S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/23/2016 - 11:58

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు మంగళవారం ముగియనున్నాయి. పుష్కరఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుష్కరాల ముగింపు సందర్భంగా వేడుకలకు విజయవాడలోఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వెయ్యిమంది కూచిపుడి కళాకారులతో నృత్య ప్రదర్శన, సంగమం ఘాట్‌ వద్ద సందర్భంగా ప్రత్యేక హారతి కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు.

,
08/23/2016 - 05:28

గద్వాల, ఆగస్టు 22: రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కొరకు కొత్త జిల్లాల ఏర్పాటులో అన్ని అర్హతలు ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు న్యాయం చేయలేదంటూ గద్వాలలో ఆగ్రహ జ్వాలలు రగిలాయి. సోమవారం సాయంత్రం నుంచి పట్టణంలో నిరసన ర్యాలీలు, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు శవయాత్ర, దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.

08/23/2016 - 05:31

పెబ్బేరు, ఆగస్టు 22: కృష్ణ పుష్కరాలు 11వ రోజు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, జడ్పీచైర్మెన్ బంగారు భాస్కర్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, దేవర్‌కద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రంగాపూర్ పుష్కర ఘాట్‌లో సోమవారం సాయంత్రం కృష్ణమ్మకు మహా మంగళహారతి ఇచ్చారు. అంతకు ముంద మంత్రి లక్ష్యారెడ్డి కృష్ణమ్మకు పూజలు నిర్వహించి చీర, గాజులు, పసుపు, కుంకుమ సమర్పించారు.

08/23/2016 - 05:20

హైదరాబాద్, ఆగస్టు 22: కృష్ణా ఆదిపుష్కరాలకు మంగళవారం చివరి రోజు కావడంతో తెలంగాణకు చెందిన మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని పుష్కరఘాట్లకు భక్తుల రద్దీ ఉధృతమయింది. ఆదిపుష్కరాలు ప్రారంభమై పదకొండు రోజులు గడిచాయి. పదకొండవరోజైన సోమవారం రెండు జిల్లాల్లోని 90 ఘాట్లు జనమయం అయ్యాయి.

08/23/2016 - 05:18

లింగాల, ఆగస్టు 22: కృష్ణ పుష్కరాలు మరో ఒకరోజులో ముగియనుండగా మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని అమరగిరి పుష్కరఘాట్‌లో అపశృతి దొర్లింది. కృష్ణానది నీటమునిగి హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్‌కు చెందిన డ్రైవర్ మహేశ్ (35) మృతి చెందిన విషాదకరమైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.

08/23/2016 - 05:15

కరీంనగర్/ వరంగల్, ఆగస్టు 22: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన అంశం కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోనూ అగ్గి రాజేస్తోంది. కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల నిరసన సెగలు కక్కుతున్నాయి. సిరిసిల్లను జిల్లాల జాబితాలో నుంచి తొలగించడంతో ఆ ప్రాంత ప్రజలు భగ్గుమంటున్నారు.

08/23/2016 - 05:14

బోయినిపల్లి, ఆగస్టు 22: అధికారులు అసలైన అర్హులకు పరిహారం అందించడంలో చూపిన నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఆ గ్రామం మధ్యమానేరు జలాశయ నిర్మాణంలో ముంపునకు గురవుతుంది. ఆ గ్రామంలోని మిగతా నిర్వాసితులు ఆ గ్రామానికి కేటాయించిన ఆర్ అండ్ ఆర్ మోడల్ కాలనీలో కొత్తగా ఇండ్ల నిర్మాణం చేపట్టారు.

08/23/2016 - 05:13

హైదరాబాద్, ఆగస్టు 22: ఇద్దరు డిఎస్పీలను బదిలీ చేస్తూ డిజిపి అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ డిఎస్పీ, ఓటిఎస్‌గా పనిచేస్తున్న షేక్ ఇస్మాయిల్ ఖమ్మంకు బదిలీ అయ్యారు. డిఎస్పీ వెయిటింగ్‌లో ఉన్న బి బాలదేవిని హైదరాబాద్ ఆర్‌బివిఆర్‌ఆర్, టిఎస్ పోలీస్ అకాడమికి బదిలీ చేశారు.

08/23/2016 - 05:12

హైదరాబాద్, ఆగస్టు 22: ముంబాయిలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేయాలని సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరారు. ఈ మేరకు నారాయణ సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు.

08/23/2016 - 05:11

నాగార్జునసాగర్, ఆగస్టు 22: ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని రూ.480కోట్లతో అభివృద్ధిపరుస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ డిజిపి పేర్వారం రాములు అన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో కుటుంబ సమేతంగా పుష్కర స్నానం ఆచరించడానికి ఆయన ఆదివారం సాగర్‌కు చేరుకున్నారు.

Pages