S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/26/2016 - 01:52

హైదరాబాద్, మార్చి 25: కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులతో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల ములాఖత్ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం వీరు చర్లపల్లి జైలులో వున్న విద్యార్థులను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22న హెచ్‌సియూలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు.

03/26/2016 - 01:52

హైదరాబాద్, మార్చి 25: నగరంలోని ఆంధ్రాబ్యాంకులో చోరీకి విఫలయత్నం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున చిక్కడపల్లిలోని ఆంధ్రాబ్యాంక్‌ను దుండగులు దోచుకునేందుకు విఫలయత్నం చేశారు. బ్యాంక్ వెనుక భాగాన గోడకు రంద్రం వేసి బ్యాంకులోకి వెళ్లిన దుండగులు స్ట్రాంగ్ రూమ్ తెరిచేందుకు ప్రయత్నించారు. అలారమ్ మోగడంతో దుండగలు పారిపోయారు.

03/26/2016 - 01:50

హైదరాబాద్, మార్చి 25: నగర పంచాయితీల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. స్వయం సమృద్ధి నగరాలుగా నగర పంచాయితీలను అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. నగరాలతో సమానంగా గ్రామాలు, పంచాయితీలు అభివృద్ధి చెందాలని, పౌర సౌకర్యాలు ఉండాలని అన్నారు. దీనికి ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరం ఉందని సిఎం పేర్కొన్నారు.

03/26/2016 - 01:48

హైదరాబాద్/నల్లకుంట, మార్చి 25: తన కొడుకు ఆత్మహత్యకు కారకుడైన హెచ్‌సియు విసి అప్పారావును తక్షణమే అరెస్టు చేయాలని రోహిత్ తల్లి రాధిక డిమాండ్ చేశారు. శుక్రవారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విసి అప్పారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి 2 నెలలు గడిచినా దర్యాప్తు ఎందుకు జరగడంలేదని ఆమె ఆరోపించారు.

03/26/2016 - 01:47

హైదరాబాద్, మార్చి 25: ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై శే్వతపత్రం విడుదల చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేసి, ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

03/26/2016 - 01:37

హైదరాబాద్, మార్చి 25: రాష్టవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కాబోతున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి ఆధార్ కార్డును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో గతంలో ఎక్కడైనా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిపొందినట్టు అయితే డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తిరిగి దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించబడుతుంది. కేవలం తిరస్కరించడమే కాదు, ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఛీటింగ్ కేసు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు.

03/26/2016 - 01:28

హైదరాబాద్, మార్చి 25: హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీలో నిధుల కుంభకోణం వెలుగుచూసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఫోర్జరీ సంతకాలతో 5.8 కోట్ల రూపాయలు కాజేసిన ముఠాను ఈస్ట్‌జోన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రూ. 30 లక్షల నగదుతోపాటు ఐదు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

03/26/2016 - 01:22

హైదరాబాద్, మార్చి 25: గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి సుమారు రెండు గంటలపాటు గవర్నర్‌తో సమావేశమయ్యారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న తీరు తెన్నులు, ఈ నెల 29న సభలో ప్రవేశపెట్టనున్న ద్రవ్యవినిమయ బిల్లు తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది.

03/25/2016 - 18:01

హైదరాబాద్: తెలంగాణలో సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధుల కేటాయింపులు, ఖర్చులపై తాము కోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్టీ తెలిపారు. ప్రభుత్వ నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనను విమర్శించేవారిని నాశనం చేయడంలో సిఎం కెసిఆర్ సిద్ధహస్తుడని, ఆయన ప్రోత్సాహంతోనే హెచ్‌సియులో దాడులు జరుగుతున్నాయని యాష్కీ ఆరోపించారు.

03/25/2016 - 18:01

హైదరాబాద్: తనకు న్యాయస్థానాలపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని వైకాపా ఎమ్మెల్యే రోజా శుక్రవారం ఇక్కడ మీడియాతో అన్నారు. తనను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై న్యాయ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై తన వాదన వినిపిస్తానని ఆమె తెలిపారు.

Pages