S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/23/2016 - 12:08

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గురువారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనావేశారు. మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఆవరించిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉంది.

06/23/2016 - 12:07

నల్గొండ: సూర్యాపేట వద్ద జాతీయ రహదారిపై గురువారం ఉదయం పోలీసులు తనిఖీలు చేస్తుండగా విశాఖ నుంచి వస్తున్న ఓ జీపులో 2.40 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్నందుకు ముగ్గురిని అరెస్టు చేశారు. వీరు నిజామాబాద్‌కు గంజాయిని తరలిస్తున్నట్టు అంగీకరించారు. వాహనంతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

06/23/2016 - 11:53

హైదరాబాద్ : ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు తగ్గించాలంటూ వివిధ విద్యార్థి సంఘాల వారు గురువారం ఆందోళనలు చేపట్టారు. బోడుప్పల్‌లోని భాష్యం స్కూల్‌తోపాటు శంషాబాద్‌లోని ఎస్సార్ డీజీ స్కూల్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.

06/23/2016 - 08:53

హైదరాబాద్, జూన్ 22: తెలంగాణలో స్మార్ట్ సిటీల నిర్మాణంలో తామూ సహకరిస్తామని బ్రిటిష్ హైకమిషనర్ డొమినిక్ యాష్‌క్విన్త్ హామీ ఇచ్చారు. రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల, ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు బుధవారం నగరంలో బ్రిటిష్ హైకమిషనర్ (ఇన్ ఇండియా) డొమినిక్ యాష్‌క్విన్త్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వంతో తాము కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటీష్ హైకమిషనర్ తెలిపారు.

06/23/2016 - 08:42

సంగారెడ్డి, జూన్ 22: మెదక్ జిల్లా తొగుట మండలంలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూముల ముంపు బాధితులు నిర్వహిస్తున్న ఉద్యమాలకు వివిధ పార్టీల నేతలు సంపూర్ణ మద్దతు పలుకుతుండడంతో ఉద్యమాలు ఉధృతరూపం దాల్చనున్నాయి.

06/23/2016 - 08:41

దండేపల్లి, జూన్ 22: ప్రజా ఉద్యమ కవి, రచయిత, ప్రముఖ వాగ్గేయకారుడు గూడ అంజయ్యకు స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్‌లో అశుృనయనాల మధ్య కడసారి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం హైదరాబాద్‌లోని రామన్నగూడలో అంజయ్య తుదిశ్వాస వదిలిన విషయం తెలిసిందే. ఆయన కోరిక మేరకు స్వగ్రామమైన దండేపల్లి మండలం లింగాపూర్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

06/23/2016 - 07:07

హైదరాబాద్, జూన్ 22: తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలపై పెనుభారం మోపకుండా విద్యుత్, ఆర్టీసీ చార్జీలను స్వల్పంగా పెంచాడానికి సిఎం కెసిఆర్ అధికారులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. విద్యుత్, ఆర్టీసీవంటి ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల ఊబినుంచి గట్టెక్కించాలంటే ప్రజలు కూడా కొంతభారం మోయక తప్పదని సిఎం స్పష్టం చేశారు.

06/23/2016 - 07:05

హైదరాబాద్, జూన్ 22: వచ్చే జూలై 1వ తేదీ నుంచి సవరించిన విద్యుత్ చార్జీలు అమలులోకి వస్తున్నాయి. దీని వల్ల వినియోగదారులపై రూ.1500 కోట్ల భారం పడనుంది. మొత్తం 86 లక్షల గృహ వినియోగదారుల్లో 60 లక్షల మందికి చార్జీల ప్రభావం ఉండదు. కాని 100 నుంచి 200 యూనిట్ల స్లాబ్‌లో తొలి వంద యూనిట్లకు రూ.3.25 పైసలు, 101-200 యూనిట్ల మధ్య రూ.

06/23/2016 - 07:04

హైదరాబాద్, జూన్ 22: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 103 గురుకుల పాఠశాలలు, 30 డిగ్రీ కళాశాలల్లో బోధనా, బోధనేతర సిబ్బంది 4616 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవ్వే కాకుండా గురుకుల పాఠశాలలు, డిగ్రీ కళాశాలలో 733 పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా భర్తీ చేసుకోవడానికి కూడా ఆర్థిక శాఖ అనుమతించింది.

06/22/2016 - 17:32

హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని గగన్‌పహాడ్ వద్ద జోరుగా పేకాట సాగుతోందన్న సమాచారంతో బుధవారం నాడు ప్రత్యేక టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పదిమంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి 8వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Pages