S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/13/2016 - 05:18

కోదాడ, సెప్టెంబర్ 12: నల్లగొండ జిల్లా కోదాడ మున్సిపాలిటీకి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ స్కోచ్ జాతీయ అవార్డు లభించింది. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న చెత్త సేకరణ, రవాణా, రీసైకిలింగ్‌లపై ముంబైలో జరిగిన ఎంపికలో మున్సిపల్ చైర్‌పర్సన్ వంటిపులి అనిత నాగరాజు స్వయంగా ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఆధారంగా కోదాడ మున్సిపాలిటీకి స్కోచ్ సంస్ధ జాతీయస్థాయిలో గోల్డెన్ అవార్డును ప్రకటించింది.

09/13/2016 - 05:17

హైదరాబాద్, సెప్టెంబర్ 12: మంగళవారం జరుగనున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఎపి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ వేర్వేరు ప్రకటనలలో శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ సహనం, త్యాగానికి ప్రతీకగా వారు తమ సందేశాల్లో పేర్కొన్నారు.

09/13/2016 - 05:17

గజ్వేల్, సెప్టెంబర్ 12: ఉద్యోగం కోసం సిఎం కెసిఆర్‌ను కలవడానికి ప్రయత్నించిన ఓ యువకుడిని ఎర్రవెల్లి ఫాంహౌస్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో మనస్తాపానికి గురై మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌లో టవర్ ఎక్కి నిరసన తెలిపిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శంకర్ పోలీసు ఉద్యోగంతోపాటు వివిధ పోటీ పరీక్షలు రాసాడు.

09/13/2016 - 05:16

హైదరాబాద్, సెప్టెంబర్ 12: కొత్త జిల్లాకు కోటి రూపాయలు, పాత జిల్లాలకు రూ. పాతిక లక్షలు చొప్పున మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని కోసం మొత్తం 19కోట్ల 25లక్షలు మంజూరు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పది జిల్లాలు ఉండగా, హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాలను విభజిస్తూ మొత్తం 27 జిల్లాలను చేస్తున్నారు. వీటిలో పదిహేడు కొత్త జిల్లాలు.

09/13/2016 - 05:15

నల్లగొండ/ కరీంనగర్/ వరంగల్, సెప్టెంబర్ 12: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రక్రియపై ప్రజల నుండి అభ్యంతరాలు, నిరసనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి.

09/13/2016 - 04:48

హైదరాబాద్, సెప్టెంబర్ 12: జిల్లాల పునర్విభజనపై ఈ నెల 21 లేదా 22న తుది నోటిఫికేషన్ జారీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల పునర్ విభజనపై గత నెల 22న ముసాయిదా విడుదల చేసిన విషయం తెలిసిందే. ముసాయిదాలోని ప్రతిపాదిత జిల్లాలు, డివిజన్లు, మండలాలపై అభ్యంతరాలు, సూచనలను ప్రజల నుంచి స్వీకరించడానికి ఇచ్చిన నెల రోజుల గడువు ఈ నెల 20న ముగియనుంది.

09/13/2016 - 04:47

హైదరాబాద్, సెప్టెంబర్ 12: క్రీడా శాఖను క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పరిచి టోక్యో ఒలింపిక్స్ 2010 లో బంగారు పతకాలే లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇప్పించాలని క్రీడాశాఖ మంత్రి టి పద్మారావు అధికారులను ఆదేశించారు. క్రీడా, యువజన సర్వీసుల అధికారులతో మంత్రి పద్మారావు సోమవారం సచివాలయంలో సమీక్ష జరిపారు. గచ్చిబౌలిలోని క్రీడా గ్రామంలోని టవర్స్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.

09/13/2016 - 04:44

హైదరాబాద్,సెప్టెంబర్ 12: నీటిపారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టిఆర్‌ఎస్ ఎంపిలు బి వినోద్, బాల్కసుమన్ వేరువేరుగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో విమర్శించారు. తెలంగాణభవన్‌లో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఎంపిలు మాట్లాడారు. ఉనికి కోల్పోతుందనే భయంతోనే కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తున్నారని ఎంపి వినోద్ విమర్శించారు.

09/13/2016 - 04:44

హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణ విమోచన దినోత్సవంపై తెలంగాణ రాష్ట్ర సమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ కోరారు. ముఖ్యమంత్రి కె.

09/13/2016 - 04:42

హైదరాబాద్, సెప్టెంబర్ 12: వంద కోట్ల రూపాయల వ్యయంతో మెదక్ జిల్లా ములుగులో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్నట్టు తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి సి పార్థసారథి తెలిపారు. రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాల లో నూతన కళాశాల భవనం, విద్యార్థిని వసతి గృహం భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన పార్థసారథి ఈ విషయం తెలిపారు.

Pages