయేషన్ (పి.జి) అనంతరం తమకు ఆసక్తి ఉన్న అంశంపై సమగ్ర పరిశోధన జరిపి పిహెచ్‌డి పట్టా పొందాలని భావిస్తున్న అభ్యర్థులకు ఆదిలోనే చుక్కెదురవుతోంది.

11/02/2016 - 07:23

హైదరాబాద్, నవంబర్ 1: విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలు, తెలంగాణ సమస్యలపై చర్చించేందుకు ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అంగీకరించారు. ఈ విషయాన్ని పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కె తారకరామారావుకు తెలిపారు.

11/02/2016 - 07:22

హైదరాబాద్, నవంబర్ 1: మేడ్చెల్ జిల్లాలోని ప్రగతినగర్ గ్రామ పంచాయితీని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రి వెంట కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ కూడా ఉన్నారు. గ్రామ పంచాయితీల పరిధిలో అనుమతి లేకుండా అక్రమలేఅవుట్లు చేసినా, ఎలాంటి నిర్మాణాలు జరిగినా అందుకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

11/02/2016 - 07:21

సంగారెడ్డి, నవంబర్ 1: మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని కొండపాక, తొగుట మండలాల పరిధిలోని 14 గ్రామాలకు చెందిన భూములు సేకరించడానికి రెవెన్యూ శాఖ శ్రీకారం చుట్టింది.

11/02/2016 - 07:21

హైదరాబాద్, నవంబర్ 1: హోంగార్డులకు ఉద్యోగ భద్రతతోపాటు జీతాలు పెంచాలని, 30 శాతం కాలుష్య భత్యం ఇవ్వాలని బిజెపి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మంగళవారం డిజిపి అనురాగ్‌శర్మను కోరారు.

Pages