S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/03/2016 - 06:39

వరంగల్, సెప్టెంబర్ 2: వరంగల్ జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు లొల్లి కొనసాగుతూనే ఉంది. జనగామ జిల్లా కావాలని అక్కడి ప్రజలు, ప్రతిపక్షాలు, హన్మకొండ జిల్లా వద్దంటూ ఇక్కడి ప్రజలు, ప్రతిపక్షాలు గత వారం రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా జనగామ జిల్లా ఏర్పాటు ఉద్యమం హైదరాబాద్‌కు చేరింది.

09/03/2016 - 06:38

హైదరాబాద్, సెప్టెంబర్ 2: అశాస్ర్తియంగా ఉన్న జిల్లాల ముసాయిదాను వ్యతిరేకిస్తూ 3, 4 తేదీల్లో ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ తెలిపారు. ఈ దీక్షలో గద్వాల, జనగామతో పాటు అసంతృప్తిగా ఉన్న ప్రజలు పాల్గొంటారని ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

09/03/2016 - 06:37

సంగారెడ్డి, సెప్టెంబర్ 2: వివాదాస్పదంగా మారిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూ కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా ఊపందుకోలేదు. సాదా బైనామాలు, గ్రామాల్లో స్థిర నివాసం ఉండని వారు మాత్రమే భూములు ఇవ్వడానికి సమ్మతిస్తుండగా భూములనే నమ్ముకుని తరతరాలుగా జీవిస్తున్న వారు మాత్రం ససేమిరా అంటున్నారు. మూడు నెలలుగా కొనసాగుతున్న భూ సేకరణలో అధికారులు పైచేయి కనబర్చడం లేదు.

09/03/2016 - 06:37

హైదరాబాద్, సెప్టెంబర్ 2:సంచార జాతుల వారి స్థితిగతులు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పటి వరకు సంచార జాతుల వారికి ఒక కులం అంటూ లేదు కాబట్టి ముందుగా వారి కుల ధ్రువీకరణ చేయాలని, వారి పూర్వీకులను బట్టి కుల నిర్థారణ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కుల ధ్రువీకరణ లేకపోవడం వల్ల, సంచార జాతుల వారికి ప్రస్తుతం కులధ్రువీకరణ పత్రం ఇవ్వడం లేదని తెలిపారు.

09/03/2016 - 06:12

హైదరాబాద్, సెప్టెంబర్ 2: కరడు గట్టిన గ్యాంగ్‌స్టర్ నరుూం అరాచకాలకు సంబంధించి ఇంతవరకు వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 62 కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసినట్లు స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీమ్ (సిట్) అధిపతి నాగిరెడ్డి ప్రకటించారు. ఈ నిందితులు కిడ్నాప్, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం, బలవంతంగా ఇండ్ల స్థలాలు, భూముల రిజిస్ట్రేషన్‌కు పాల్పడడం లాంటి నేరాలకు పాల్పడ్డారని ఆయన చెప్పారు.

09/03/2016 - 05:42

హైదరాబాద్, సెప్టెంబర్ 2: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఆలేరు, భువనగిరి, నకిరేకల్, అసెంబ్లీ నియోజక వర్గాల్లో 2.62 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. కాళేశ్వరం పనులపై శుక్రవారం జలసౌథలో అధికారులతో చర్చించిన హరీశ్‌రావు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

09/03/2016 - 05:39

హైదరాబాద్, సెప్టెంబర్ 2: వీణావాణీల ఆపరేషన్ విషయం మరోసారి తెరపైకొచ్చింది. వరంగల్ జిల్లాకు చెందిన ఈ అవిభక్త కవలలను విడదీసేందుకు ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి పేరుగాంచిన వైద్యులు వచ్చినా, ఆపరేషన్ ఎంత వరకు విజయవంతం అవుతుందన్న విషయంపై ఎవరూ స్పష్టత ఇవ్వకపోయినా, తాజాగా శుక్రవారం ఆస్ట్రేలియాకు చెందిన వైద్యుల బృందం వీరికి సర్జరీ చేయటం సాధ్యమేనంటూ సుముఖత వ్యక్తం చేసింది.

09/03/2016 - 05:36

హైదరాబాద్, సెప్టెంబర్ 2: ఉమ్మడి పాలనలో నిజాం షుగర్స్‌ను చంద్రబాబు నాయుడే ఆంధ్రా యాజమాన్యాల పరం చేశారని ఆరోపించడం సరికాదని టి.టిడిపి నేతలు పేర్కొన్నారు. నిజాం షుగర్స్ రక్షణకు ధర్నాలు, రాస్తారోకోలు చేసేందుకు తెలంగాణ జాగృతి నేత కవిత కలలిసి రావాలని వారు శుక్రవారం డిమాండ్ చేశారు.

09/03/2016 - 05:07

హైదరాబాద్, సెప్టెంబర్ 2: కొత్త జిల్లాల కూర్పు ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ కమిటీ రెండోరోజు శుక్రవారం కూడా కసరత్తు కొనసాగించింది. కీలకమైన ఆర్థిక, రెవిన్యూ, వైద్య ఆరోగ్యం, మున్సిపల్, న్యాయ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, దేవాదాయ, గృహ నిర్మాణ శాఖలపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లతో టాస్క్ఫోర్స్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది.

Pages