S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/04/2016 - 16:04

హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇవిఎం)ను ట్యాంపరింగ్ చేస్తున్నారన్నది కేవలం అపోహేనని ఈసిఐఎల్ సిఎండి సుధాకర్ తెలిపారు. వీటి ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం లేదని ఆయన శుక్రవారం తెలిపారు. తొలిసారిగా తెలంగాణలో ఓటర్లలో భరోసా కల్పించేందుకు ఇవిఎంల ద్వారా రశీదులు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టామన్నారు.

03/04/2016 - 13:03

హైదరాబాద్: గ్రూప్-2 ఉద్యోగాల సంఖ్యను పెంచాలని, ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ బీసీ విద్యార్థులు శుక్రవారం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్సీస్ కమిషన్ భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. గ్రూప్-2 పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు మూడు నెలల గడువు ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.

03/04/2016 - 13:01

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 72 ఏళ్ల వెంకటరెడ్డి అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, వైఎస్, కిరణ్‌కుమార్ రెడ్డి క్యాబినెట్‌ల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

03/04/2016 - 12:17

హైదరాబాద్: ఇక్కడి రవాణాశాఖలో పరిపాలనాధికారిగా పనిచేస్తున్న నరేందర్ భారీగా అక్రమార్జనకు పాల్పడినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. శుక్రవారం ఉదయం నుంచి అతనికి చెందిన ఆస్తులపై సోదాలు జరుగుతున్నాయి. బోయగూడ, కుర్మగూడ తదితర ప్రాంతాల్లో నరేందర్, అతని బంధువుల ఇళ్లలో సోదాలు ప్రారంభించగా పెద్దఎత్తున స్థిరాస్తులు, నగదు, బంగారు నగలు ఉన్నట్లు గుర్తించారు.

03/04/2016 - 12:17

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా భీంగల్‌లోని మండల పరిషత్ కార్యాలయంపై గోడలపై మావోయిస్టుల పేరిట పోస్టర్లు వెలిశాయి. గురువారం అర్ధరాత్రి వీటిని అంటించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ బూటకమని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు జగన్ పేరిట ఈ పోస్టర్లు వెలిశాయి. బూటకపు ఎన్‌కౌంటర్లకు పాలకులు మూల్యం చెల్లించక తప్పదని మావోలు హెచ్చరించారు.

03/04/2016 - 12:16

హైదరాబాద్: శనివారం జరగాల్సిన గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పాలకమండలి సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. ఉప రాష్టప్రతి అన్సారీ పర్యటన సందర్భంగా సమావేశాన్ని వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

03/04/2016 - 08:46

హైదరాబాద్/ బేగంపేట: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం సికిందరాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వప్న లోక్ సెంటర్ వద్ద చోటు చేసుకుంది. దుండగులు వేటాడి కత్తులతో పొడిచి అతి కిరాతకంగా చంపడం సికిందరాబాద్‌లో కలకలం రేపింది.

03/04/2016 - 08:43

హైదరాబాద్, మార్చి 3: ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గోల్కొండ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం ఆస్ట్రేలియాకు చెందిన లిండా మార్గరెట్ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో బెడ్‌పై ఆమె మృతదేహం పడి ఉండడాన్ని గుర్తించిన ఆమె స్నేహితులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. గత నెల 15న ఆమె టూరిస్టు వీసాపై నగరానికి వచ్చారు.

03/04/2016 - 07:00

వరంగల్: వరుస విజయాలతో ఊపు మీదున్న టిఆర్‌ఎస్‌కు వరంగల్ గ్రేటర్‌లో రెబెల్స్ గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 20 డివిజన్లలో రెబెల్స్ పోటీలో ఉండగా ఇప్పటికే కొంతమంది మంత్రుల ఒత్తిడి మేరకు పోటీ నుండి తప్పుకున్నా మరికొన్ని డివిజన్లలో మాత్రం పోటీ నుండి తప్పుకునేందుకు ససేమిరా అంటున్నారు.

03/04/2016 - 06:58

హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల పదవ తేదీన ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు ముందే టిడిపి శాసన సభాపక్షం టిఆర్‌ఎస్‌లో విలీనంపై స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. గత సంవత్సరం శాసన మండలిలో టిడిపి పక్షాన్ని టిఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు మండలి చైర్మన్ ప్రకటించిన తరహాలోనే టిడిపి శాసన సభాపక్షం టిఆర్‌ఎస్‌లో విలీనం అయినట్టు ప్రకటిస్తారని తెలిసింది.

Pages