S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/07/2016 - 08:32

హైదరాబాద్, ఫిబ్రవరి 6: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర అపజయానికి నైతిక బాధ్యత వహి స్తూ, గ్రేటర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌కు ఆదివారం పంపనున్నట్లు తెలిపారు. ఇకపై సామాన్య కార్యకర్తగా కొనసాగతానన్నారు.

02/07/2016 - 08:31

నిజామాబాద్: తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా భాసిల్లుతున్న శ్రీరాంసాగర్ జలాశయంలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో అటు ఆయకట్టు రైతులు, ఇటు ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోం ది. ఇప్పటికే నీటి నిల్వలు అడుగంటిన నేపథ్యంలో గత ఖరీఫ్ సీజన్‌లోనూ ఎస్సారెస్పీ ద్వారా పంటలకు సాగు జలాలు అందించలేకపోయా రు.

02/07/2016 - 07:25

హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర పోలీసు శాఖలో 510 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. అలాగే కమ్యూనిషన్ల శాఖలో ఎస్సై క్యాడర్ 23 పోస్టులు, పోలీసు రవాణా శాఖలో 6 ఎస్సై క్యాడర్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ జారీ చేశారు. కొద్దిరోజుల క్రితమే పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు 9281 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

02/07/2016 - 07:21

హైదరాబాద్: తినే తిండి కూడా కల్తీ అవుతోంది. దీన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి అని సిఎం కె చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ప్రజలను కల్తీనుంచి కాపాడేందుకు రాష్ట్ర ఉద్యానవన శాఖ క్రియాశీలకం కావాలన్నారు. పండ్లు, కూరగాయలు, కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి ఇలా ప్రతిదీ కలుషితమవుతోందని, కల్తీలేని వస్తువంటూ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

02/07/2016 - 07:20

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాసకు కట్టబెట్టింది విజయం కాదు, నమ్మకం. ప్రజల బాధలు, కష్టాలు తొలిగిపోతాయన్న నమ్మకంతో మహత్తర విజయం అందించారు. ఆ నమ్మకాన్ని వమ్ముకానివ్వకండి’ అని సిఎం కె చంద్రశేఖర్‌రావు కార్పొరేటర్లకు హితవు పలికారు. కొత్తగా ఎన్నికైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు క్యాంపు కార్యాలయంలో శనివారం సిఎం కెసిఆర్‌ను కలిశారు.

02/06/2016 - 19:59

హైదరాబాద్-తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శ్రీవారి వైభవోత్సవం ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అశేషజనసందోహం మధ్య శనివారం సాయంత్రం పూజాదికాలు ప్రారంభించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులుసహా పలువురు ప్రముఖులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

02/06/2016 - 17:16

హైదరాబాద్-తెలంగాణలో ఈ ఏడాది 539 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. పోలీస్ నియామకాల సంఘం ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరుగుతాయి. ఈనెల 10నుంచి మార్చి 3వ తేదీవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎస్‌సి,ఎస్‌టిలు 250 రూపాయలు, ఒసి,బిసిలు 500 రూపాయలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 17న ఎస్‌ఐ పోస్టులకు రాతపరీక్ష నిర్వహిస్తారు.

02/06/2016 - 15:59

న్యూదిల్లి-గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అద్భుత విజయం సాధించిందని, తమ ప్రభుత్వ పనితీరుకు దక్కిన గుర్తింపు ఇదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో వివిధ రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశంలో పాల్గొన్న రాజేందర్ మాట్లాడారు. తెరాస పాలనకు ఆ ఫలితాలు రెఫరెండంగా ఆయన అభివర్ణించారు.

02/06/2016 - 11:53

నల్గొండ: చివ్వెంల మండలం వట్టికంపాడు వద్ద ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది.

02/06/2016 - 11:52

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయాన్ని చవి చూడటంతో నైతిక బాధ్యత వహిస్తూ నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ శనివారం రాజీనామా చేశారు. ఈ విషయమై ఆయన ఈ రోజు మధ్యాహ్నం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. గ్రేటర్ ఎన్నికలకు ముందు ఆయన టిఆర్‌ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగినా, చివరి క్షణంలో మనసు మార్చుకొని కాంగ్రెస్‌లోనే కొనసాగారు.

Pages