S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/23/2016 - 02:58

మహబూబ్‌నగర్, అక్టోబర్ 22: వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని శంకర సముద్రం రిజర్వాయర్ నుండి శనివారం సాగునీటిని విడుదల చేశారు. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేశారు.

10/23/2016 - 02:57

నకిరేకల్, అక్టోబర్ 22: నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చెందిన కిరాణా వ్యాపారి వీర్లపాటి కృష్ణ (33)కు స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకినట్లు హైదరాబాద్‌లోని ఓనీ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. గత వారం రోజులుగా తీవ్ర జ్వరం రావడంతో అతనిని చికిత్స నిమిత్తం ఓమ్ని ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు శుక్రవారం రాత్రి కృష్ణకు స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారించడంతో నకిరేకల్‌లో కలకలం రేగింది.

10/23/2016 - 02:57

హైదరాబాద్/నల్లకుంట, అక్టోబర్ 22: హైదరబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చదిద్దుతామని గ్రేటర్ ఎన్నికల ముందు ప్రచారం చేసుకుని ఓట్లు దండుకున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం నగరాన్ని విషాద నగరంగా మార్చివేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్, బిజెపి శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం నగరంలో అధ్వాన్నంగా మారిన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని ఫీవర్ ఆసుపత్రి చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.

10/23/2016 - 02:55

హైదరాబాద్, అక్టోబర్ 22: కష్టకాలంలో పార్టీని వెన్నంటి ఉన్న వారిని పార్టీ గుర్తిస్తుందని మంత్రులు అన్నారు. పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్‌గా పెద్ది సుదర్శన్‌రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు కడియం శ్రీహరి, టి హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, ఐకె రెడ్డి, జోగు రామన్న, తుమ్మల నాగేశ్వర్‌రావు, చందూలాల్, ఎంపిలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, వినోద్, సీతారాంనాయక్, కవిత, బాల్క సుమన్ హాజరయ్యరు.

10/23/2016 - 02:51

ఆదిలాబాద్/ఇచ్చోడ, అక్టోబర్ 22: ప్రపంచస్థాయి వాటర్ ర్యాప్లింగ్ సాహస క్రీడలు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గాయత్రి జలపాతం వద్ద శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రానికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాయత్రి జలపాతం తొలిసారి ప్రపంచస్థాయి సాహస క్రీడలకు అతిథ్యమిచ్చింది.

10/23/2016 - 02:50

హైదరాబాద్/ఘట్‌కేసర్, అక్టోబర్ 22: అనుమానాస్పద స్థితిలో ఓ బిటెక్ విద్యార్ధి కళాశాల భవనం పైనుండి పడి మృతి చెందిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సివిఎస్‌ఆర్ కళాశాలలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

10/23/2016 - 02:50

ఆర్మూర్, అక్టోబర్ 22: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి పక్కన గల కల్వర్టుకు ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

10/23/2016 - 02:49

హైదరాబాద్, అక్టోబర్ 22: గిరిజన, బిసి సంక్షేమ శాఖ చేపట్టే సంక్షేమ పథకాలను వేగంగా, సమర్థంగా గిరిజనులకు, బిసిలకు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

10/23/2016 - 02:48

విశాఖపట్నం, అక్టోబర్ 22: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతోంది. ప్రస్తుతం పోర్టు బ్లెయిర్‌కి ఉత్తర వాయువ్యంగా 370 కిలోమీటర్ల వద్ద ఇది కేంద్రీ కృతమైందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. రాగల 24 గంటల్లో ఇది క్రమంగా మయన్మార్ వైపు కదులుతూ తుపానుగా బలపడే అవకాశం ఉందని తెలిపారు.

10/23/2016 - 02:48

హైదరాబాద్, అక్టోబర్ 22: ‘దర్శనమ్’ ఆధ్యాత్మిక మాసపత్రిక ఆధ్వర్యంలో ఉత్తర పశ్చిమ ఆమ్నాయాలైన ద్వారక, జ్యోతిష్ జగద్గురు శంకర పీఠాల అధీశ్వరులైన స్వరూపానంద సరస్వతి స్వామికి ‘గురువందనమ్’ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం అయిదు గంటలకు నిర్వహించనున్నట్లు ‘దర్శనమ్’ సంపాదకులు మరుమాముల వెంకటరమణ శర్మ తెలిపారు.

Pages