S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/23/2016 - 04:30

హైదరాబాద్, అక్టోబర్ 22: వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శాఖలో విలీనం చేయవద్దని వికలాంగుల సంక్షేమ శాఖ పరిరక్షణ సమితి నాయకుడు టి. రాజేందర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కోరారు. సమితి నాయకులు టి. రాజేందర్, జగన్, అంజయ్య శనివారం మీడియాతో మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమ శాఖ ఎన్నో పోరాటాల ఫలింగా 1983 సంవత్సరంలో ప్రత్యేక శాఖగా ఏర్పడిందని అన్నారు.

10/23/2016 - 04:29

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ నిరోధానికి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రశ్నించడంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. వెంటనే ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ ఉన్నత విద్యామండలిని ఆదేశించారు.

10/23/2016 - 04:28

హైదరాబాద్, అక్టోబర్ 22: రాష్ట్రంలోని మూడు మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా జిన్నారామచంద్రారెడ్డిని, సుల్తానాబాద్ మార్కెట్ కమిటీకి టి. కమలను, భద్రాద్రి జిల్లా బూర్గంపాడ్ కమిటీ చైర్‌పర్సన్‌గా విజయనిర్మలను నియమించారు.

10/23/2016 - 04:27

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య కార్డులపై ఎలాంటి ప్రయోజనాలు కల్పించాలన్న అంశంపై వైద్యమంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి శనివారం సచివాలయంలో సంబంధిత అధికారులతో చర్చించారు. ఆరోగ్య కార్డుల చెల్లుబాటు, వైద్య పరీక్షలు, శస్తచ్రికిత్సలు, ఆ యా విభాగాల వారీగా ఆసుపత్రులకు ఏ విధంగా నిధులు చెల్లించాలి అన్న అంశంపై చర్చించారు. ప్యాకేజీ ఇవ్వడమా? పరీక్షల వారీగా చెల్లించడమా?

10/23/2016 - 04:27

హైదరాబాద్/దిల్‌సుఖ్‌నగర్, అక్టోబర్ 22: భర్తను హతమార్చి, ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన సంఘటన సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నల్గొండ జిల్లాకు చెందిన పెద్దహర్షపల్లి గ్రామానికి చెందిన యాదగిరి, కవిత దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి కర్మన్‌ఘాట్‌లోని అంజిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. యాదగిరి (32) వృత్తిరీత్యా చిరువ్యాపారి. వ్యాపార క్రమంలో అనేక మార్లు నష్టపోయాడు.

10/23/2016 - 04:26

హైదరాబాద్, అక్టోబర్ 22: ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టిఎన్‌ఎస్‌ఎఫ్ విద్యార్థులు శనివారం మంత్రుల నివాస ప్రాంగణాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థులకు మధ్య కొంత సేపు తోపులాట జరిగి, ఉద్రిక్తత నెలకొంది.

10/23/2016 - 04:26

హైదరాబాద్, అక్టోబర్ 22: మిషన్ భగీరథ పనులు తెలంగాణ వ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని భగీరథ వైస్-చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. జనగాం, శ్రీశైలం, రంగారెడ్డి, ఎల్‌ఎండి, పరకాల, వరంగల్, సంగారెడ్డి, మెదక్ సెగ్మెంట్లకు చెందిన ఇంజనీర్లు, ఏజంట్లతో శనివారం ఆయన సమీక్ష జరిపారు. ఈ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పనులు వేగం పుంజుకోవాలని, ముఖ్యమంత్రి కె.

10/23/2016 - 04:25

హైదరాబాద్, అక్టోబర్ 22: అధికార పార్టీలో అంతర్గత సంక్షోభం ఆరంభమైందని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. అందుకే బోగస్ సర్వేలు చేయించుకుంటున్నారని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. తప్పుడు ప్రచారంలో గోబెల్స్‌ను మించిపోయేలా ఉన్నారని ఆయన ముఖ్యమంత్రిని ఉద్ధేశించి అన్నారు.

10/23/2016 - 03:06

గద్వాల, అక్టోబర్ 22: ఆరుగాలం కష్టపడి రాత్రింబవళ్లు శ్రమిస్తున్న అన్నదాతకు నకిలీల మాయలతో అప్పుల ఊబిలోకి కూరుకుపోవడంతో పాటు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు నడిగడ్డలో పెరిగిపోతున్నాయి. తాజాగా అక్షయ, ఇండమ్ 67, అరినామ్, మైకో 99 రకాల మిరప, వంకాయ రైతులు నకిలీ విత్తనాల బారినపడి లక్షలాది రూపాయలు నష్టపోయారు. దీంతో ఆగ్రహించిన రైతులు శనివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి తరలివచ్చి ఆందోళనకు దిగారు.

10/23/2016 - 02:59

నిజామాబాద్, అక్టోబర్ 22: ఉమ్మడి పౌరస్మృతిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేస్తూ ముస్లిం మైనార్టీలు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ముస్లిం పర్సనల్ లాలో తలదూర్చే వ్యవహారానికి కేంద్రం తక్షణమే స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.

Pages