S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/22/2016 - 15:36

హైదరాబాద్‌: దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రాన్ని కొణెదల ప్రొడక్షన్స్‌ కంపెనీ పతాకంపై రాంచరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘ఖైదీ నంబర్‌ 150’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

08/22/2016 - 15:27

హైదరాబాద్‌: తెలంగాణలో వీసీల నియామకంలో యథాస్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. వీసీల నియామకాన్ని కొట్టివేస్తూ హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ విన్నపం మేరకు తీర్పును నెల రోజుల పాటు సుప్రీం వాయిదా వేసింది.

08/22/2016 - 14:29

హైదరాబాద్: క్రమశిక్షణ, నిరంతర శ్రమ, సంకల్ప బలంతో బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి దేశానికి వనె్న తెచ్చిందని తెలంగాణ మంత్రులు కెటిఆర్, నాయిని నరసింహారెడ్డి, మహేందర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం సింధు గౌరవార్థం తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన సత్కార సభలో మంత్రులు మాట్లాడారు. నేటి యువతకు సింధు స్ఫూర్తిదాతగా నిలిచిందని వారు అన్నారు.

08/22/2016 - 14:28

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో పతకాలను సాధించడం ద్వారా పివి సింధు, సాక్షి మాలిక్ భారత దేశ ప్రతిష్టను కాపాడారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఒలింపిక్ పతక విజేత సింధు గౌరవార్థం సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సత్కార సభలో ఆయన మాట్లాడుతూ, బంగారు పతకాన్ని సాధించలేక పోయినా సింధు మన బంగారం అని ప్రశంసించారు. ఆమె ఆటను దేశ ప్రజానీకం ఎంతో ఉత్కంఠతో వీక్షించిందని ఆయన గుర్తు చేశారు.

08/22/2016 - 14:27

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో పతకాలను సాధించిన పివి సింధు, సాక్షి మాలిక్ భారత జాతికే గర్వకారణంగా నిలిచారని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఒలింపిక్ పతక విజేత సింధుకు సత్కారం సందర్భంగా సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, తాను ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయినా సింధు ద్వారా తన కల నిజమైందన్నారు.

08/22/2016 - 14:26

హైదరాబాద్: తొలిసారిగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న తాను పతకం సాధిస్తానని అనుకోలేదని, అయితే దేశ ప్రజలందరి ప్రోత్సాహం, ఆశీర్వాద బలంతో తాను ఇంతటి ఘనతను సాధించగలిగానని బ్యాడ్మింటర్ క్రీడాకారిణి పివి సింధు ఎంతో భావోద్వేగంతో తెలిపింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన అనంతరం సోమవారం నగరానికి చేరుకున్న ఆమెను తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా సత్కరించింది.

08/22/2016 - 14:12

హైదరాబాద్‌: ఒలింపిక్స్‌లో ర‌జ‌త పతక విజేత పీవీ సింధు, ఆమె కోచ్‌ గోపీచంద్‌లను తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఘనంగా సత్కరించింది. గచ్చిబౌలి మైదానంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు సింధు, గోపీచంద్‌కు శాలువా కప్పి జ్ఞాపికలను అందజేశారు. పలువురు ప్రముఖులు సింధుకు అభినందనలు తెలిపారు.

08/22/2016 - 13:43

నల్గొండ: చండూరు మండలం దోనిపాములలో సోమవారం కొందరు కీచకులు మూగ మహిళపై అత్యాచారయత్నం చేశారు. ప్రతిఘటించిన మహిళ పోలీసు స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

08/22/2016 - 11:46

హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. 27 జిల్లాలతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కొత్తగా 14 రెవెన్యూ డివిజన్లు, 33 మండలాలు ఏర్పాటు చేయనున్నారు. మరో రెండుసార్లు అఖిలపక్ష సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల రోజుల పాటు అభ్యంతరాల స్వీకరించనున్నారు.

08/22/2016 - 11:42

హైదరాబాద్: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద సోమవారం తెల్లవారు జామున జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై తెలంగాణ సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పదిమంది మరణించడంతో మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

Pages