S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/30/2015 - 03:15

హైదరాబాద్, నవంబర్ 29: ప్రాజెక్టుల రీ-డిజైన్‌కు అనుగుణంగా కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం జరగాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. అలాగే గతంలో నిర్మించిన ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు రీ-డిజైన్ల ద్వారా ఆయకట్టు స్థిరీకరణ జరిగేలా కాల్వలు, ప్రాజెక్టులకు మరమ్మతులు నిర్వహించాలని సూచించారు.

11/28/2015 - 15:23

వరంగల్‌ : డోర్నకల్‌ రైల్వేస్టేషన్‌లో శనివారం సాయినగర్‌-విశాఖ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ నుంచి పొగలు వెలువడ్డాయి. బ్రేక్‌ పట్టేయడంతో ఏసీ బోగీ కింద నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేసి తనిఖీ చేపట్టారు.

11/28/2015 - 11:26

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా పులిమడుగులో పోలీసు, అటవీ, ఎక్సైజ్ సిబ్బంది శనివారం ఉదయం దాడులు చేసి, భారీగా గుడుంబా, బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు. 30 బైక్‌లను, లక్ష రూపాయలు విలువచేసే టేకు కలపను కూడా స్వాధీనం చేసుకొని పది మందిని అరెస్టు చేశారు.

11/28/2015 - 11:25

మహబూబ్‌నగర్: దౌలతాబాద్ మండలం చంద్రకల్‌లో తండ్రీ, వదినలను రోకలి బండతో మోది మతిస్థిమితం లేని వ్యక్తి హత్యలకు పాల్పడ్డాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

11/28/2015 - 11:25

నల్గొండ: భువనగిరి రైల్వేస్టేషన్‌లో శనివారం ఉదయం రైల్వే పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రయాణీకుల బ్యాగులను, ఇతర సామాగ్రిని పరిశీలించారు. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు.

11/28/2015 - 11:24

మెదక్: పొలంలో మూత వేయకుండా వదిలేసిన బోరుబావిలో మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయిన సంఘటన పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండా వద్ద శనివారం ఉదయం జరిగింది. ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్న బాలుడు బోరు బావిలో పడిపోవటాన్ని చూశామని తల్లిదండ్రులు మొగులమ్మ, సాయిలు చెబుతున్నారు. ఉదయానే్న పొలానికి నీరు పెట్టాక బోరుబావిపై తాను మూత పెట్టలేదని సాయిలు తెలిపాడు.

11/28/2015 - 06:09

హైదరాబాద్, నవంబర్ 27: వరంగల్ ఘన విజయంతో ఊపుమీదున్న తెరాస, రాజధాని గుండె గ్రేటర్‌పై దృష్టిపెట్టింది. జిహెచ్‌ఎంసి ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న తెరాస, ఇప్పటికే నగరవ్యాప్తగా ప్రభుత్వ పథకాలతో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటుచేసి ప్రచారం మొదలుపెట్టింది. సగటున ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబానికి ఆసరా పథకం కింద నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ అందుతోంది.

11/28/2015 - 06:08

నల్లగొండ, నవంబర్ 27: నల్లగొండ జిల్లా అంతటా వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ మూసీ నది చలవతో చెరువులు నిండుగా ఉండటంతో ఆయకట్టులో రబీ వరి పంటలు పండించాలనుకున్న రైతుల ఆశలకు బ్రేక్ పడింది.

11/28/2015 - 06:07

వరంగల్, నవంబర్ 27: వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణమేమిటి..? సొంత పార్టీ మనుషులే తమ అభ్యర్థికి వెన్నుపోటు పొడిచారా...? అనేక ఆటుపోట్లు ఎదురైనా సందర్భాల్లోనూ తట్టుకొని నిలబడిన కాంగ్రెస్‌కు ఇంతటి అపజయం ఎదురుకావడం వెనక తమ పార్టీ మనుషుల హస్తమే ఉన్నట్లు అధిష్ఠాన వర్గం అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు అధికార పార్టీ జోరు..!

11/28/2015 - 06:06

ములుగు టౌన్, నవంబర్ 27: వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా పరిధిలోని ప్రాజెక్ట్‌నగర్ గ్రామ శివారులో దర్వాజగుట్ట వద్ద ఒర్రెలో శుక్రవారం డిఎస్పీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యంలో డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ ఎస్పీ జాన్‌వెస్లీ ములుగు డిఎస్పీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

Pages