S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/25/2016 - 06:35

భద్రాచలం/చింతూరు, ఆగస్టు 24: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా డోర్నపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఎన్‌కౌంటర్ జరిగింది. కెర్లపాల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మావోయిస్టులు సమావేశం అయ్యారని, వారు పోలీస్‌స్టేషన్‌పై దాడికి సిద్ధపడుతున్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

08/25/2016 - 06:33

మహబూబ్‌నగర్, ఆగస్టు 24: ఐదవ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని శతచండీయాగానికి శ్రీకారం చుట్టారు. ఏడు రోజుల పాటు కొనసాగిన ఈ యాగాన్ని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించగా పూర్ణహుతికి జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ముగింపు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

08/25/2016 - 06:33

నల్లగొండ, ఆగస్టు 24: నేటి నుండి నాగార్జున సాగర్ ఎడమకాలువ పరిధిలోని పంటలకు, లిఫ్ట్‌ల కింద సాగవుతున్న పంటలకు, తాగునీటి చెరువులు నింపేందుకు 34 టిఎంసిల నీటిని ఆరు విడతలుగా విడుదల చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి వెల్లడించారు.

08/25/2016 - 06:32

భువనగిరి, ఆగస్టు 24: గ్యాంగ్‌స్టర్ నరుూం ముఖ్యఅనుచరుడైన పాశం శ్రీనివాస్‌ను బుధవారం నల్లగొండ జిల్లా భువనగిరి పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. పిటి వారెంట్ పొందిన పోలీసులు పిడి యాక్టులో నిందితుడై వరంగల్ జైలులోఉన్న పాశం శ్రీనివాస్‌ను భువనగిరి అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి ఎన్.రాధిక ఎదుట హాజరుపర్చి తిరిగి వరంగల్ జైలుకు తరలించారు.

08/25/2016 - 06:32

తొగుట, ఆగస్టు 24: మల్లన్నసాగర్‌లో ముంపునకు గురికాకుండా వేములఘాట్‌ను కాపాడుకునేందుకే ప్రజాభిప్రాయం మేరకు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు బుధవారం రాజీనామాలు చేశారు. పంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామానికి చెందిన ఫీల్డ్‌అసిస్టెంట్ రాజీనామాను సైతం ఎంపిడిఓ రాజిరెడ్డికి అందించారు.

08/25/2016 - 06:07

హైదరాబాద్, ఆగస్టు 24: గ్యాంగ్‌స్టర్ నరుూమొద్దీన్ అలియాస్ నరుూం వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. నరుూంపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తొమ్మిది మంది అదృశ్యమైనట్టు నరుూం సోదరి ఫర్హానా సిట్ విచారణలో అంగీకరించింది.

08/25/2016 - 06:06

హైదరాబాద్, ఆగస్టు 24: ఐటి, తయారీ రంగంలో కలిసి పనిచేయాలని, తెలంగాణ, మలేసియాలోని పెనాంగ్ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సంబంధాలను అభివృద్ధి చేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. పెనాంగ్‌కు చెందిన ఉప ముఖ్యమంత్రి డాక్టర్ పి రామస్వామి తన బృందంతో బుధవారం ఇక్కడ తెలంగాణ ఐటి మంత్రి కె తారకరామరావును కలిశారు.

08/25/2016 - 06:04

హైదరాబాద్, ఆగస్టు 24: అంతరాష్ట్ర లెండి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకరించాలని మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్‌కు సిఎం కెసిఆర్ లేఖ రాశారు. ముంబయి పర్యటనలో ఈ లేఖను సిఎం అందించారు. లెండి ప్రాజెక్టుపై మహారాష్ట్ర నీటిపారుదల మంత్రితో తమ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు 2014 జూలై 23న, అలాగే ఫిబ్రవరి 17, 2015లో చర్చలు జరిపారని సిఎం తన లేఖలో గుర్తు చేశారు.

08/25/2016 - 06:02

హైదరాబాద్, ఆగస్టు 24: తమ్మడిహెట్టి ఎత్తు విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని టిపిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ‘మహా’ ఒప్పందం కుట్రను గురువారం బహిర్గతం చేస్తానని అన్నారు. తక్కువ ఎత్తుకు ఒప్పందం చేసుకుని పైగా చారిత్రాత్మకం అంటూ సంబరాలు చేసుకుంటారా? అని ఆయన మండిపడ్డారు.

08/25/2016 - 01:49

హైదరాబాద్, ఆగస్టు 24: తెలంగాణలో ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు త్వరలో ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేయనున్నట్టు ఐటి, పరిశ్రమల మంత్రి కె తారకరామారావు వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమల సత్వర అభివృద్ధి, అందుకు తగిన వాతావరణం నెలకొల్పేందుకు ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ పరిశ్రమల విధానాన్ని ప్రకటించిందన్నారు.

Pages