S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/23/2016 - 18:39

హైదరాబాద్‌: మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంతో తెలంగాణ సచివాలయంలో మంగళవారం సంబురాలు చేసుకున్నారు. సీఎం కార్యాలయం సీ-బ్లాక్‌ ఎదుట సంబురాల్లో హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

08/23/2016 - 16:55

హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం భార్య హసీనా, సోదరి సలీమా బేగం, వాచ్‌మెన్‌ అబ్దుల్‌ మతిన్‌, ఖలీమాలకు కస్టడీ పొడిగించాలని మంగళవారం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. వీరికి నేటితో పోలీస్‌ కస్టడీ ముగిసింది. పోలీసులు ఈ నలుగురినీ షాద్‌నగర్‌ న్యాయస్థానంలో హాజరుపరిచారు.

08/23/2016 - 16:28

హైదరాబాద్: తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టే చెత్త ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవితలు కమీషన్ల కోసం డిజైన్లు మార్చారని ఆరోపించారు. వీరంతా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాసం కల్పించాలనిడిమాండ్ చేశారు.

08/23/2016 - 14:57

హైదరాబాద్: నీటి ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ చేసుకున్న ఒప్పందం ఎలా చరిత్రాత్మకమైనదో చెప్పాలని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం ప్రశ్నించారు. మహారాష్ట్ర డిమాండ్లకు తలొగ్గడం చరిత్రాత్మకమా ? అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ హక్కులను మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులు తెల్ల ఏనుగుల్లా మారనున్నాయని రావుల ఆరోపించారు.

08/23/2016 - 14:52

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం డైరీని బయటపెట్టాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ మంగళవారం డిమాండ్ చేశారు. నీటి ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ చేసుకున్న ఒప్పందం వివరాలు బయటపెట్టాలని కోరారు. జిల్లాల ఏర్పాటులో గద్వాల, జనగామ ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

08/23/2016 - 14:07

హైదరాబాద్ : నీటి ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ ఒప్పందాన్ని నిరసిస్తూ టీ. కాంగ్రెస్ నేతలు మంగళవారం గాంధీభవన్‌ నుంచి హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్ పాల్గొన్నారు.

08/23/2016 - 14:03

హైదరాబాద్ : టీటీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయడాన్ని సవాల్‌చేస్తూ తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఉత్తరాఖండ్, అసోంలో పరిణామాలపై సుప్రీం తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

08/23/2016 - 13:58

కరీంనగర్: మోహన్‌రెడ్డి ఆక్రమించుకున్న భూములను ప్రభుత్వం తిరిగి ఇప్పించాలని, మోహన్ రెడ్డికి అండగా ఉన్న పోలీసులు, నేతల పేర్లు బయటపెట్టాలని ఏఎస్సై మోహన్ రెడ్డి బాధితుల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. నయీం పైరవీతోనే మోహన్ రెడ్డి ఎస్సై శిక్షణకు ఎంపికయ్యాడని ఆరోపించారు. ఏఎస్సై మోహన్‌రెడ్డికి లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని వారు కోరారు.

08/23/2016 - 13:50

హైదరాబాద్ : ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే కుట్రతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అబద్దాలు చెబుతూ మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటున్నారని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

08/23/2016 - 12:01

కరీంనగర్: అధిక వడ్డీలకు రుణాలిచ్చి పెద్దసంఖ్యలో భూములు, స్థలాలను లాక్కున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి సోమవారం రాత్రి కరీంనగర్ ఎస్పీ సమక్షంలో లొంగిపోయాడు. తన స్థలాన్ని ఆక్రమించడమే గాక మోహన్‌రెడ్డి నిత్యం వేధిస్తున్నాడని బెజ్జంకి మండలం గుండ్లపల్లిలో చాడ నారాయణ రెడ్డి అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.

Pages