S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/14/2016 - 02:26

కరీంనగర్/ఆదిలాబాద్/సెప్టెంబర్ 13: ఓ వైపు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ప్రారంభించేందుకు జిల్లా అధికార యంత్రాంగమంతా అన్ని ప్రక్రియలు వేగంగా పూర్తి చేస్తుంటే.. మరోవైపు ప్రభుత్వం జారీచేసిన జిల్లాల ముసాయిదాపై కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల అదే తీరుగా ఆందోళన కార్యక్రమాలు మంగళవారం కూడా కొనసాగాయి.

09/14/2016 - 02:25

హైదరాబాద్, సెప్టెంబర్ 13: రంగారెడ్డి జిల్లా మంచాల ఇన్‌స్పెక్టర్ గంగాధర్ ఉన్నాతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. రెండు రోజుల కిందట ఇండియన్ నేషనల్ ర్యాలీ సంస్థ చేపట్టిన బైక్ రేసింగ్‌కు అనుమతి లేదంటూ గంగాధర్ అడ్డుకుని వారిపై చేయి చేసుకున్నారు. ఈ విషయాన్ని నిర్వాహకులు మంత్రి కేటిఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

09/14/2016 - 02:24

నల్లగొండ, సెప్టెంబర్ 13: తెలంగాణకు అన్యాయం చేసేలా గతంలో పోతిరెడ్డిపాడు కాల్వను విస్తరించినప్పుడు, పులిచింతల ప్రాజెక్టుతో 14 గ్రామాలను ముంచినప్పుడు తమ పదవులను కాపాడుకునేందుకు ఆనాటి సీమాంధ్ర ప్రభుత్వాలను ప్రశ్నించలేని కాంగ్రెస్ నేతలు ఎస్.జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల నేడు మల్లన్న సాగర్ రిజర్వాయర్ ముంపుపై రాజకీయ గగ్గోలు పెడుతున్నారని నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి

09/14/2016 - 02:23

నిజామాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణ జిల్లాల్లో వేళ్లూనుకుపోయిన వర్దీ బీడీల తయారీపై అధికారుల నిఘా పూర్తిగా సన్నగిల్లింది. పిఎఫ్ గుర్తింపు కలిగి ఉన్న కార్మికులకు పనిదినాల్లో కోతలు పెడుతూ, నాన్ పిఎఫ్ కార్మికులతో గుట్టుగా వర్దీ బీడీలు తయారు చేయించి నెలనెలా కోట్లాది రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు.

09/14/2016 - 02:22

సంగారెడ్డి, సెప్టెంబర్ 13: అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మెదక్ జిల్లా అంతటా వర్షం కురుస్తోంది. పొరుగు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తుండటంతో జలాశయాలకు జలకళ సంతరించుకోగా మెదక్ జిల్లాలో మాత్రం వరుణుడు తుంపర్లకే పరిమితమయ్యాడు. దీంతో ప్రధాన జలాశయమైన సింగూర్‌లోకి చుక్క నీరు కూడా చేరలేదంటే ఆశ్చర్యపడాల్సిందే.

09/14/2016 - 02:21

హైదరాబాద్, సెప్టెంబర్ 13: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నదే తప్ప అందుకు అవసరమైన ప్రభుత్వ ఉద్యోగుల నియామకాన్ని విస్మరిస్తున్నదని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య విమర్శించారు. జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల సంఖ్య పెంచడంతోనే సరిపోదని, అదనంగా 35 వేల ఉద్యోగులను భర్తీ చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రాసిన లేఖలో కోరినట్లు ఆయన వివరించారు.

09/14/2016 - 02:21

హైదరాబాద్, సెప్టెంబర్ 13: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు పబ్లిక్ సర్వీసు కమిషన్లు ఏర్పాట్లు పూర్తి చేశాయి. మంగళవారం నాడు ఆంధ్రాలో గ్రూప్-1 పరీక్షలు ప్రారంభం కాగా, తెలంగాణలో బుధవారం నుండి ఈ పరీక్షలు మొదలవుతాయి. బుధవారం బక్రీద్ ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం 13న జరగాల్సిన ఇంగ్లీషు పరీక్షను 24కు వాయిదా వేసింది.

09/14/2016 - 01:33

హైదరాబాద్, సెప్టెంబర్ 13: ఉన్నఫళంగా 10 జిల్లాలు 27 జిల్లాలుగా రూపాంతరం చెందుతుండటంతో ప్రభుత్వానికి ఎదురవుతున్న ప్రధాన సమస్య ఉద్యోగులు. పది జిల్లాల ఉద్యోగులను 27 జిల్లాలకు సర్దడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. కొత్త జిల్లాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు డబ్బులుంటే సరిపోతుంది. ప్రభుత్వానికి నిధులు ఇబ్బంది కలిగించే అంశమే కాదు. అయితే ఉద్యోగుల కొరత డబ్బులతో తీర్చేది కాదు.

09/14/2016 - 01:35

హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలుగు రాష్ట్రాల్లో నైరుతీ రుతుపవనాలు బలంగా ఉన్నాయి. గత 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మరో 24 గంటల్లో (బుధవారం రాత్రి వరకు) ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) శాస్తవ్రేత్త ఎకె సింగ్ తెలిపారు. పశ్చిమమధ్య బంగాళాఖాతం, కోస్తాతీరంలో ఏర్పడ్డ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందన్నారు.

09/14/2016 - 01:22

హైదరాబాద్, సెప్టెంబర్ 13: కొత్తగా వచ్చే 17 జిల్లాలు ఏవో తేలిపోయాయి. జిల్జా కేంద్రాలూ నిర్ణయమైపోయాయి. ఇక తేలాల్సింది జిల్లా కలెక్టరేట్లు, అవి ఎక్కడ నిర్మిస్తారోనన్న విషయం మాత్రమే. కొత్త జిల్లాల వ్యవహారం దాదాపు కొలిక్కి వచ్చేయడంతో, రియల్టర్లు వీటిపై దృష్టి సారించారు. సహజంగా జిల్లా కేంద్రాల్లో భూముల ధరలకు రెక్కలొస్తాయి.

Pages