S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/18/2016 - 07:46

హైదరాబాద్, జూలై 17: ఈనెల 19న జరుగనున్న టిఆర్టీసి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. ఆర్టీసి తెలంగాణ వ్యాప్తంగా 57 బస్సు డిపోల్లో 10 వేల బస్సులను నడిపిస్తుంది. 22వేల మంది కార్మికులు ఉన్న సంస్థలో అధికార కార్మిక సంఘం గుర్తింపునకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ టిఎంయూ, ఎంప్లారుూస్ యూనియన్ మధ్యే జరుగుతోంది.

07/18/2016 - 07:45

హైదరాబాద్, జూలై 17: అల్మట్టి నుంచి మరో రెండు రోజుల్లో పాలమూరు ప్రాజెక్టులకు కృష్ణా జలాలు వస్తాయని, పెండింగ్ పనులన్నింటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. అల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి కృష్ణా జలాలు ఏ క్షణమైనా జూరాలకు చేరుకునే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని పెండింగ్ పనులు పూర్తి చేయాలని అన్నారు.

07/18/2016 - 07:40

హైదరాబాద్, జులై 17: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్న సానియా మీర్జా హరిత హారంలో ఎక్కడమ్మా?, ‘డుమ్మా’ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో సానియా ఎక్కడా కనిపించ లేదు. ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటాలని గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సినీనటులు పిలుపునిస్తుండగా, సానియా మీర్జా మాత్రం కనిపించ లేదు.

07/18/2016 - 07:21

చార్మినార్, జూలై 17: సింగరేణి కాంట్రా క్టు కార్మికులు వేతనాల కోసం చేస్తున్న డిమాండ్ న్యాయమైనదని, చట్టబద్ధమైన హక్కులు, సౌకర్యాల సాధనకు అండగా ఉంటామని టిజెఎసి చైర్మన్ ప్రొ.కోదండరామ్ అన్నారు.

07/18/2016 - 07:20

హైదరాబాద్, జులై 17: సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న కాశ్మీర్ వేర్పాటు వాదులను అరెస్టు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎల్. అయ్యప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

07/18/2016 - 07:19

హైదరాబాద్, జూలై 17:ఎల్లంపల్లి రిజర్వాయర్ పూర్తి సామర్థ్యంతో నిండనున్నది. దీంతో ముంపు బాధితులకు సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని వారం రోజుల్లో చెల్లించాలని నిర్ణయించారు.

07/18/2016 - 07:18

హైదరాబాద్, జూలై 17: హరిత హారంలో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో కోటి మొక్కలు నాటుతారు. ఇందుకోసం అటవీ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాల వారిగా అటవీ ప్రాంతాల్లో, రిజర్వ్ ఫారెస్ట్‌లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రణాళిక అమలు కోసం అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్ని జిల్లాల్లో ఇప్పటికే పర్యటించారు.

07/18/2016 - 07:16

హైదరాబాద్, జూలై 17: తెలంగాణలో ఉగ్రవాద ఖైదీలున్న జైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ జైళ్లశాఖను కోరింది. దీంతో చర్లపల్లి, చంచల్‌గూడ, వరంగల్ జైళ్లలో అధికారులు భద్రతను మరింత పెంచారు. గతంలో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారు. వీరి విచారణ ముగిసేదాకా వీరిని ఇతర జైలుకు మార్చవద్దని ఎన్‌ఐఏ కోరింది.

07/18/2016 - 07:15

హైదరాబాద్, జులై 17: హైకోర్టు విభజన అంశంలో జోక్యం చేసుకోవాలని తెలంగాణ న్యాయవాదులు కొందరు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారుదత్తాత్రేయను కోరారు. బిజెపి రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ రవీంద్ర విశ్వనాథ్ నేతృత్వంలో పలువురు న్యాయవాదులు ఆదివారం కేంద్ర మంత్రి దత్తాత్రేయను కలిసి వినతి పత్రం సమర్పించారు.

07/18/2016 - 05:53

హైదరాబాద్, జూలై 17: ఎంతోకాలంగా పాలమూరు రైతులు ఎదురు చూస్తున్న కల్వకుర్తి ప్రాజెక్టు తుదిదశకు చేరుకుంది. కల్వకుర్తి ఎత్తిపోతల 2, 3 ఫేజ్‌ల ట్రయల్ రన్‌ను సోమవారం నిర్వహించాలని నిర్ణయించారు. కృష్ణా జలాలు ఈ సీజన్‌లో పుష్కలంగా రానున్నందున ట్రయల్ రన్ నిర్వహించాలని నిర్ణయించారు. కల్వకుర్తి డ్రై రన్, ట్రయల్ రన్ పనులను ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

Pages