S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/04/2016 - 04:00

హైదరాబాద్, అక్టోబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో కల్తీమద్యం, సారాల వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు తెలియచేసేందుకు భారీ ఎత్తున ప్రచారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదుకోట్ల రూపాయలను సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు రెవెన్యూ (ఎక్సైజ్-2) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించిన చర్యలను తీసుకోవాలని కమిషనర్‌లను ఆదేశించారు.

10/04/2016 - 04:00

హైదరాబాద్, అక్టోబర్ 3: ఈ సారి రాష్టవ్య్రాప్తంగా మంచి వర్షాలు కురవడంతో రబీలో రైతులు ప్రతీ ఎకరం సాగు చేసుకునేందుకు పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రబీ సీజన్‌కల్లా రాష్ట్రంలో అన్ని రకాలుగా తొమ్మిది వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటుందని మరో వెయ్యి మెగావాట్లు చత్తీస్‌గడ్ నుంచి అందుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

10/04/2016 - 03:59

హైదరాబాద్, అక్టోబర్ 3: కొత్తగా తెరపైకి వచ్చిన ఆసిఫాబాద్ జిల్లాలను 15 మండలాలతో ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని సోమవారం ముఖ్యమంత్రితో జరిగిన సమాలోచనలో విజ్ఞప్తి చేశారు.

10/04/2016 - 03:58

హైదరాబాద్, అక్టోబర్ 3: రాష్ట్రం బంగారు తెలంగాణ కాదు బకాయిల తెలంగాణగా మారిందని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ధనిక రాష్ట్రం అని ఇంత కాలం గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బకాయిల, అప్పుల తెలంగాణగా ఎందుకు మారిందో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశాలపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.

10/03/2016 - 08:43

హైదరాబాద్, అక్టోబర్ 2: గోదావరి పరివాహక ప్రాంతాల్లో జోరుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ వరద నీటితో నిండిపోయ్యాయి. భారీ వర్షాలతో మెదక్ జిల్లాలో సింగూర్ ప్రాజెక్టు గేట్ల పై నుంచి కూడా నీరు కిందకు ప్రవహించే పరిస్థితి. హఠాత్తుగా వచ్చిన వరదలతో జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.

10/03/2016 - 08:42

హైదరాబాద్, అక్టోబర్ 2: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు వీలుగా వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టి.పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయం సంక్షోభంలో ఉంటే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని విమర్శించారు.

10/03/2016 - 08:42

హైదరాబాద్, అక్టోబర్ 2: దసరా సీజన్ వచ్చిందంటే వివిధ వస్త్ర దుకాణాలు, ఎలక్ట్రానిక్స్, జెవెల్లర్స్ వంటి సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తారు. ఈ షాపింగ్ సైట్లు ఇప్పటికే పండగ ఆఫర్లతో ముందుకు వచ్చేశాయి. ఇలాంటి సమయంలో తాము మాత్రం ఎందుకు వెనకబడాలనో..లేదా రద్దీని దృష్టిలో పెట్టుకొని చలాన్లు సంఖ్య పెరుగుతుందనో తెలియదు కానీ..హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం వాహనచోదకులకు దసరా ఆఫర్ ప్రకటించింది.

10/03/2016 - 08:40

హైదరాబాద్, అక్టోబర్ 2: ప్రభుత్వం రాష్ట్ర పండుగగా జరుపుతున్న బతుకమ్మ సంబురాలను పురస్కరించుకొని సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో నాలుగు జిల్లాల్లోని అన్ని ఏరియాల్లో సింగరేణి కుటుంబ ఉత్సవాలు (్ఫ్యమిలీ డే) ఘనంగా నిర్వహించాలని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ ఉత్తర్వులు జారీ చేశారు.

10/03/2016 - 08:40

హైదరాబాద్, అక్టోబర్ 2: హైదరాబాద్‌లోని గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది. నగరవ్యాప్తంగా సరఫరా చేస్తున్న గుడుంబా కేంద్రంగా పేరుమోసిన ధూల్‌పేటలో ఎక్సైజ్ అధికారుల ఆపరేషన్ ధూల్‌పేట విజయవంతమైంది. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా గుడుంబా రహిత జిల్లాగా హైదరాబాద్‌ను ప్రకటించే క్రమంలో ఎక్సైజ్ శాఖ నగరంలోని గుడుంబా స్థావరాలపై విరుచుకుపడింది.

10/03/2016 - 08:39

హైదరాబాద్, అక్టోబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఖ్యను కుదించకూడదని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) విజ్ఞప్తి చేసింది. ట్రెసా అధ్యక్షుడు ఎం. శివశంకర్ నేతృత్వంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం ఇక్కడ జరిగింది. రెవెన్యూకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సందర్భంగా తీర్మానాలు చేశారు.

Pages