S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/30/2016 - 03:41

వరంగల్, అక్టోబర్ 29: రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, పనిచేయకుండా ఉన్న పాత విమానాశ్రయాల పునరుద్ధరణ కోసం కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉడాన్ పథకం ద్వారా ఈ ప్రాంతానికి విమానయోగం పడుతుందేమోనని వరంగల్ ప్రజలు ఎదురు చూస్తున్నారు.

10/30/2016 - 03:40

సదాశివపేట, అక్టోబర్ 29: పొట్టనింపుతూ జీవితాంతం పోషిస్తాడని నమ్మి ప్రేమించి కులాంతర వివాహమాడిన నిండు గర్భిణి భర్త నయవంచన, అత్త వేధింపులకులోనై అర్ధంతరంగా తనువు చాలించిన సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ పట్టణంలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ గిరిజాల వెంకటేశ్వర్లు కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

10/30/2016 - 03:14

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎం. జగన్‌మోహన్‌కు స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను అప్పగించారు. స్ర్తి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీమతి బి.

10/30/2016 - 03:13

హైదరాబాద్, అక్టోబర్ 29: విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను తెలంగాణ యువతీయువకులు అందిపుచ్చుకునేలా నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు ఉండాలని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. తెలగాణ రాష్ట్రానికి సంబంధించి స్కిల్ డెవెలప్‌మెంట్ పాలసీ, స్కిల్ మిషన్ ముసాయిదాపై ప్రణాళికా శాఖ శనివారం సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించింది.

10/30/2016 - 03:12

హైదరాబాద్, అక్టోబర్ 29: భావితరాలకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు తేవొచ్చని సిఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్య సాధన కోసమే ప్రభుత్వం కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా రాష్టవ్య్రాప్తంగా విరివిగా గురుకుల పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

10/30/2016 - 03:10

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కె. లక్ష్మణ్‌కు పార్టీ రాష్ట్ర కమిటీని నియమించుకోవడం తలకు మించిన భారమైంది. 27 మందికి మించి కమిటీని నియమించరాదన్న నియమం ఉంది.

10/29/2016 - 07:05

హైదరాబాద్, అక్టోబర్ 28: టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడిచిపోయింది. ఐదేళ్ల అధికారంలో సగం కాలం ముగిసింది. ఇంకా సగం మిగిలింది. కొత్త ఇంటిని సర్దుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఇంటిని చక్కదిద్దుకోవడానికి ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడు పార్టీపై దృష్టిసారించారని పార్టీ వర్గాలు తెలిపాయి.

10/29/2016 - 07:05

హైదరాబాద్, అక్టోబర్ 28: రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో 20 పడకల ఆయుష్ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరహాలోనే తెలంగాణ రాష్ట్రం కూడా ఆయుష్ వైద్య విధానం, ఆయుర్వేదానికి తగిన గుర్తింపుతోనే అభివృద్ధి పరచడానికి చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రజాభిరుచికి తగ్గట్టుగా వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

10/29/2016 - 06:36

హైదరాబాద్, అక్టోబర్ 28: దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల పనితీరుపై విడిపి అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మొదటి స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎనిమిదవ స్థానంలో నిలిచారు. గత సంవత్సరం విడిపిఎ సంస్థ నిర్వహించిన సర్వేలోనూ కెసిఆర్ మొదటి స్థానంలో నిలిచారు. 87 శాతం ఓటర్లు మోస్ట్ పాపులర్ సిఎంగా కెసిఆర్‌కు ఓటు వేశారు.

10/29/2016 - 04:04

హైదరాబాద్/ నేరేడ్‌మెట్, అక్టోబర్ 28: హైదరాబాద్‌లో మరో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రం బయటపడింది. సైనిక్‌పురిలో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు శుక్రవారం భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. రూ. 9 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నెల రోజులు గడవకముందే ఇదే ప్రాంతంలో ఇంత భారీగా డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపుతోంది.

Pages