S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/18/2016 - 18:08

హైదరాబాద్: రోడ్డు ప్రమాదం ఫలితంగా నగరంలో చిన్నారి రమ్య కుటుంబంలో ముగ్గురు మరణించడం దురదృష్టకరమని, ఈ ఘటనలో నిందితులను వదిలిపెట్టే ప్రసక్తేలేదని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సోమవారం తెలిపారు. రమ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, త్వరలోనే సిఎం కెసిఆర్ వద్దకు రమ్య కుటుంబ సభ్యులను తీసుకువెళ్లి మాట్లాడిస్తానని తెలిపారు.

07/18/2016 - 18:07

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వచ్చేనెల 17న దేశవ్యాప్త ఆందోళనకు తమ పార్టీ సమాయత్తమవుతోందని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి సోమవారం తెలిపారు. కేంద్రం విధానాలతో అన్నివర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. తెలంగాణలో అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారితే ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

07/18/2016 - 17:30

హైదరాబాద్: టీఎస్‌ ఎంసెట్-2లో ఎంబీబీఎస్, బీడీఎస్ వెబ్ కౌన్సెలింగ్ కోసం సర్టిఫికెట్ల పరిశీలనకు షెడ్యూల్‌ను సోమవారం అధికారులు విడుదల చేశారు. వెబ్ ఆప్షన్ల కోసం ప్రత్యేక నోటిఫికేషన్‌‌ విడుదలైంది. ఈనెల 25 నుంచి 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో జరగుతుందని తెలిపారు. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు 31నుంచి ఆగస్టు 2 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది.

07/18/2016 - 16:34

హైదరాబాద్: పంజగుట్ట వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మరణానికి కారకులైన ఆరుగురు యువకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ చిన్నారి రమ్య కుటుంబ సభ్యులు సోమవారం యశోద ఆస్పత్రి వద్ద ఆందోళన ప్రారంభించారు. ఈనెల 1న పంజగుట్ట వద్ద మద్యం తాగి ఆరుగురు మైనర్ యువకులు కారు నడపడంతో మరో కారులో వెళుతున్న రమ్య కుటుంబీకులు గాయపడ్డారు.

07/18/2016 - 12:02

హైదరాబాద్: పంజాగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మరో వ్యక్తిని బలితీసుకుంది. ఆ ఘటనలో గాయపడి చిన్నారి రమ్య కొద్దిరోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. అదే ఘటనలో తీవ్రంగా గాయపడిన రమ్య తాతయ్య మధుసూదనాచారి 17 రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.

07/18/2016 - 12:01

హైదరాబాద్: దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలోని సురారం కాలనీలో సోమవారం తెల్లవారుజామున కొందరు దొంగలు ఓ ఇంట్లో బీభత్సం సృష్టించి అడ్డువచ్చిన వారిని చితకబాదారు. లాండ్రీషాపు యజమాని సత్యనారాయణ ఇంట్లో దొంగలు చొరబడి నగదు కోసం ఆరా తీశారు. సత్యనారాయణను, ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేశారు. చేతికి దొరికిన 5వేల రూపాయల నగదుతో దొంగలు పరారయ్యారు.

07/18/2016 - 08:15

కొండపాక/ తొగుట, జూలై 17: రాజ్యాంగం కల్పించిన హక్కులకే రక్షణ లేకుండా పోయింది, ఇక ప్రభుత్వ జిఓలు, చట్టాలతో ఎలా న్యాయం జరుగుతుందని, 2013, 123జిఓల ముచ్చటే వద్దని విరసం నేత వరవరరావు అన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో భూనిర్వాసితులు అలుపెరుగని పోరాటం చేస్తే విజయం వరిస్తుందన్నారు.

07/18/2016 - 08:14

నల్లగొండ, జూలై 17: ప్రభుత్వాలెన్ని మారినా నల్లగొండ జిల్లా ప్రజలపై ఫ్లోరైడ్ బండ బాధ తొలగడం లేదు. గత ప్రభుత్వాలు చేపట్టిన మంచినీటి పథకాలు ప్రజలకు సరిపడా రక్షిత మంచినీటి జలాలు అందించడంలో విఫలమవుతున్న తరుణంలో స్వరాష్ట్రంలో పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం తమకు ఫ్లోరైడ్ తాగునీటి సమస్యను దూరం చేస్తారని భారీ ఆశలే పెట్టుకున్నారు.

07/18/2016 - 08:13

సిద్దిపేట, జూలై 17: తెలంగాణ రాష్ట్రంపై నిరుద్యోగ యువత ఎంతో ఆశ పెట్టుకున్నారని, తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాలు, మండలాలతో కొత్త పోస్టులు వస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. గురుకుల పాఠశాలల్లో త్వరలోనే 2400ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.

07/18/2016 - 08:12

ఎల్లారెడ్డిపేట, జూలై 17: కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని పెద్దమ్మ అడవుల్లో ఎముకల నూనె తయారీ కేంద్రంలో యంత్రాలు అలాగే ఉన్నాయి. కేంద్రం వద్ద జంతువుల వ్యర్థ పదార్థాలను ఆరబెట్టారు. కేంద్రం నడవకపోయినా అక్కడ జంతువుల ఎముకలు, వ్యర్థ పదార్థాలు ఉండడం వల్ల దుర్వాసన వెదజల్లుతోంది.

Pages