S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/07/2016 - 05:06

కరీంనగర్, అక్టోబర్ 6: జిల్లాల విభజన ప్రక్రియ దాదాపుగా పూర్తి కావస్తున్నా..పలు ప్రాంతాల్లోని ప్రజల్లో నెలకొని ఉన్న అసంతృప్తి మాత్రం చల్లారలేదు. నిన్నటిదాకా సిరిసిల్ల జిల్లా కోసం తీవ్రంగా ఆందోళనలు కొనసాగగా, అదే బాటలో హుజురాబాద్ జిల్లా కోసం ఆ ప్రాంతం వాసులు ఉద్యమాన్ని ఆరంభించారు.

10/07/2016 - 05:05

మహబూబ్‌నగర్, అక్టోబర్ 6: రాష్ట్రంలో బిజెపి బలీయమైన శక్తిగా ఎదుగుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని అన్నపూర్ణగార్డెన్‌లో గురువారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు.

10/07/2016 - 05:04

హైదరాబాద్, అక్టోబర్ 6: హైదరాబాద్ కేంద్రంగా మత్తుపదార్థాల దందా కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి సరఫరా చేసిన వంద కిలోల అల్ప్రాజోలంను విశాఖపట్నంలో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మెదక్ జిల్లా పటాన్‌చెరులోని ఓ స్థావరంలో అల్ప్రాజోలం నిల్వలున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు గట్టి నిఘా వేశారు. హైదరాబాద్ నుంచి అల్ప్రాజోలం మత్తుమందును విశాఖపట్నంకు తరలిస్తుండగా పోలీసులు అనుసరించారు.

10/07/2016 - 02:33

భద్రాచలం, అక్టోబర్ 6: ఖమ్మం జిల్లా భద్రాచలం మన్యం ఉద్యమాలతో వేడెక్కుతోంది.

10/07/2016 - 02:30

హైదరాబాద్, అక్టోబర్ 6: జిల్లాల పునర్ వ్యవస్థీకరణను ఆమోదించడానికి శుక్రవారం మంత్రిమండలి కీలక సమావేశం జరుగనుంది. సచివాలయంలో మధ్యహ్నం రెండు గంటలకు జరుగనున్న మంత్రిమండలి సమావేశంలో జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై జారీ చేసిన ముసాయిదా మంత్రిమండలి చర్చించనుంది.

10/07/2016 - 02:28

హైదరాబాద్, అక్టోబర్ 6: జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఏకపక్ష వైఖరిని అవలంభిస్తున్నారని టిపిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. దీని వల్ల న్యాయపరమైన సమస్యలు తలెత్తవన్నారు.

10/07/2016 - 02:27

హైదరాబాద్, అక్టోబర్ 6: అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీ ఆఫ్ ఇండియా(ఆస్కి)ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ చేపట్టామని సంస్థ చైర్మన్ , కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి కె పద్మనాభయ్య పేర్కొన్నారు. ఇందుకోసం తాము అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేశామని అన్నారు.

10/07/2016 - 02:26

హైదరాబాద్, అక్టోబర్ 6: హైదరాబాద్ మియాపూర్‌లో బయట పడ్డ డ్రగ్స్ దందా మూలాలు నిందితులను విచారిస్తున్న కొద్దీ విస్తరిస్తూ పోతున్నాయి. ఈ కేసులో ఓ సైంటిస్ట్‌ను అరెస్టు చేసిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అతని కుటుంబ సభ్యులను విచారించినప్పుడు ఓ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ రాజశేఖర్ రెడ్డి పాత్రను గుర్తించి అతణ్ణి నాందేడ్‌లో అదుపులోకి తీసుకున్నారు.

10/07/2016 - 02:25

హైదరాబాద్, అక్టోబర్ 6: ప్రతీ శాఖలో డిపిసి నిర్వహించి పదోన్నతులు కల్పించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు శాఖాధిపతులను ఆదేశించారు. సీనియారిటీ ప్రాతిపదికన జిల్లా అధికారుల నియామకం జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో గురువారం శాఖాధిపతులతో జరిగిన మధ్యాహ్నం సెషన్‌లో జిల్లాల పునర్విభజనలో అధికారులు, ఉద్యోగుల నియామకంపై ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు.

10/07/2016 - 02:24

హైదరాబాద్, అక్టోబర్ 6: సుపరిపాలన సాగించి బంగారు తెలంగాణను ఆవిష్కరించి తీరుతామే కానీ ప్రజలకు ఎప్పటికీ ద్రోహం చేయబోమని, ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే ఉరేసుకొని చస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ రైతు పరామర్శ యాత్రలు, సిపిఎం మహాజన పాదయాత్రలు చేస్తామంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Pages