S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/10/2016 - 05:03

హైదరాబాద్, సెప్టెంబర్ 9: కొత్తగా ఏర్పాటవుతోన్న జిల్లాల్లో మెరుగైన సేవలు అందించేందుకు ప్రాధాన్యతలకు అనుగుణంగా శాఖల ఏర్పాటు, అవసరమైన సిబ్బంది కోసం ప్రతిపాదనలు వెంటనే ఇవ్వాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. ప్రతిపాదనలను సిజిజి వెబ్‌సైట్‌లో (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ఆప్‌లోడ్ చేయాల్సిందిగా సూచించారు.

09/10/2016 - 05:01

హైదరాబాద్, సెప్టెంబర్ 9: కృష్ణా జలాలను ఆంధ్ర అక్రమంగా తరలించుకు పోతోందని ఆధారాలతో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అక్రమంగా సాగుతోన్న నీటి తరలింపు వ్యవహారాన్ని అధ్యయనం చేయడానికి నీటి పారుదల శాఖ ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది.

09/10/2016 - 04:58

హైదరాబాద్, సెప్టెంబర్ 9: గద్వాల, జనగామ జిల్లాలను ఏర్పాటు చేసే యోచన లేదని సిఎం కె చంద్రశేఖర్‌రావు పరోక్షంగా స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతిపాదించిన మూడు జిల్లాలు మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్టు సిఎం స్పష్టం చేయడంతో గద్వాల జిల్లా ప్రతిపాదన లేనట్టేనని పరోక్షంగా స్పష్టం చేశారు.

09/09/2016 - 15:20

కరీంనగర్: సిరిసిల్ల కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులపై పోలీసులు శుక్రవారం లాఠీచార్జి చేశారు. ఆందోళనకారులు సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేయగా 17 మంది గాయపడ్డారు.

09/09/2016 - 13:46

హైదరాబాద్: బక్రీద్ సందర్భంగా ఈ నెల 13వ తేదీని ఉమ్మడి హైకోర్టుతో పాటు ఉభయ రాష్ట్రాల్లో కింది కోర్టులకు సెలవు దినంగా ప్రకటించారు. హైకోర్టు గతంలోనే బక్రీద్ సందర్భంగా 12వ తేదీని సెలవుగా ప్రకటించింది. అయితే 13న బక్రీద్ నిర్వహిస్తుండటం, సుప్రీంకోర్టు కూడా ఆ రోజునే సెలవు ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు కూడా 13నే సెలవుగా ప్రకటించింది.

09/09/2016 - 13:36

హైదరాబాద్: రచయిత, గాయకుడు గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేతుల మీదుగా ఈ అవార్డును వెంకన్న అందుకున్నారు. నగరంలోని రవీంద్రభారతిలో కాళోజీ జయంతి వేడుకలకు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

09/09/2016 - 03:59

హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణలో ఐటి, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఆటో మొబైల్, ఇంజనీరింగ్ రంగాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. సాఫ్ట్‌వేర్ రంగంతో సమానంగా ఐటి, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగాలకు మంచి భవిష్యత్తు ఉందని, ఈ రంగాల్లో గణనీయమైన ఎదుగుదలకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

09/09/2016 - 03:50

గోదావరిఖని, సెప్టెంబర్ 8: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్న ఇసుక మాఫియాకు చెక్ పడింది. ఇంటి నిర్మాణాల పేరుతో వేబిల్లులు పొందడం... వాటిపై ఇష్టానుసారంగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ బడా కాంట్రాక్టర్ వ్యవహారం బయటపడింది.

09/09/2016 - 03:33

తాండూరు/ హైదరాబాద్, సెప్టెంబర్ 8: రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన రాష్ట్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఎం మాణిక్‌రావు (86) గురువారం కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన మూడేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబీకులు నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు.

09/09/2016 - 03:31

హైదరాబాద్, సెప్టెంబర్ 8: పర్యావరణ పరిరక్షణకు ప్రభు త్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అటవీ, పర్యావరణం,బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. గచ్చిబౌలిలోని ఎన్విరాన్‌మెంట్ ప్రొటక్షన్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను మంత్రి సందర్శించారు. రిసెర్చ్ లాబరేటరీని పరిశీలించి పర్యావరణంపై కాలేజీ వి ద్యార్థులతో మాట్లాడారు. ఈపిటిఆర్‌ఐ ప్రాంగణంలో ఔషధ మొక్కలను నాటారు.

Pages