S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/09/2020 - 01:16

హైదరాబాద్, మార్చి 8: 2020-21 వార్షిక బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేశామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఆర్థిక మాంద్యం ఉన్నా, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు కోత పెట్టినా సంక్షేమ రంగానికి తగ్గించక లేదని ఆయన గుర్తు చేశారు.

03/09/2020 - 01:12

హైదరాబాద్, మార్చి 8: ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 2020-21 సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి సమతుల్యతతో ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభినందించారు. ఇది సంక్షే మ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్‌గా సీఎం అభివర్ణించారు. రాష్ట్ర ఆదాయ వనరులు-రాష్ట్ర ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్‌గా పేర్కొన్నారు.

03/09/2020 - 01:06

హైదరాబాద్, మార్చి 8: తెలంగాణ రాష్ట్రానికి 1,82,914.42 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు శాసనసభకు ఆదివారం సమర్పించారు. రెవెన్యూ వ్యయం 1,38,669.82 కోట్ల రూపాయలుగా ఉంటుందని, క్యాపిటల్ వ్యయం 22,061.18 కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలిపారు. రెవెన్యూ మి గులు 4,482.12 కోట్ల రూ.లుగా ఉంటుందని, ఆర్థిక లోటు 33,191.25 కోట్ల రూపాయలని వివరించారు.

03/08/2020 - 05:38

హైదరాబాద్, మార్చి 7: పౌరసత్వసవరణ చట్టం సెక్యులర్ దేశానికి వ్యతిరేకమని, దీనిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. శనివారం ఆయన గవర్నర్‌కు ధన్యవాదాలు తెలియచేసే తీర్మానంపై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ పౌరసత్వసవరణ చట్టం తెచ్చారు. కాని ఇందులో ఎంత కాలం ఈ చట్టం అమలులో ఉంటుందనే క్లాజు లేదు. కటాప్ తేదీ ఉండాలి.

03/08/2020 - 05:37

హైదరాబాద్, మార్చి 7: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో తాము గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్భ్రావృద్ధికి ఏమి చేశామో చెప్పకుండా, సమైక్యపాలపై విమర్శలు చేయడం అప్రస్తుతమని కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

03/08/2020 - 05:36

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణ సాధన వెనుక ఎంతో కష్టం ఉందని, తెలంగాణ సాధించిన తర్వాత కూడా దానినో విఫల ప్రయోగంగా చూపించాలని చాలా మంది ప్రయత్నించారని, అయినా తాము ప్రజల మన్ననలను అందుకున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పేర్కొన్నారు.

03/08/2020 - 05:35

హైదరాబాద్, మార్చి 7: సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌ఆర్‌సీ అంశాలపై కుండబద్దలు కొట్టినట్లు సభలో మాట్లాడుకుందామని, అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శనివారం ఆయన సభలో మాట్లాడుతూ ఈ అంశాలపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అనవసరంగా మాట్లాడి ఉద్రిక్తతలు సృషించవద్దని కోరారు. ఈ అంశంపై అవసరమతే ఒక రోజంతా మాట్లాడుకుందామన్నారు.

03/08/2020 - 05:31

ఖైరతాబాద్, మార్చి 7: ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున డీసీసీబీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు అడ్డుకున్నారని మండిపడ్డారు.

03/08/2020 - 05:30

హైదరాబాద్, మార్చి 7: ప్రశ్నించే గొంతు నొక్కుతారా ? గవర్నర్ చేత అవాస్తవాలను ప్రజలకు తెలియచేశారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన వాళ్లం. ఇక్కడ ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు మాకుంది. ప్రజాస్వామ్య పార్టీలను గౌరవించరా ? తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా ? డబ్బులు పంపిణీ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచారు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రాష్ట్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

03/08/2020 - 05:29

హైదరాబాద్, మార్చి 7: తమ పార్టీకి చెందిన ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు అనసూయ, రాజ్‌గోపాల్ రెడ్డి బాగా మాట్లాడారని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అడ్డగోలుగా మాట్లాడారన్నారు. ప్రభుత్వం నుంచి సమాధానం లేక విషయం లేని దయాకరరావు రెచ్చిపోయి ప్రసంగించారన్నారు.

Pages