S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/03/2016 - 14:14

భువనగిరి: గ్యాంగ్‌స్టర్‌ నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్‌ పోలీసు కస్టడీ శనివారం ఉదయం గంటలకు ముగిసింది. పీడీ యాక్టులో నిందితునిగా ఉన్నందున వరంగల్‌ జైలుకు తరలించారు. భువనగిరి పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన అనంతరం ఈరోజు ఉదయం భువనగిరి తహశీల్దార్‌ ముందు హాజరు పరిచారు. కొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్న భువనగిరి ఎంపీపీ తోటకూర వెంకటేశ్‌ పోలీసు కస్టడీ శనివారం ముగిసింది.

09/03/2016 - 13:27

నల్గొండ : భువనగిరిలో గ్యాంగ్స్టర్ నయీం అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై ఆర్డీవో శనివారం విచారిస్తున్నారు. . దాదాపు 1,700 మంది బాధితులు ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లిలోని లక్ష్మీనరసింహ వెంచర్లో 1700 మందికి చెందిన ప్లాట్లను నయీం తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఎవరి ప్లాట్లను వారికి అప్పగిస్తామని ఆర్డీవో భూపాల్రెడ్డి తెలిపారు.

09/03/2016 - 13:21

హైదరాబాద్ : రాజకీయాల కోసం జిల్లాల విభజన జరగడం లేదని, పరిపాలన పరమైన సౌలభ్యం కోసం మాత్రమే జిల్లాలను విభజిస్తున్నామని, ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం ఎందుకని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రశ్నించారు. గద్వాల జిల్లా కోసం డీకే అరుణ చేపట్టిన దీక్ష ఓ డ్రామా అని, తెలంగాణ కోసం ఆమె ఎలాంటి ఉద్యమాలు చేయలేదని అన్నారు.

09/03/2016 - 12:55

హైదరాబాద్: దేశంలో టీ- హబ్ అతి పెద్ద ఇంక్యూబేటర్ సెంటర్ అని, తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్స్‌కి ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫిల్మ్ నగర్ జెఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో స్టార్టప్స్‌ కాన్ఫరెన్స్ ఆగస్ట్ ఫెస్ట్‌ని శనివారం నిర్వహించారు. ఇన్నోవేషన్ ఐడియాస్‌తో వచ్చేవారికి టీ హబ్ హెల్ప్ చేస్తుందని తెలిపారు.

09/03/2016 - 12:44

వికారాబాద్: అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌పై దాడి ఘటనలో వికారాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కుమారుడిపై కేసు నమోదు అయ్యింది. సైదాబాద్‌‌లోని ఓ అపార్టమెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న అమృతం అనే వ్యక్తిపై ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్ కుమారుడు పృథ్వీరాజ్ నలుగురు స్నేహితులతో కలిసి దాడి చేయడంతో వాచ్‌మెన్ తీవ్రంగా గాయపడ్డాడు.

09/03/2016 - 12:37

హైదరాబాదద్‌: దేశ సమైక్యతకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని, అందరిలో జాతీయ భావం నింపేందుకే తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్కు వద్ద ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం తిరంగా యాత్ర నిర్వహించారు.

09/03/2016 - 12:27

హైదరాబాద్‌: తెలంగాణలో జనగామ, గద్వాల జిల్లాలు ఏర్పాటు చేయాలని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద కాంగ్రెస్‌ నేతలు శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరుగుతోందంటూ రెండ్రోజుల పాటు దీక్ష చేపట్టారు. ప్రజాభీష్టం మేరకు కాకుండా రాజకీయ ప్రయోజనాలతో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, ఇతర నేతలు దీక్షలో పాల్గొన్నారు.

09/03/2016 - 07:02

హైదరాబాద్, సెప్టెంబర్ 2: ఈ రాజధాని నగరానికి ఏమైంది? ఎక్కడ చూసినా గుంతలు. వర్షం వస్తే నిలువెత్తులోతు మునిగే రహదారులు. గంటలపాటు నిలిచిపోయే ట్రాఫిక్. ఇది తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ దుస్థితి! విశ్వనగరం చేస్తామన్న పాలకుల మాటలను వెక్కిరిస్తూ దర్శనమిస్తున్న విషాదనగర దయనీయమిది!

09/03/2016 - 06:41

హైదరాబాద్, సెప్టెంబర్ 2: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్‌కు నిరసనగా, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ తదితర డిమాండ్లతో శుక్రవారం కార్మిక సంఘాలు నిర్వహించిన సార్వత్రిక సమ్మె ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లోనూ సమ్మె విజయవంతమైంది. ఆర్టీసీ బస్సులు డిపోల గేటు దాట లేదు. వాణిజ్య, వ్యాపార సంస్ధలు సమ్మెలో పాల్గొన్నాయి.

09/03/2016 - 06:40

బెల్లంపల్లి, సెప్టెంబర్ 2: సింగరేణిలో మెడికల్ అన్‌ఫిట్, చనిపోయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలిప్పిస్తామని రూ. రెండు కోట్లకు పైగా వసూలు చేసి మోసగించిన 14మంది వ్యక్తులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి 1వ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ రమణారెడ్డి వివరాలు వెల్లడించారు.

Pages