S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/24/2016 - 08:06

హైదరాబాద్, ఆగస్టు 23: జిఎస్‌టి బిల్లును ఆమోదించి తిరిగి కేంద్రానికి పంపించే విషయంలో ఎవరు ముందు? అనే పోటీ తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 8వ తేదీ నుంచి నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు వచ్చే నెల చివరి వరకూ గడువు ఉంది. ఎపికి కూడా అదే చివరి గడువు ఉంది.

08/24/2016 - 08:05

హైదరాబాద్, ఆగస్టు 23: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. నరుూం ముఖ్య అనుచరురాలిగా అరెస్టయి, పోలీస్ కస్టడీలో విచారణలో ఉన్న ఫర్హాన్, స్వయాన నరుూం సోదరిగా సిట్ అధికారులు గుర్తించారు. నరుూం వంట మనిషిగా చెలామణి అవుతోన్న ఫర్హాన్ పేరిట కోట్లాది విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సిట్ అధికారులు తెలిపారు.

08/24/2016 - 08:05

హైదరాబాద్, ఆగస్టు 23: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్యశ్రీకి ప్రతిష్టాత్మకమైన ఫిక్కీ అవార్డు లభించింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(్ఫక్కీ) హెల్త్‌కేర్ ఎక్సలెన్స్ అవార్డు 2016కు తెలంగాణ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ఎంపికైంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రత్యేకంగా రూపొందించిన జిపిఎస్ మొబైల్ యాప్‌కి ఈ లెట్స్ స్మార్ట్ హెల్త్‌కేర్ అవార్డు లభించడం ఇది రెండవ సారి.

08/24/2016 - 08:04

హైదరాబాద్, ఆగస్టు 23: తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం నుండి డిగ్రీలో సెమిస్టర్ విధానం అమలుచేస్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. డిగ్రీ విద్యార్ధులకు తొలి సెమిస్టర్ పరీక్షలను నవంబర్ 24 నుండి ప్రారంభించనున్నట్టు కూడా ఆయన వెల్లడించారు.

08/24/2016 - 08:01

హైదరాబాద్, ఆగస్టు 23: కొంతకాలంగా హైదరాబాద్ కేంద్రంగా సాగుతోన్న బంగారం స్మగ్లింగ్‌కు పోలీసులు అడ్డుకట్ట వేశారు. విదేశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా దేశంలోకి వస్తున్న బంగారం స్మగ్లింగ్ రూటు మారింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, చెన్నైలోని ఎయిర్‌పోర్టులోనే ఇప్పటి దాకా పెద్ద ఎత్తున స్మగ్లింగ్ బంగారం పట్టుబడింది.

08/24/2016 - 05:31

హైదరాబాద్, ఆగస్టు 23: ‘నీటి కోసం రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ- మహారాష్ట్ర ఇచ్చిపుచ్చుకునే ధోరణితో అంతరాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడం దేశానికే ఆదర్శం’ అని సిఎం కె చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. గోదావరి, దాని ఉప నదులపై నిర్మించబోయే ప్రాజెక్టులపై మహారాష్టత్రో ముంబయిలో మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంలో ఇద్దరు సిఎంలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.

08/24/2016 - 05:27

హైదరాబాద్, ఆగస్టు 23: గోదావరి, ఉప నదుల విషయంలో ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంతో నిత్యం ఘర్షణ వైఖరి ఉండేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తరువాత రెండు రాష్ట్రాల కృషితో బలమైన స్నేహబంధం ఏర్పడిందన్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్ తమతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నారన్నారు.

08/24/2016 - 05:25

హైదరాబాద్, ఆగస్టు 23: గ్యాంగ్‌స్టర్ నరుూం వ్యవహారంలో తెరాసకు చెందిన కీలక నేతకు సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నరుూం సొంత జిల్లా నల్గొండకు చెందిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌కు గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలు ఉన్నట్టు భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నరుూం బెదిరింపులు, అక్రమ దందాకు సంబంధించి సోమవారం వెలుగుచూసిన ఆడియో టేపులో నరుూం నోట ఎమ్మెల్సీ విద్యాసాగర్ పేరు వినబడింది.

08/24/2016 - 04:38

హైదరాబాద్, ఆగస్టు 23: గోదావరి, ఉప నదులైన పెన్‌గంగ, ప్రాణహితలపై మహారాష్ట్ర-తెలంగాణ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. అఖండ గోదావరి, రెండు ఉప నదులపై మూడు ఆనకట్టల నిర్మాణానికి మార్గం సుగమమైంది.

08/23/2016 - 18:42

హైదరాబాద్‌: ఆగస్టు 12 నుంచి ఈ రోజు మధ్యాహ్నం 3గంటల వరకు కృష్ణా పుష్కరాల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1,80,11,801 మంది, నల్గొండ జిల్లాలో 70,87,030 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో ఏర్పాటుచేసిన వివిధ పుష్కర ఘాట్లలో యాత్రికులు పుష్కర స్నానం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Pages