S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/12/2016 - 12:02

హైదరాబాద్: వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో సైక్లిస్టు మరణించిన ఘటన బండ్లగూడ అన్సారీ రోడ్డుపై సోమవారం తెల్లవారు జామున జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం తెలిశాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని లారీని సీజ్ చేశారు. ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

09/12/2016 - 11:21

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ‌, దామోదర రాజనర్సింహా, జగ్గారెడ్డి తదితరులు సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలుసుకున్నారు. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ, 144 సెక్షన్‌ అమలుపై గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు వినతిపత్రం అందజేశారు.

09/12/2016 - 08:40

నల్లగొండ, సెప్టెంబర్ 11: అభివృద్ధి ఫలా లు ప్రజలందరికీ అందించేలా ప్రజల జీవన ప్రమాణాలు, సామాజిక ప్రగతి మెరుగుపడే నూతన అభివృద్ధి నమూనా అమలుకు తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలంతా ఒత్తిడి చేయాలని టి.జెఎసి చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రం పిఆర్‌టియు భవన్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అభివృద్ధి-ప్రజాస్వామ్యం’ సదస్సులో ఆ యన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు.

09/12/2016 - 08:39

వరంగల్, సెప్టెంబర్ 11: దేశంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం అత్యంత ప్రాధాన్యం ఇస్తోం దని కేంద్ర కార్మికశాఖ మంత్రి బం డారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయ న ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వెనుకబడిన ప్రాంతాల్లో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు మోదీ ప్రభు త్వం 73వేల కోట్ల నిధులు కేటాయించిదని తెలిపారు.

09/12/2016 - 08:38

హైదరాబాద్, సెప్టెంబర్ 11: కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గద్వాల జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం జెఎసి నాయకులు, కార్యకర్తలు ఆదివారం జూరాల ప్రాజెక్టుపై ధర్నా నిర్వహించారు. జూరాల ప్రాజెక్టు దగ్గర ఆత్మకూరు, గద్వాల వైపువెళ్ళే రహదారిని దిగ్బంధించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

09/12/2016 - 08:38

సిరిసిల్ల, సెప్టెంబర్ 11: రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు చిత్ర పటంతో పిండ ప్రదానం చేసిన ఉదంతంలో సిరిసిల్ల జిల్లా సాధన ఆందోళనకారులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి ఎనిమిది మందిపై కేసు నమోదు చేస్తూ సిరిసిల్ల పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను జారీ చేశారు.

09/12/2016 - 08:38

హైదరాబాద్, సెప్టెంబర్ 11: వ్యవసాయ అనుబంధ శాఖలైన ఉద్యానవన, సెరికల్చర్‌లను విలీనం చేసి జి ల్లా స్థాయిలో ఒకే అధికారిని నియమించాలనే ప్రతిపాదనను ప్రభు త్వం విరమించుకోవాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసిం ది.

09/12/2016 - 08:37

హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.

09/12/2016 - 08:37

రామాయంపేట, సెప్టెంబర్ 11: పార్లమెంట్‌లో బిసి బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ సం ఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయం పేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన బిసి సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బిసిలది ఆకలి పోరాటం కాదని ఆత్మగౌరవ పోరాటం అనా రు.

09/12/2016 - 08:36

గోదావరిఖని, సెప్టెంబర్ 11: కరీం నగర్ జిల్లా గోదావరిఖని లో కొం తకాలంగా స్తబ్ధంగా ఉందనుకున్న రౌడీయిజం... గుం డాయిజం... ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయ. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత దారుణ హత్యకు గురి కావడం తీవ్ర సంచలనాన్ని రేకెత్తిం చిం ది. ముఖం చెక్కి... మర్మాంగం కో సి... దారుణ హత్యకు పాల్పడడం చర్చనీయాంశమైంది. అప్పటివరకు గుర్తు తెలియని మృతదేహమేనని అంతా అనుకున్నారు.

Pages