S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/25/2016 - 01:46

మహారాష్ట్ర ఒప్పందంతో గోసలు తీరుతాయని జనం ఆనందంతో సంబురాలు చేస్తుంటే, కాంగ్రెస్ సన్నాసులకు నల్ల జెండాలు కనబడుతున్నాయి. తెలంగాణ పచ్చబడుతుంటే చూడలేక కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కాంగ్రెస్ తన ఆరోపణలు రుజువుచేస్తే నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖ ఇస్తా. రాజకీయ సన్యాసం స్వీకరిస్తా’

08/24/2016 - 18:02

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై మహారాష్టత్రో తెలంగాణ సర్కారు చారిత్రక ఒప్పందం చేసుకోవడాన్ని రైతులంతా హర్షిస్తుండగా కాంగ్రెస్ నాయకులు రాజకీయ ద్వేషంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహారాష్టత్రో ఒప్పందం అనంతరం ఆయన ముంబయి నుంచి బుధవారం సాయంత్రం ఇక్కడి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

08/24/2016 - 17:48

హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం భార్య హసీనా, సోదరి సలీమా బేగంను విచారించేందుకు నార్సింగ్‌ పోలీసులు వేసిన పీటీ వారెంట్‌ పిటిషన్‌పై విచారణను రాజేంద్రనగర్‌ న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. వీరిద్దర్నీ నార్సింగ్‌ ప్రాంతంలో నయీం నేరారోపణలపై విచారించేందుకు, వారిని షాద్‌నగర్‌ నుంచి నార్సింగ్‌ రప్పించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పీటీ వారెంట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

08/24/2016 - 16:54

హైదరాబాద్ : మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రాజెక్టులపై ఒప్పందం చేసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో మంత్రులు, పార్టీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బేగంపేట బ్రిడ్జ్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. ఉత్తర తెలంగాణకు చెందిన రైతులు పెద్ద ఎత్తున నగరానికి వస్తుండటంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

08/24/2016 - 16:33

హైదరాబాద్‌ : సాంఘిక సంక్షేమ శాఖలో ఎస్సీ డెవలప్‌మెంట్‌ సెక్రటరీగా ఉన్న శ్రీనివాసరావు తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తెలంగాణ సచివాలయం డి- బ్లాక్‌లో ఉద్యోగులు బుధవారం ఆందోళనకు దిగారు. మహిళలకు, మిగతా ఉద్యోగులకు సెలవులు ఇవ్వకుండా తమపై శ్రీనివాసరావు పెత్తనం చేస్తున్నారని ఉద్యోగులు తెలిపారు.

08/24/2016 - 16:00

హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌లో అదృశ్యమైన నలుగురు విద్యార్థులు గోవా రాజధాని పనాజీకి చేరుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఎల్బీనగర్‌లోని శివగంగానగర్‌ కాలనీకి చెందిన సాయినాధరెడ్డి(14), ఉప్పల్‌కు చెందిన లిఖిత్‌కుమార్‌(13), సాయికృష్ణ(14), విజయ్‌కుమార్‌(14) ఉప్పల్‌ కేంద్రీయ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి వీరు కనిపించకుండా పోయారు.

08/24/2016 - 15:49

హైదరాబాద్‌: ఏపీ ఉన్నత విద్యా మండలి కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రెండో రివ్యూ పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు ఈ నెల 23న తిరస్కరించింది. ఉమ్మడి సంస్థలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. తొలి రివ్యూ పిటిషన్‌ను ఈ నెల 10న విచారణకు సుప్రీం తిరస్కరించింది.

08/24/2016 - 12:27

హైదరాబాద్: సెప్టెంబర్15న గణేష్‌ నిమజ్జనంలో ఖైరతాబాద్‌ వినాయకుడిని ముందే నిమజ్జనం చేయాలని బుధవారం జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. వినాయక చవితి, బక్రీద్ పండుగలపై సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్15న తొలుత ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం చేయాలని, ఊరేగింపు ఉదయమే ప్రారంభించాలని నిర్ణయించారు.

08/24/2016 - 12:19

హైదరాబాద్ : బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకు దాదాపు 6 లక్షల రూపాయల ఖరీదైన నెక్లెస్‌ను అందించనున్నట్లు ఎన్‌ఏసీ జ్యూయలర్స్ యాజమాన్యం తెలిపింది.

08/24/2016 - 11:38

కరీంనగర్: సస్పెండైన ఏఎస్సై మోహన్‌రెడ్డికి కరీంనగర్ జిల్లా కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. జిల్లాకు చెందిన నారాయణరెడ్డి మృతదేహం దగ్గర లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు మోహన్‌రెడ్డిపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మోహన్‌రెడ్డి బాధిత సంఘం ఆందోళనల నేపథ్యంలో పోలీసులు మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.

Pages