S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/04/2016 - 04:57

హైదరాబాద్, అక్టోబర్ 3: కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయలేదని టిఆర్‌ఎస్ ఎంపిలు బి. వినోద్, బాల్కసుమన్‌లు విమర్శించారు. ఇద్దరు ఎంపిలు సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాజీనామా పేరుతో డ్రామా ఆడుతున్నారని అన్నారు. సరైన ఫార్మెట్‌లో రాజీనామా లేఖ ఇవ్వాలి కానీ చెత్త బుట్టలో వేయాల్సిన విధంగా లేఖ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. సరైన ఫార్మెట్‌లో రాజీనామా లేదని వినోద్ తెలిపారు.

10/04/2016 - 04:56

హైదరాబాద్, అక్టోబర్ 3: రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలోని మన టీవీ కార్యక్రమాలను కేబుల్ ద్వారా కూడా ప్రసారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ చెప్పారు. మన టీవీ ఛానల్ ప్రసారాలను కేబుల్ ద్వారా ప్రసారం చేసేందుకు రాష్ట్ర ఎమ్మెస్వోలు అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ యువతకు ఉపయోగపడే కార్యక్రమం కనుక తాము ప్రసారం చేస్తామని ఎంఎస్‌ఓలు చెప్పారని అన్నారు.

10/04/2016 - 04:56

హైదరాబాద్, అక్టోబర్ 3: కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎ.రేవంత్ రెడ్డి సోమవారం ఇందిరా పార్కు వద్ద దీక్ష చేశారు. వంశీచంద్ చేపట్టిన దీక్షా శిబిరం వద్దకు కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, సిఎల్‌పి నేత కె.జానారెడ్డి, టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి తదితరులు విచ్చేసి మద్దతు ప్రకటించారు.

10/04/2016 - 04:10

హైదరాబాద్, అక్టోబర్ 3: ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు టిఎస్‌ఆర్టీసి ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకుంది. పారిస్‌లోని రెజీ ఆటోనోమి డెన్ ట్రాన్స్‌పోర్ట్స్ పరిషియన్స్ (ఆర్‌ఎటిపి) కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తరఫున చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణారావు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఫాస్కల్ సమక్షంలో ఎంఓయు కుదుర్చుకున్నారు.

10/04/2016 - 04:08

పది జిల్లాలు 31 జిల్లాలుగా ఇలా...

10/04/2016 - 04:08

హైదరాబాద్, అక్టోబర్ 3:శాసన మండలి సభ్యత్వానికి మాజీ మంత్రి ఫరీదుద్దీన్ టిఆర్‌ఎస్ తరపున సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో ఫరీదుద్దీన్ ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. శాసన సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసేప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.

10/04/2016 - 04:05

హైదరాబాద్, అక్టోబర్ 3: కొత్త జిల్లాల ఏర్పాటు అంటే తేనె తుట్టెను కదపడమే అనే భావనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ జోలికి వెళ్లలేదు. దేశంలో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు జిల్లాల పునర్విభజన చేశాయి. తెలంగాణ ఉద్యమ కాలం నుంచే తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని కెసిఆర్ చెబుతూ వచ్చారు.

10/04/2016 - 04:15

హైదరాబాద్, అక్టోబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాల్లో వ్యవసాయ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి, వ్యవసాయ శాఖ కమిషనర్ (ఎఫ్‌ఎసి) సి. పార్థసారథి ఆదేశించారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశాలపై సోమవారం ఆయన వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో సమీక్షించారు. అడిషనల్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు తదితరులతో సమావేశం ఏర్పాటు చేశారు.

10/04/2016 - 04:02

హైదరాబాద్, అక్టోబర్ 3: ప్రపంచంలో 27 దేశాలకు చెందిన దాదాపు 5వేల మంది పరిశోధకులు, విద్య, విజ్ఞానం, సంస్కృతి రంగాలతో పాటు ఇంజనీర్లు, గణిత శాస్తవ్రేత్తలతో నిర్వహించే ఫేమ్ ల్యాబ్ నిర్వహించేందుకు బ్రిటిష్ కౌన్సిల్ ఏర్పాట్లు చేస్తోంది. 20 నుండి 40 ఏళ్ల మధ్య ఉన్న ఔత్సాహిక శాస్తవ్రేత్తలు అక్టోబర్ 30లోగా తమ దరఖాస్తులను సమర్పించాలని బ్రిటిష్ కౌన్సిల్ ఇండియా ఒబిఇ డైరెక్టర్ అలన్ గెమ్మల్ చెప్పారు.

10/04/2016 - 04:01

హైదరాబాద్, అక్టోబర్ 3: పాక్ ఉగ్రవాద శిబిరాలపై మన దేశ సైన్యం దాడి చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ట మరింత పెరిగిందని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టి.టిడిపి నేతలతో అన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో తెలంగాణ పార్టీ ముఖ్యులతో సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.

Pages