S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/07/2016 - 07:20

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాసకు కట్టబెట్టింది విజయం కాదు, నమ్మకం. ప్రజల బాధలు, కష్టాలు తొలిగిపోతాయన్న నమ్మకంతో మహత్తర విజయం అందించారు. ఆ నమ్మకాన్ని వమ్ముకానివ్వకండి’ అని సిఎం కె చంద్రశేఖర్‌రావు కార్పొరేటర్లకు హితవు పలికారు. కొత్తగా ఎన్నికైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు క్యాంపు కార్యాలయంలో శనివారం సిఎం కెసిఆర్‌ను కలిశారు.

02/06/2016 - 19:59

హైదరాబాద్-తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శ్రీవారి వైభవోత్సవం ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అశేషజనసందోహం మధ్య శనివారం సాయంత్రం పూజాదికాలు ప్రారంభించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులుసహా పలువురు ప్రముఖులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

02/06/2016 - 17:16

హైదరాబాద్-తెలంగాణలో ఈ ఏడాది 539 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. పోలీస్ నియామకాల సంఘం ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరుగుతాయి. ఈనెల 10నుంచి మార్చి 3వ తేదీవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎస్‌సి,ఎస్‌టిలు 250 రూపాయలు, ఒసి,బిసిలు 500 రూపాయలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 17న ఎస్‌ఐ పోస్టులకు రాతపరీక్ష నిర్వహిస్తారు.

02/06/2016 - 15:59

న్యూదిల్లి-గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అద్భుత విజయం సాధించిందని, తమ ప్రభుత్వ పనితీరుకు దక్కిన గుర్తింపు ఇదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో వివిధ రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశంలో పాల్గొన్న రాజేందర్ మాట్లాడారు. తెరాస పాలనకు ఆ ఫలితాలు రెఫరెండంగా ఆయన అభివర్ణించారు.

02/06/2016 - 11:53

నల్గొండ: చివ్వెంల మండలం వట్టికంపాడు వద్ద ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది.

02/06/2016 - 11:52

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయాన్ని చవి చూడటంతో నైతిక బాధ్యత వహిస్తూ నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ శనివారం రాజీనామా చేశారు. ఈ విషయమై ఆయన ఈ రోజు మధ్యాహ్నం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. గ్రేటర్ ఎన్నికలకు ముందు ఆయన టిఆర్‌ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగినా, చివరి క్షణంలో మనసు మార్చుకొని కాంగ్రెస్‌లోనే కొనసాగారు.

02/06/2016 - 11:52

మహబూబ్‌నగర్: షాద్‌నగర్‌లోని రాఘవేంద్ర కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి రవికుమార్ అనే విఆర్‌వోపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. పరిస్థితి విషమంగా మారటంతో ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. బాధితుడు బాలానగర్ మండలంలో విఆర్‌వోగా పని చేస్తున్నాడని, దాడికి పాల్పడింది ఎవరన్న విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

02/06/2016 - 02:07

హైదరాబాద్, ఫిబ్రవరి 5: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పాతబస్తీలో పట్టు నిలుపుకుంది. పాతబస్తీలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. కాని మేయర్, డిప్యూటీ మేయర్‌లో ఏ పదవిని పొందే అవకాశం మజ్లీస్‌కు లేకుండా పోయింది. టిఆర్‌ఎస్‌కు సొంతంగా మెజార్టీ రావడంతో మజ్లిస్ ప్రతిపక్ష పాత్రకే పరిమితం కానుంది.

02/06/2016 - 02:06

సంగారెడ్డి, ఫిబ్రవరి 5: హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లా ఓటర్లు మరోమారు కాంగ్రెస్ గౌరవాన్ని కాపాడి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మొత్తం హైదరాబాద్ నగర పాలక సంస్థలోని 150 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయగా నాచారం డివిజన్‌లో శాంతితో పాటు మెదక్ జిల్లా పరిధిలోని పటన్‌చెరు డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ యాదవ్‌ను గెలిపించి పార్టీ పరువు దక్కేందుకు దోహదపడ్డారు.

02/06/2016 - 02:06

హైదరాబాద్, ఫిబ్రవరి 5: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు టిడిపి-బిజెపి కూటమికి ఘోర పరాజయాన్ని చవి చూశాయి. గ్రేటర్ ఎన్నికల్లో పరాజయం పాలైన ప్రముఖులలో...కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన విక్రమ్‌గౌడ్ పరాజయం పాలయ్యారు.

Pages