S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/29/2016 - 00:16

హైదరాబాద్, అక్టోబర్ 28: ఉద్యోగ భద్రత, వేతనాలు పెంచాలని కోరుతూ హోంగార్డులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. హోంగార్డుల ఆందోళన శుక్రవారంతో ఆరవ రోజుకు చేరింది. మూడు రోజుల క్రితం అంబర్‌పేటలోని హోంగార్డుల సంక్షేమ సంఘం ఆవరణలో చేపట్టిన ఆమరణ దీక్ష భగ్నం కాగా, గురువారం సెక్రటరియట్ వద్ద ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి జరిపిన విషయం తెలిసిందే.

10/29/2016 - 00:15

కరీంనగర్, అక్టోబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం పాలన సౌలభ్యం పేరిట చేపట్టిన జిల్లాల పునర్విభజనతో జిల్లాల విస్తీర్ణం తగ్గిపోయింది. దీంతో జిల్లాల్లో పట్టు సాధించేందుకు ‘బాస్’ల పర్యవేక్షణ పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికితోడు ఆయా జిల్లాల ప్రజలకు ఏ సమస్య వచ్చినా జిల్లా బాస్‌లను కలిసి విన్నవించుకునే చాన్స్ ఎక్కువగా ఉన్న దరిమిలా అధికారులు, సిబ్బందిలో గుబులు పట్టుకుంది.

10/28/2016 - 03:39

సైదాబాద్, అక్టోబర్ 27: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల తెలంగాణలో విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోయిందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ విద్యార్థులకు బోధనా రుసుము బకాయిలు పూర్తిగా విడుదల చేసేవరకు విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఆయన తేల్చి చెప్పారు.

10/28/2016 - 03:36

హైదరాబాద్, అక్టోబర్ 27: అర్చకులు, ఆలయ ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభు త్వం తీసుకుంటోందని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. జీతభత్యాల విషయంలో దేవాదాయ శాఖ నియమించిన త్రిసభ్య కమిటీ నివేదికపై క్షుణ్ణంగా చర్చించాల్సిన అవసరం ఉందని కేబినెట్ సబ్‌కమిటీ అభిప్రాయపడింది.

10/28/2016 - 03:34

హైదరాబాద్, అక్టోబర్ 27: జిల్లాల విభజన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పథకాల అమలులో మరింత వేగం పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు గురువారం సమావేశం అయ్యారు. తెలంగాణలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న పలు పథకాల అమలు తీరు తెలుసుకున్నారు. కార్యక్రమాల అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

10/28/2016 - 03:32

హైదరాబాద్, అక్టోబర్ 27: తెలంగాణ రాష్ట్రంలో సర్వమత సమానత్వం, సౌభ్రాతృత్వం వర్ధిలుతున్నదని నాందేడ్ గురుద్వారా బోర్డు అధ్యక్షుడు, మహారాష్టక్రు చెందిన ఎమ్మెల్యే సర్దార్ తారాసింగ్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో గురువారం గవర్నర్ ముఖ్య కార్యదర్శి హరిప్రీత్‌సింగ్, నాందేడ్ బోర్డులో రాష్ట్ర సభ్యుడు ఎస్ దల్జీత్‌సింగ్‌లతో కలిసి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కలిశారు.

10/28/2016 - 03:31

వలిగొండ, అక్టోబర్ 27: ఏవోబి మల్కన్‌గిరి బూసుపట్టి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఏవోబి రాష్ట్ర కమిటీ సభ్యుడు, శ్రీకాకుళం-కోరాపూట్ జిల్లాల కార్యదర్శి చామల కిష్టయ్య అలియాస్ దయా అంత్యక్రియలు గురువారం స్వగ్రామం దాసిరెడ్డిగూడెంలో కుటుంబ సభ్యులు, బంధువులు, పరిసర గ్రామాల ప్రజలు, మావోయిస్టు సానుభూతి పరుల కన్నీటి నివాళుల మధ్య నిర్వహించారు.

10/28/2016 - 04:21

మహబూబ్‌నగర్, అక్టోబర్ 27: పాలమూరు నుండే టిఆర్‌ఎస్ పతనం ప్రారంభమైందని కెసిఆర్‌కు రాజకీయ జీవితాన్ని ఇచ్చి కాపాడిన ప్రజలే పాతాళానికి తొక్కేందుకు సిద్ధంగా ఉన్నారని టిటిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని సాయికృష్ణ పంక్షన్ హల్‌లో టిడిపి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి కెసిఆర్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

10/28/2016 - 03:24

న్యూఢిల్లీ,అక్టోబరు 27: మరుగున పడుతున్న తెలంగాణ గిరిజన సంప్రదాయ నృత్యాలు దేశరాజధానిలో పునర్వైభవాన్ని ప్రదర్శించాయి. జాతీయ గిరిజన కార్నివాల్‌లో ఈ నృత్య ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకొన్నాయి. దేశ రాజధానిలో మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ గిరిజన కార్నివాల్‌లో గురువారం రాష్ట్రానికి చెందిన గిరిజనుల సాంస్కృతిక ప్రదర్శనలకు దేశ రాజధాని ఢిల్లీ వేదికైంది.

10/28/2016 - 03:24

హైదరాబాద్, అక్టోబర్ 27: పాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ఇస్తున్న లీటరుకు రూ.4 ప్రోత్సహకానికి రెండో దఫాగా రూ.51 కోట్లు విడుదల చేస్తున్నట్టు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ ప్రోత్సహకం వల్ల దాదాపు లక్ష మంది పాల ఉత్పత్తిదారులు లబ్ధిపొందుతారని మంత్రి తెలిపారు. విడుదల చేయబోయే ప్రోత్సహకం మొత్తం ఏప్రిల్ 2016 నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలలకు సంబంధించిందన్నారు.

Pages