S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/08/2020 - 05:28

హైదరాబాద్, మార్చి 7: రాష్ట్రంలో కేసీఆర్ పాలన అద్భుతంగా పని చేస్తునందున ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు తెరాసకు పట్టం కట్టారని, దీంతో పార్టీ విజయఢంకా మోగించిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు అన్నారు. శనివారం శాసన మండలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై జరిగిన చర్చల్లో పాల్గొన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు.

03/08/2020 - 05:27

హైదరాబాద్, మార్చి 7: గత ఆరేళ్లుగా చెప్పిం దే చెబుతూ తెలంగాణ సమాజాన్ని మభ్యపెడుతున్నారని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం శాసన మండలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన చర్చల్లో పాల్గొన్న రామచంద్రరావు మాట్లాడుతూ కేసీఆర్ పాలనపై తక్షణం శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

03/08/2020 - 05:26

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరాజన్ శుక్రవారం చేసిన ప్రసంగంపై అధికార పార్టీ సభ్యులు శనివారం ధన్యవాదాలు తెలుపుతూ ప్రతిపాదించిన తీర్మానానికి శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపాయి. గవర్నర్ ప్రసంగంపై శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు చర్చ జరిగింది. ఈ చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సమాధానం చెప్పారు.

03/08/2020 - 01:55

హైదరాబాద్, మార్చి 7: కరోనాపై ప్రజలు ఎవరు కూడా అనవసరంగా భయం పెట్టుకోవద్దని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారుల (డీఎంహెచ్‌ఓ)తో సచివాలయం నుండి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో ఇప్పటి వరకు ఎవరికీ కరోనా సోకలేదని, విదేశాల నుండి వచ్చిన వారికి ఈ లక్షణాలు ఉంటే చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు.

03/08/2020 - 02:35

హైదరాబాద్: యువతకు సరైన శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాను ఎప్పుడూ చెప్పలేదని సీఏం కల్వకంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మాణంపై చర్చ సందర్భంగా తెలంగాణ శాసన మండలిలో శనివారం సాయంత్రం ప్రసంగించారు. కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి తెలంగాణకు ఉందా? అని ప్రశ్నించారు.

03/08/2020 - 01:51

హైదరాబాద్, మార్చి 7: నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఖరీదైన మందులు సైతం సామాన్యుడికి అందుబాటు ధరలకే లభిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. ఒకపుడు హార్ట్ స్టెంట్స్, నీ ఇంప్లాంట్స్, డయాలసిస్ వంటి చికిత్సల ఖర్చును చూసి సంపన్నులు సైతం భయపడే వారని ఇపుడు సామాన్యులకు కూడా అవి అందుబాటులోకి వచ్చాయని అన్నారు.

03/08/2020 - 01:50

నార్సింగి, మార్చి 7: జన్వాడలోని కేటీఆర్ బంధువు ఫామ్‌హౌస్ వద్దకు వెళ్లేందుకు తరలిన కాంగ్రెస్ నాయకులను నార్సింగి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనస సభ ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీ్ధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డి, వీరయ్య, మాజీ ఎమ్మెల్యే అనిల్‌ను నార్సింగి చౌరస్తా ప్రాంతంలో అడ్డుకోని అదుపులోకి తీసుకున్నారు.

03/08/2020 - 02:07

హైదరాబాద్, మార్చి 7: ఖమ్మం మార్కెట్ యార్డులో తగిన సౌకర్యాలు , ముందస్తు చర్యలు లేకపోవడంతో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మిరపపంట తడిసిపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. దీనికి పూర్తి బాధ్యత వహించి తడిసిన మిరపపంటను మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.

03/08/2020 - 01:23

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ మాట ఎంతవరకు నిలబెట్టుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగాలు, నియామకాల విషయంలో సీఎం చొరవ చూపడంలేదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం శాసన మండలి సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.

,
03/08/2020 - 01:57

హైదరాబాద్: మహిళా దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. శనివారం సికిందరాబాద్ నుంచి వికారాబాద్ వరకూ పూర్తిస్థాయిలో మహిళా సిబ్బందితో ప్యాసింజర్ రైలును నడిపారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో 5 స్టేషన్లల్లో మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలంగాణలో బేగంపేట, విద్యానగర్ రైల్వే స్టేషన్లలో మహిళా ఉద్యోగులు విధినిర్వహణ చేస్తున్నారు.

Pages