S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/12/2016 - 08:35

హుజూరాబాద్, సెప్టెంబర్ 11: ప్రేమ వేధింపులు అభంశుభం తెలియని ఓ ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు తీశాయి. చదువుపై దృష్టిపెట్టి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశించిన ఆ విద్యార్థిని పై లోకానికి ఎగిసిపోయింది.

09/12/2016 - 08:25

హైదరాబాద్, సెప్టెంబర్ 11: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, వ్యవసాయానికి నిరంతరాయంగా పది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించాలని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసారాల శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. వ్యవసాయ రంగంలో సేవలు అందించిన 51 మంది రైతులు, అధికారులు, వ్యవసాయ శాస్తవ్రేత్తలకు రైతు నేస్తం పురస్కారాలు అందజేశారు.

09/12/2016 - 08:11

హైదరాబాద్, సెప్టెంబర్ 11: మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకూ తమ పోరాటం ఆగదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు సంఘీభావంగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఇందిరా పార్కు వద్ద ఆదివారం ఒక రోజు దీక్ష చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

09/12/2016 - 08:10

హైదరాబాద్, సెప్టెంబర్ 11: మహారాష్టల్రో తీవ్రమైన నీటి ఎద్దడి ఉన్న ఎనిమిది జిల్లాల్లో మిషన్ భగీరథ ప్రాజెక్టు అమలు చేస్తామని, తెలంగాణ ప్రభుత్వం నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటామని మహారాష్ట్ర తాగునీటి సరఫరా శాఖ మంత్రి బబస్‌రావు తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణ ఇంజనీర్లతో కలిసి బబస్‌రావు నారాయణఖేడ్, ఆందోల్, మెదక్ నియోజక వర్గాల్లో మిషన్ భగీరథ పనులు జరుగుతున్న తీరును స్వయంగా చూశారు.

09/12/2016 - 08:09

హైదరాబాద్, సెప్టెంబర్ 11: హైదరాబాద్ నగరంలో 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం సిక్కింలో నెలకొల్పిన ఎత్తయిన బుద్ధుని విగ్రహాన్ని పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నాయకత్వంలో మంత్రుల బృందం ఆదివారం సిక్కిం చేరుకుంది. కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డిలతో పాటు ఇతర అధికారులు ఈ బృందంలో ఉన్నారు.

09/12/2016 - 08:09

హైదరాబాద్, సెప్టెంబర్ 11: హైదరాబాద్ నగరంలో 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం సిక్కింలో నెలకొల్పిన ఎత్తయిన బుద్ధుని విగ్రహాన్ని పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నాయకత్వంలో మంత్రుల బృందం ఆదివారం సిక్కిం చేరుకుంది. కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డిలతో పాటు ఇతర అధికారులు ఈ బృందంలో ఉన్నారు.

09/12/2016 - 08:09

హైదరాబాద్/ ఖైరతాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాంప్ కార్యాలయం ఎదుట ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హనుమంత రెడ్డి అనే కానిస్టేబుల్ ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సికింద్రాబాద్‌సలోని తుకారాంగేట్‌లో నివాసం ఉండే కానిస్టేబుల్ హనుమంత్‌రెడ్డి (30) నార్త్‌జోన్ డిసిపి కార్యాలయంలో కంప్యూటర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు.

09/12/2016 - 06:55

హైదరాబాద్, సెప్టెంబర్ 11: రాజధాని నగరంలో ఆదివారం మధ్యాహ్నాం కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి వల్ల తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సిద్దిపేటలో భారీ వర్షం కురిసింది.

09/11/2016 - 18:17

హైదరాబాద్: ఎంసెట్-3 ప్రాథమిక కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, అభ్యంతరాలకు 14 వరకు అవకాశం ఉందని ఎంసెట్ కన్వీనర్ యాదయ్య ఆదివారం తెలిపారు. ఎంసెట్-3కి 56153 మంది దరఖాస్తు చేస్తే, 37199 మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు.

09/11/2016 - 18:04

హైదరాబాద్‌: అనుమతి లేకుండా బైక్‌ రేసింగ్‌ నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు పోటీలను అడ్డుకున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తాళ్లపల్లిగూడెం వద్ద ఇండియన్‌ నేషనల్‌ ర్యాలీ అనే ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో బైక్‌ రేసింగ్‌ పోటీలు చేపట్టారు. పోలీసులు 52 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Pages