S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/28/2016 - 18:06

హైదరాబాద్: సిమ్ కార్డులను విక్రయిస్తున్న తీరుపై పోలీసులు అధికారులు నగరంలో క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. ఎలాంటి విచారణలు లేకుండా సిమ్ కార్డులను విక్రయిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో సోమవారం నాడు తార్నాక, మేడ్చల్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో సెల్‌ఫోన్లను విక్రయించే దుకాణాలను తనిఖీ చేశారు.

03/28/2016 - 18:06

హైదరాబాద్: గతంలో ప్రకటించిన విధంగానే తెలంగాణలో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి వచ్చే నెల 17న రాతపరీక్ష యథాప్రకారం జరుగుతుందని, అయితే ఆర్‌ఆర్‌బి పరీక్షల దృష్ట్యా కానిస్టేబుల్ పోస్టులకు జరిగే రాతపరీక్షను ఏప్రిల్ 3కు బదులు అదే నెల 24న జరుగుతుందని టిపిపిఎస్‌సి అధికారులు సోమవారం ప్రకటించారు. అభ్యర్థులు ఈ మార్పును గమనించాలని వారు సూచించారు.

03/28/2016 - 16:39

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వైస్ చాన్సలర్ అప్పారావు చాంబర్‌పై దాడి కేసులో పోలీసులు అరెస్టు చేసిన 24 మంది విద్యార్థులకు స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు అధ్యాపకులతో పాటు మరో వ్యక్తికి కూడా ఇదే కేసులో బెయిల్ ఇచ్చారు.

03/28/2016 - 16:38

హైదరాబాద్: రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు సోమవారం ఇక్కడ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ రేమాండ్ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు. నగరంలో ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాల కోసం భూమి లభ్యత గురించి వీరు చర్చించారు

03/28/2016 - 16:38

హైదరాబాద్: తగినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని యోచించడం తగదని టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సోమవారం అసెంబ్లీ సమావేశంలో అన్నారు. కార్పొరేట్ స్కూళ్లు వచ్చాక సర్కారీ బడులు, ఖరీదైన ఆస్పత్రులు వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రులు డీలా పడిపోతున్నాయన్నారు. ఈ పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి విద్య, వైద్యరంగాలను కాపాడాలన్నారు.

03/28/2016 - 16:38

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు పలు కార్యక్రమాలు చేపట్టేందుకు ఆ పార్టీ నేతలు విస్తృత సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పిస్తారు. సాయంత్రం జరిగే సభలో చంద్రబాబు పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారు.

03/28/2016 - 16:37

హైదరాబాద్: పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా ఇద్దరు చిన్నారులను లారీ రూపంలో మృత్యువు కాటేసింది. రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగింది. బాలయ్య అనే వ్యక్తి తన ఇద్దరు మనవరాళ్లు స్నేహ (10), హర్షిత (8)ను స్కూల్ నుంచి బైక్‌పై ఇంటికి తీసుకువస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొంది. బైక్‌పై నుంచి కిందకు పడిన వెంటనే ఇద్దరు చిన్నారులు మరణించారు.

03/28/2016 - 16:37

హైదరాబాద్: తెలంగాణలో ఇసుక మాఫియాను పూర్తి స్థాయిలో నిరోధించామని, ఇసుక విక్రయాలు పారదర్శకంకా జరుగుతున్నాయని మంత్రి హరీష్‌రావు సోమవారం అసెంబ్లీ సమావేశంలో తెలిపారు. ఇసుక అక్రమ రవాణా విషయమై కాంగ్రెస్ సభ్యులు డికె అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ప్రశ్నించగా, ఆన్‌లైన్ ద్వారా ఇసుక విక్రయాలు ప్రారంభించామని, ప్రత్యేకంగా కాల్‌సెంటర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.

03/28/2016 - 14:22

నిజామాబాద్: చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న ఓ హెడ్మాష్టర్ సుమారు పదికోట్ల రూపాయలను జనం నుంచి వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు. కామారెడ్డిలో సోమవారం ఉదయం ఈ సంఘటన వెలుగు చూసింది. ధర్మారావుపేటలో ప్రభుత్వ హెడ్మాష్టర్‌గా పనిచేస్తున్న బాలచంద్రం చాలాకాలంగా అధిక వడ్డీకి ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ, ఇటీవల చిట్టీ పాటలను కూడా ప్రారంభించాడు.

03/28/2016 - 14:22

హైదరాబాద్: శాంతి భద్రతల పరిరక్షణకు ముఖ్యంగా మహిళల రక్షణకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి సోమవారం అసెంబ్లీ సమావేశంలో తెలిపారు. మహిళల రక్షణ కోసం అన్ని జిల్లాల్లోనూ ఇక షీటీమ్‌లు పనిచేస్తాయని చెప్పారు. ఎమ్మెల్యేలు గీతారెడ్డి, కొండా సురేఖ మహిళల భద్రత విషయమై ప్రశ్నించగా మంత్రి ఈమేరకు సమాధానం చెప్పారు.

Pages