S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/26/2016 - 07:47

హైదరాబాద్, అక్టోబర్ 25: తెలంగాణ అంతటా ఆధునిక వసతులతో ప్రసూతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసూతి జరిగే విధంగా ప్రోత్సహిస్తామని, ఆస్పత్రులను ఆధునీకరిస్తామని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల ప్రకారమే నూతన ప్రసూతి కేంద్రాలు ఉంటాయని అన్నారు.

10/26/2016 - 07:45

భద్రాచలం, అక్టోబర్ 25: భద్రాద్రి జిల్లా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మంగళవారం 25 రోజుల పసికందు అపహరణకు గురైంది. ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. భద్రాచలం శివారు గోళ్లగట్ట గ్రామానికి చెందిన సోయం శాంత 25 రోజుల క్రితం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలోనే ప్రసవించింది. అయితే ఇంటికి వెళ్లాక మంగళవారం తన బాబుకు వైద్యపరీక్షల నిమిత్తం మళ్లీ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చింది.

10/26/2016 - 07:40

భద్రాచలం, అక్టోబర్ 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో 2017 జనవరి 7న సాయంత్రం గోదావరిలో స్వామికి తెప్పోత్సవం, 8న తెల్లవారుఝామున ఉత్తరద్వారంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు, స్థానాచార్యులు స్థలసాయిలు ఉత్సవ తేదీలను మంగళవారం ఖరారు చేశారు.

10/26/2016 - 07:40

హైదరాబాద్, అక్టోబర్ 25: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది ప్రతి రోజూ గంట అదనంగా పని చేసి రూ. 700 కోట్ల నష్టాల నుంచి సంస్థను గట్టెక్కించాలని టిఎస్‌ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ కోరారు.

10/26/2016 - 07:57

విశాఖపట్నం, పాడేరు, అక్టోబర్ 25: ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేవలం ఇద్దరు నేతలే హతమైనట్టు స్పష్టమవుతోంది. ఇందులో ఆర్‌కె, గాజర్ల రవి తప్పించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. పోలీసులు మాత్రం ఎన్‌కౌంటర్ జరిగిన కొద్ది గంటలకే మావోయిస్ట్ కీలక నేతలు మరణించినట్టు మీడియాకు సమాచారం అందించారు. ఇందులో చలపతి, అతని భార్య, దయతోపాటు మరికొంతమంది పేర్లు ఉన్నాయి.

10/26/2016 - 05:20

హైదరాబాద్, అక్టోబర్ 25: వ్యవసాయ విద్యుత్ కోసం దరఖాస్తు చేసిన రైతులందరికీ కనక్షన్లు ఇవ్వాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దాదాపు ఐదేళ్లుగా పెండింగ్‌లోవున్న దరఖాస్తులతోపాటు, మరో 30 వేల దరఖాస్తులకూ ఏడు నెలల్లో కనెక్షన్లు ఇవ్వాలన్నారు.

10/26/2016 - 03:25

సంగారెడ్డి, అక్టోబర్ 25: వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తే అందరికీ ప్రయోజనంగా ఉంటుందని, తనపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఖండించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులు సాగు చేసిన పంటలన్నీ చిన్నాభిన్నంగా మారాయని, అధికారుల నిర్లక్ష్యం వల్ల పంటలకు పెను శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసారు.

10/26/2016 - 03:23

భద్రాచలం, అక్టోబర్ 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో 2017 జనవరి 7న సాయంత్రం గోదావరిలో స్వామికి తెప్పోత్సవం, 8న తెల్లవారుఝామున ఉత్తరద్వారంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు, స్థానాచార్యులు స్థలసాయిలు ఉత్సవ తేదీలను మంగళవారం ఖరారు చేశారు.

10/26/2016 - 03:21

హైదరాబాద్, అక్టోబర్ 25: జిల్లా యూనిట్‌గా కేంద్రం అమలు చేసే పథకాలపై ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా సీనియర్ అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ప్రతీ జిల్లాలో నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉండాలని, ఇవ్వే కాకుండా ఇంకా ఏమేమి కేంద్రం నుంచి సాధించుకోవచ్చో ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు.

10/26/2016 - 03:17

కరీంనగర్, అక్టోబర్ 25: కరీంనగర్‌లో మంగళవారం ఉదయం రెండు హ్యాండ్ గ్రెనేడ్లు ఒక చెత్తకుప్పలో లభ్యం కావడం కలకలం సృష్టించింది. నగరంలోని జ్యోతినగర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్ సమీపంలో గల మైదానంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చెత్తను తొలగిస్తుండగా, రెండు గ్రెనేడ్లు కన్పించాయి. దీంతో కార్మికులు మున్సిపల్ అధికారులకు సమాచారమందించగా, మున్సిపల్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.

Pages