S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/14/2016 - 05:19

వరంగల్, సెప్టెంబర్ 13: వరంగల్ నగరంలోని కాజీపేట సహృదయ వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు చోటు మరోసారి తన మానవత్వాన్ని చాటారు. సహృదయ వృద్ధాశ్రమంలో హన్మకొండ కుమార్‌పల్లి ప్రాంతానికి చెందిన ఐలోని బొందమ్మ (85) అనారోగ్యంతో మృతిచెందింది. ఈ మేరకు వారి బంధువులకు సమాచారం ఇచ్చినా ముందుకు రాకపోవడంతో సహృదయ వ్యవస్థాపకుడు చోటునే మంగళవారం ఆమెకు తలకొరివి పెట్టాడు.

09/14/2016 - 03:03

హైదరాబాద్, సెప్టెంబర్ 13: బిజెపి నిర్వహిస్తున్న తిరంగా యాత్ర మంగళవారం వర్షంలోనే కొనసాగింది. హైదరాబాద్‌లో ఉదయం 11 గంటలకు నిజాం కళాశాల ఎదురుగా ఉన్న బాబూ జగ్జీవన్ రాం విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు తిరంగా యాత్ర జరిగింది. ఆ సమయంలో వర్షం కురవడంతో కార్యకర్తలు పలచగా హాజరయ్యారు.

09/14/2016 - 03:02

హైదరాబాద్/ ఖైరతాబాద్, సెప్టెంబర్ 13: స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా నేటికి దళితులపై వివక్ష కొనసాగడం సిగ్గుచేటని పలువురు వక్తలు అన్నారు. అత్యున్నత బోధనాలయాల్లో సైతం వివక్ష తారాస్థాయికి చేరిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

09/14/2016 - 03:01

హైదరాబాద్, సెప్టెంబర్ 13: నిజాం నవాబును తరిమికొట్టి హైదరాబాద్ రాష్ట్రానికి, తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలన్న డిమాండ్ అధికార తెరాసకు ఇరకాటంగా పరిణమించింది.

09/14/2016 - 03:00

హైదరాబాద్, సెప్టెంబర్ 13: గ్యాంగ్‌స్టర్ నరుూం అక్రమాల కేసులో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లకు అందుతున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని ఈ కేసు దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది. రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లకు అందిన ఫిర్యాదులను సిట్ పరిశీలించింది. ప్రాథమిక ఆధారాలు ఉన్నందున మరో 30 కేసులను నమోదు చేయాలని సిట్ నిర్ణయించింది.

09/14/2016 - 02:58

హైదరాబాద్, సెప్టెంబర్ 13: డిండి ప్రాజెక్టు పరిధిలో నిర్మిస్తున్న శివన్న గూడెం, సీతారామా జలాశయాల టెండర్లు రద్దు చేయాలని ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పొంగులేటి మంగళవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. కాంట్రాక్టు సంస్థలు అంచనాలు పెంచి టెండర్లు వేశాయని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

09/14/2016 - 02:58

హైదరాబాద్, సెప్టెంబర్ 13: ఖాయిలాపడిన అజంజాహి ఇండస్ట్రీస్, డిబిఆర్ మిల్స్, ప్రాగాటూల్స్, ఆటో అల్విన్, డక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ, ఐడిపిఎల్ కంపెనీ, హెచ్‌సియల్ వంటి కంపెనీలను తిరిగి తెరిపించేందుకు చర్యలు చేపట్టాలని టిఎన్‌టియుసి రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

09/14/2016 - 02:37

హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణలో నిర్వహించిన ఎమ్సెట్-3 అభ్యంతరాల పరిశీలన కార్యక్రమం మొదలైంది. నిబంధనల ప్రకారం సిలబస్‌కు లోబడి ప్రశ్నాపత్రాన్ని రూపొందించడం జరిగిందని ఎమ్సెట్-3 కన్వీనర్ డాక్టర్ యాదయ్య తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అభ్యంతరాలను పరిశీలించడం జరుగుతుందని అన్నారు. ప్రశ్నాపత్రాన్ని నిపుణులతోనే రూపొందించామని, అలాగే సిలబస్‌ను పరిగణనలోకి తీసుకున్నామని అన్నారు.

09/14/2016 - 02:30

హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో నైరుతీరుతుపవనాలు బలంగా ఉన్నాయి. రుతుపవనాలకు తోడుగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండం, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లో గత నాలుగైదు రోజుల నుండి ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

09/14/2016 - 02:29

గోదావరిఖని, సెప్టెంబర్ 13: నెల రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టియుసిపై హెచ్‌ఎంఎస్ ఐక్య ఫ్రంట్ విజయ ఢంకా మోగించింది. మంగళవారం జరిగిన పోలింగ్‌లో 693కు గాను 664 ఓట్లు పోలయ్యాయి. వీటిలో హెచ్‌ఎంఎస్ ఐక్య ఫ్రంట్ 311, ఐఎన్‌టియుసికి 290, బిఎం ఎస్‌కు 62, ఎన్‌టికెకు 1 ఓటు లభించాయి. ప్రధానంగా హెచ్‌ఎంఎస్, ఐఎన్‌టియుసిల మధ్య పోరు కొనసాగింది.

Pages