S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/11/2016 - 05:27

వరంగల్, సెప్టెంబర్ 10: వరంగల్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తాగుబోతు భర్త వేధింపులు భరించలేక తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శనివారం వరంగల్ నగరంలోని హన్మకొండ మిలీనియం బజారులో జరిగింది. ములుగు మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన అలుగోజు శోభన్‌బాబు, కేసముద్రంకు చెందిన ఉమతో వివాహమైంది. వీరు బతుకుదెరువుకోసమని హన్మకొండకు వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

09/11/2016 - 05:26

మానకొండూర్, సెప్టెంబర్ 10: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలో దారుణం జరిగింది. ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలిపై ఓ కామాంధుడు అత్యాచారం జరిపి, అనంతరం హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. ఈ హృదయ విదారక ఘటన మండలంలోని చెం జర్ల గ్రామ పరిధిలోని నిజాయితీగూడెంలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజాయితీగూడెంకు చెందిన గడ్డి కనుకమ్మ (63) అనే వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తోంది.

09/11/2016 - 05:19

హైదరాబాద్, సెప్టెంబర్ 10: ప్రయాణికుల అవసరాలను గుర్తించి తదనుగుణంగా బస్ సర్వీసులను నడిపిస్తూ, ప్రయాణికులకు సేవలందించడంలో కార్మికులు ప్రధాన భూమికను పోషిస్తున్నారని తెలంగాణ ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. శనివారం సాయంత్రం జూబ్లీబస్టాండ్‌ను సందర్శించిన ఆయన కంటోనె్మంట్ డిపోలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. జెఎన్‌ఆర్‌ఎం బస్సులను పరిశీలించారు.

09/11/2016 - 05:16

హైదరాబాద్, సెప్టెంబర్ 10: నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పనులను ముమ్మరం చేశారు. ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అధ్యయనం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిలతో కూడిన బృందం విగ్రహాల పరిశీలనకు సిక్కిం వెళ్లనుంది.

09/11/2016 - 05:15

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తర తరాలుగా నిర్లక్ష్యానికి గురైన మహబూబ్‌నగర్ జిల్లాలో పల్లెపల్లెనా పల్లేర్లు మొలిచి పంట భూములు పాడై జనం కంట కన్నీరుకు కారణం సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్, టిడిపిలేనని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.

09/11/2016 - 05:14

హైదరాబాద్, సెప్టెంబర్ 10: పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని ఎఐసిసి నాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదు కానీ, మీరు నిర్మించబోయే ప్రాజెక్టు వల్ల ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయని నిపుణులు చెబుతున్నారని ఆయన ముఖ్యమంత్రికి చెప్పారు.

09/11/2016 - 05:13

హైదరాబాద్, సెప్టెంబర్ 10: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న వివిధ రకాల మైనింగ్ బ్లాకుల పనులను దక్కించుకునేందుకు తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా ఈనెల 12న న్యూ ఢిల్లీలోని సెంట్రల్ మైనింగ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో శాస్ర్తీ భవన్‌లో జరిగే సమావేశానికి టిఎస్‌ఎండిసి చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, సింగరేణి సిఎండి శ్రీ్ధర్, మైనింగ్ అధికారులు హాజరవుతున్నారు.

09/11/2016 - 05:12

హైదరాబాద్, సెప్టెంబర్ 10: టి.పిసిసి లింగ్విస్టిక్ మైనారిటీస్ సెల్ చైర్మన్‌గా ఠాకూర్ హృదయనాథ్ సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉత్తర్వు జారీ చేశారు.

09/11/2016 - 05:11

హైదరాబాద్, సెప్టెంబర్ 10: జిల్లాల పునర్విభజన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల పిటిషన్ (పిల్) దాఖలైంది. జిల్లాల పునర్విభజనకు గత నెల 22న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఆదివాసి సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు పి.శ్రీనివాస్ ఈ పిల్‌ను దాఖలు చేశారు.

09/11/2016 - 05:11

హైదరాబాద్, సెప్టెంబర్ 10: రైతుల నుంచి భూములు లాక్కునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్భంధం బ్రిటీషు కాలంలో కూడా లేదని టి.పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన శనివారం పార్టీ ఆఫీసు బేరర్ల సమావేశం జరిగింది.

Pages