S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/27/2016 - 06:13

హైదరాబాద్, ఆగస్టు 26:వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి నిర్ణయం జరిగింది అని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు ఇంత కాలం ప్రాజెక్టులు నిర్మించకుండా ఏం చేశారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ ప్రశ్నించారు.

08/27/2016 - 05:36

హైదరాబాద్, ఆగస్టు 26: తాము అధికారంలో ఉన్నప్పుడు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తుకు పెంచే విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో జాప్యం జరిగిందని సిఎల్‌పి నేత, ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ తాము అప్పట్లో చేసిన ప్రతిపాదనను అమలు చేయకుండా ఎదురు దాడి చేస్తున్నదని జానారెడ్డి శుక్రవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

08/27/2016 - 05:35

హైదరాబాద్, ఆగస్టు 26: ఆర్టీసి సంస్థ నష్టాలను అధిగమించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ ఆర్టీసి ఎండి జివి రమణారావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 1400 కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామన్నారు. ఇందులో వంద ఏసి మినీ బస్సులకు కూడా ఆర్డర్ ఇచ్చామన్నారు.

08/27/2016 - 05:34

హైదరాబాద్, ఆగస్టు 26: మజ్లిస్ ఒత్తిడికి లొంగి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నగరంలోని 58 డివిజన్లకు ఇటీవల నూతన అధ్యక్షులను పార్టీ ఎన్నుకున్నది.

08/27/2016 - 05:32

హైదరాబాద్, ఆగస్టు 26: తెలంగాణ తెలుగుదేశం శాసనసభా పక్షం టిఆర్‌ఎస్ శాసనసభా పక్షంలో విలీనం అయినట్టు మార్చి 10, 2106న తెలంగాణ శాసనసభ సచివాలయం విడుదల చేసిన బులిటిన్‌పై లిఖితపూర్వక వాదనను తెలియజేయాలని రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.

08/27/2016 - 05:31

హైదరాబాద్/వనస్థలిపురం, ఆగస్టు 26: అనుమానాస్పదస్థితిలో ఓ ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నగరంలోని ఎల్‌బినగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది.

08/27/2016 - 05:29

హైదరాబాద్, ఆగస్టు 26: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి సామాజిక బాధ్యతగా తమ వంతు సహాయం చేస్తామని సిమెంట్ కంపెనీలు ముందుకు వచ్చాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి కావలసిన సిమెంట్‌ను మార్కెట్ రేటు కన్నా తక్కువ ధరకు ఇచ్చేందుకు సిమెంట్ కంపెనీలు అంగీకరించాయి. బస్తా సిమెంట్‌ను ప్రభుత్వానికి 230 రూపాయలకు అమ్మేందుకు సమ్మతించాయి.

08/27/2016 - 05:18

నాంపల్లి, ఆగస్టు 26: తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ఆస్తులు, డాక్యుమెంట్లు సంపాదించిన నరుూంను పెంచి పోషించి హతం చేసి టిఆర్‌ఎస్‌లో వంద మంది నరుూంలను తయారు చేసిందని నల్లగొండ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

08/27/2016 - 05:16

హైదరాబాద్, ఆగస్టు 26: ఈనెల 30న శాసన సభ, శాసన మండలి సమావేశమవుతుంది. జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అసెంబ్లీ వ్యవహారాల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారం, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి తదితరులతో సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు.

08/27/2016 - 05:15

రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణతో రూపొందించిన ప్రతిపాదిత జిల్లాల మ్యాప్‌లను ప్రభుత్వం అధికారికంగా శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇఆర్‌ఏసి సాయంతో భూపరిపాలన శాఖ వీటిని రూపొందించింది.

Pages