S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/05/2016 - 01:57

హైదరాబాద్, అక్టోబర్ 4: కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ తాను అనుకున్నది సాధించారా? లేక ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కొన్ని అనుకోని, తప్పనిసరి పరిస్థితుల్లో గద్వాల జిల్లా ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారా? అనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మంగళవారం ఆమె గాంధీభవన్‌కు చేరుకున్నప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు అభినందనలు తెలిపారు. నిజానికి ఆమె అనుకున్నది సాధించినట్లేనా?

10/05/2016 - 01:56

పటన్‌చెరు, అక్టోబర్ 4: అకారణంగా తిట్టారని, విచక్షణారహితంగా కొట్టారని మెదక్ జిల్లా పటన్‌చెరు ఎమ్మెల్యే డ్రైవరు, గన్‌మెన్‌లపై రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కంజర్ల యాదగిరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పెట్టీ కేసు నమోదు చేసారు. దీనికి సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

10/04/2016 - 05:02

సిరిసిల్ల, అక్టోబర్ 3: గత 50 రోజుల పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కరీంనగర్ జిల్లాలో కొత్తగా సిరిసిల్ల జిల్లాను ప్రకటించింది. అలుపెరుగని రీతిలో జిల్లా సాధన ఉద్యమం ప్రారంభం కావడంతో క్రమక్రమంగా పోరాటం తీవ్ర రూపం దాల్చడంతో సిరిసిల్ల జిల్లా అనివార్యంగా మారింది.

10/04/2016 - 05:01

మంచిర్యాల, అక్టోబర్ 3: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం గుడిపేట గ్రామంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో గల్లంతైన జాలర్లను ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం రక్షించింది. వివరాల్లోకి వెళ్తే.. గుడిపేట గ్రామానికి చెందిన జాలర్లు దర్మాదీ రాజేష్, కూనారపు సంతోష్‌తో పాటు మరో పది మంది ఆదివారం ఉదయం 8 గంటలకు చేపల వేటకు వెళ్లారు.

10/04/2016 - 05:00

హైదరాబాద్, అక్టోబర్ 3: అమెరికాలో భారతీయ మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కాలిఫోర్నియా స్టేట్‌లోని శాన్‌ఫ్రాన్సిస్కో సమీపంలోని ప్రీమాంట్ నగరంలో ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భారతీయులు ఈ వేడకుల్లో పాల్గొన్నారు.

10/04/2016 - 05:00

గద్వాల, అక్టోబర్ 3: నడిగడ్డ ప్రజల ఆకాంక్ష అయిన గద్వాల జిల్లా సాధన కోసం అనేక రూపాల్లో ప్రభుత్వానికి శాంతియుతంగా ఉద్యమరూపంలో నిరసనలు తెలియజేశామని, అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో రాజీనామాకు పూనుకున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ స్పష్టం చేశారు. తన రాజీనామాతో నడిగడ్డ ప్రజల ఆకాంక్ష అయిన గద్వాల జిల్లా కోరిక నెరవేరిందని ఆమె అన్నారు.

10/04/2016 - 04:59

వరంగల్, అక్టోబర్ 3: వరంగల్ జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు ఉత్కంఠకు తెరపడింది. జిల్లాల ఏర్పాటు ఫైనల్ ముసాయిదా రాకముందే నరాలు తెగే ఉత్కంఠానికి ముఖ్యమంత్రి కెసిఆర్ తెరదించారు. సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన కొత్త జిల్లాల ఏర్పాటుపై వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా ప్రతిపాదన, జనగామ జిల్లా ఏర్పాటుపై ప్రధానంగా చర్చకువచ్చింది.

10/04/2016 - 04:58

హైదరాబాద్, అక్టోబర్ 3: తెలంగాణ రాష్ట్రంలోని ఏడు వ్యవసాయ మార్కెట్లకు పాలక వర్గాలను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి టి. హరీష్‌రావు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు మార్కెట్ కమిటీకి నల్లగంటి వెంకటయ్యను చైర్మన్‌గా నియమించారు.

10/04/2016 - 04:58

వరంగల్, అక్టోబర్ 3: తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు, పరిశ్రమలకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, అయితే ప్రాజెక్టుల పేరుతో రైతుల నుండి ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తే సహించేదిలేదని రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్‌సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి హెచ్చరించారు. సోమవారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

10/04/2016 - 04:57

భద్రాచలం, అక్టోబర్ 3: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొండగావ్ జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. సటేబయానార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్లీ అటవీ ప్రాంతంలో జిల్లా బలగాలు, చత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ పోలీసులు సంయుక్తంగా సోమవారం ఉదయం కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో వీరిని చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసు బలగాల ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు.

Pages