S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/07/2016 - 04:28

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: పెసర పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. బుధవారం నాడు కేంద్ర మంత్రులు ఉమాభారతి, రాధా మోహన్‌సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌ను మంత్రి హరీశ్‌రావు కలిసి పలు ప్రతిపాదనాలు కేంద్రం ముందుంచారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌ను కలిసి పెసర పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరామన్నారు.

09/07/2016 - 04:27

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 6: మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ పరిధిలోని ఎంజికెఎల్‌ఐ మూడో లిప్టులోని మొదటి పంపు ట్రయల్న్‌న్రు విజయవంతం చేసిన అధికారులకు పంపుహౌస్‌లోకి నీరు రావడాన్ని గమనించి లోపం ఎక్కడుందో మంగళవారం ఉదయం గుర్తించారు.

09/07/2016 - 04:09

హైదరాబాద్, సెప్టెంబర్ 6: మెదక్ జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రాంతంలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించిన అంశంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు తెలంగాణ పోలీసుశాఖను ఆదేశించారు. వై సంతోష్ రెడ్డి మరో ఐదుగురు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

09/07/2016 - 04:08

హైదరాబాద్, సెప్టెంబర్ 6: ప్రస్తుత పరిస్థితుల్లో భూగర్భ గనుల నుంచి అధికోత్పత్తిని సాధించే మైనింగ్ పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉందని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. శ్రీ్ధర్ అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి కోల్ సమ్మిట్-2016లో రెండవ రోజు మంగళవారం కో-చైర్ పర్సన్‌గా శ్రీ్ధర్ పాల్గొన్నారు.

09/07/2016 - 04:08

హైదరాబాద్, సెప్టెంబఱ్ 6: ఫీజులు బకాయిలు 1900 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని, స్కాలర్‌షిప్‌లు, మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న (గురువారం) కలెక్టరేట్లను, తహాశిల్దార్ కార్యాలయాలను ముట్టడించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య విద్యార్థులకు పిలుపునిచ్చారు.

09/07/2016 - 04:07

హైదరాబాద్, సెప్టెంబర్ 6: విద్యా ప్రమాణాలు పెంచేందుకు తెలంగాణ సాంఘిక గురుకుల పాఠశాలల్లో అమలు చేస్తున్న నూతన ప్రామాణిక కార్యాచరణ (ఎన్‌క్యూపి-2016)పై గురుకులాల ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. సాంఘిక సంక్షేమ గురుకులాల ముఖచిత్రం మార్చేందుకు కార్యదర్శిగా డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలపై గురుకుల సిబ్బందిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

09/07/2016 - 04:06

హైదరాబాద్, సెప్టెంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఇక నుండి రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డిఓ) చేతుల్లోకి వస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు ఎస్‌సి, ఎస్‌టి, బిసి కులాలకు చెందిన యువతులు ఎవరైనా వివాహం చేసుకునేందుకు ముందుకు వస్తే, వారి వివాహానికి 50 వేల రూపాయలను ప్రభుత్వం అందిస్తోంది.

09/07/2016 - 04:06

హైదరాబాద్, సెప్టెంబర్ 6: జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో ప్రజలకు మరింత చేరువలో ప్రభుత్వ పాలన సాధ్యమవుతుందని అటవీ, పర్యావరణం, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. అరణ్యభవన్‌లో మంగళవారం అటవీ శాఖ ఉన్నతాధికారులతో నూతన జిల్లాల్లో అటవీ శాఖ అధికారుల విధులు, విధి విధానాలు, కొత్త పోస్టులు, పరిపాలనా పరమైన అంశాలపై చర్చించారు.

09/05/2016 - 08:07

హైదరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణ పర్యాటక రంగానికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావడానికి కృషి చేయనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ తెలిపారు. అమెరికాలోని హూస్టన్ నగరంలో నిర్వహించిన తెలుగు సాంస్కృతిక సమితి 40వ వార్షికోత్సవంలో చందూలాల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలో చాటిచెపుతున్న ప్రవాసులకు అభినందనలు తెలిపారు.

09/05/2016 - 07:57

జనగామ టౌన్, సెప్టెంబర్ 4: పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు కోసం చేస్తున్న ఆలోచన మంచిదైనప్పటికీ, ఆచరణపైనే అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయని రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ‘జనగామ జిల్లా ఏర్పాటు-చారిత్రిక ఆవశ్యకత’ అనే అంశంపై తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ జిల్లా జనగామ జూబ్లీగార్డెన్‌లో సదస్సు నిర్వహించారు. డి.

Pages