S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/04/2016 - 03:47

హైదరాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాల అవసరాలకోసం వివిధ వస్తువులు కొనుగోలు చేసేందుకు జిల్లాస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. స్ర్తి, శిశు సంక్షేమ కార్యదర్శి జగదీశ్వర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దుర్గాబాయ్ కేంద్రాలకు అవసరమైన పరికరాలు, యంత్రాలు, ముడిసరకు కొనుగోలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

09/04/2016 - 03:44

హైదరాబాద్, సెప్టెంబర్ 3: మద్యం బాబులకు ముందున్నవన్నీ గడ్డురోజులే. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు వీలుగా ఇప్పుడున్న మద్యం అమ్మకాల పరిమితులను మరింతగా కుదించాలని తెలంగాణ రోడ్డు సేఫ్టీ అథారిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ షరతుల అమలు విషయమై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారికి ఈ షరతులను వర్తింపచేయనున్నారు.

09/03/2016 - 18:07

హైదరాబాద్: తెలంగాణలో జిల్లాల విభజన అశాస్ర్తియంగా, రాజకీయ కోణంలో జరుగుతోందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ శనివారం ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించకుండా జిల్లాలను విభజిస్తే తాము సహించేంది లేదన్నారు. హైదరాబాద్ జిల్లాను అలాగే ఉంచి, వరంగల్ జిల్లాను మూడు ముక్కలుగా ఎందుకు చేస్తున్నారో సిఎం కెసిఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అబద్ధాలు చెప్పనిదే కెసిఆర్‌కు రోజూ నిద్రపట్టదని ఆయన విమర్శించారు.

09/03/2016 - 18:06

హైదరాబాద్: జిల్లాల విభజన పేరిట ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర గందరగోళం నెలకొందని సిఎల్‌పి నాయకుడు జానారెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలు, చారిత్రక నేపథ్యం ప్రాతిపదికగా జిల్లాల విభజన జరగాలన్నారు. ఎన్నికలకు ముందు, అధికారం చేపట్టాక సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీలు అమలు జరగడం లేదని ఆరోపించారు.

09/03/2016 - 17:25

హైదరాబాద్: తాను రేపు సాయంత్రం వరకు దీక్షలోనే ఉంటానని, జిల్లాల విభజనపై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ సవాల్ విసిరారు. ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులు నిరాహార దీక్షను పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ శనివారం చేపట్టారు. అఖిలపక్ష భేటీలో ముసాయిదాను ఏ పార్టీలు ఆమోదించలేదని చెప్పారు.

09/03/2016 - 17:16

హైదరాబాద్: సీఐడీ అధికారులు ఎంసెట్‌-2పేపర్‌ లీకేజీ కేసులో ఇద్దరు బ్రోకర్లను శనివారం అరెస్ట్‌ చేశారు. పెద్దాడ దామోదర్‌రావు, రమేష్‌కుమార్‌ అనే ఇద్దరు బ్రోకర్లును అరెస్ట్‌ చేసి, వీరికి సంబధించిన రూ.64లక్షలు, రూ.34లక్షలు విలువచేసే ఫ్లాట్‌ సీజ్‌ చేశారు. పుణెలోని 52మంది విద్యార్థులకు పేపర్లు సరఫరా చేసినట్టు అధికారులు గుర్తించారు.

09/03/2016 - 16:52

హైదరాబాద్: రాజకీయ అవసరాల కోసమే జిల్లాల విభజన చేస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క శనివారం ఆరోపించారు. పాలనా సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టులేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించదని స్పష్టం చేశారు. గద్వాల, జనగామ జిల్లాల పోరాటానికి కాంగ్రెస్‌ మద్దతిస్తుందని చెప్పారు.

09/03/2016 - 14:56

హైదరాబాద్: యూపీలో సినీ పరిశ్రమను తీర్చిదిద్దుతానని ఉత్తర్‌ప్రదేశ్‌ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి మండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా నియమితులైన సినీనటి జయప్రద చెప్పారు. ఆమెకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో శనివారం అభిమానులు ఘనస్వాగతం పలికారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి తాను పూర్తిస్థాయిలో తోడ్పడతానని చెప్పారు. తెలుగు, తమిళ సినీ అభిమానులు తనను ఎంతో కాలంగా ఆదరిస్తున్నారని తెలిపారు.

09/03/2016 - 14:26

నల్గొండ : ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోతో వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆలేరు, రాజాపేట, గుండాల మండలాలను ప్రతిపాదిత జనగామ డివిజన్‌లో చేర్చవద్దని అఖిలపక్షం నేతలు డిమాండ్‌ చేశారు.

09/03/2016 - 14:17

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బోరబండకు చెందిన షబానాకు నీలోఫర్‌ ఆసుపత్రిలో 6 కిలోల బాబు జన్మించాడు. అప్పుడే పుట్టిన శిశువు బరువు సాధారణంగా 2 నుంచి 4 కిలోల మధ్య ఉంటుంది. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు నీలోఫర్‌ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. 6 కిలోల శిశువు జననం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ..

Pages