S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/05/2016 - 05:38

మిర్యాలగూడ, ఆగస్టు 4: తెలుగు రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చి టేల్‌పాండ్ భూనిర్వాసితులకు నష్టపరిహారం అందించేందుకు కృషిచేస్తానని సిఎల్‌పి నేత కుందూరు జానారెడ్డి అన్నారు. టేల్‌పాండ్ భూనిర్వాసితులకు న్యాయమైన పరిహారం పునరావాసం కల్పించాలని కోరుతూ భూనిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు గురువారం మద్దతు తెలిపారు.

08/05/2016 - 05:36

మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 4: భ్రూణహత్యలకు గురైన సుమారు ఐదు నెలల వయసు గల మూడు పిండాలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున దర్శనమిచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు క్యా రీబ్యాగ్‌లో గర్భస్రావం చేసిన ఈ పిండా లతో పాటు వైద్యులు, సిబ్బంది వాడిన గ్లౌజులు, ప్రిస్క్రిప్షన్ చీటీలు పడేశారు.

08/05/2016 - 04:12

హైదరాబాద్, ఆగస్టు 4: ఇప్పటివరకు దేశంలో తాము పర్యటించిన రాష్ట్రాలకన్నా తెలంగాణలోనే పరిశ్రమలు, పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని యునైటెడ్ కింగ్‌డమ్ బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్స్ ప్రతినిధి బృందం అభిప్రాయపడింది. ఈ బృందం ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావును గురువారం కలిసింది.

08/05/2016 - 03:57

హైదరాబాద్, ఆగస్టు 4: వచ్చే 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్న ప్రధాన నరేంద్రమోదీ సంకల్పానికి, కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలకు మద్దతు తెలుపుతున్నట్లు అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) ప్రకటించింది.

08/05/2016 - 03:54

సంగారెడ్డి, ఆగస్టు 4: రెండేళ్లు నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో చరిత్రలో ఎన్నడు లేని విధంగా సింగూర్ ప్రాజెక్టు పూర్తిగా వట్టిపోగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరద నీరు వచ్చి చేరుతోంది. వడివడిగా వస్తున్న వరదతో 6.23 టిఎంసిలకు నీరు నిల్వకొచ్చింది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో పాటు తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల ద్వారా మంజీర నదిలోకి వరద నీరు వస్తోంది.

08/05/2016 - 03:53

ఖమ్మం, ఆగస్టు 4: మద్యాన్ని దుకాణాలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్టవ్య్రాప్తంగా కొత్తగా ఐదు మద్యం డిపోలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల పరిధిలో ఇప్పటికే 17మద్యం డిపోలు ఉండగా, కొత్తగా మరో 5ఏర్పాటు కానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాల పరిధిలోనే కొత్త డిపోలు ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.

08/05/2016 - 03:53

జిన్నారం, ఆగస్టు 4: మెదక్ జిల్లా ఐడిఎ బొల్లారంలో విషాదం చోటుచేసుకుంది. రాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తున్న ఓ కుంటుంబాన్ని సజీవ దహనానికి యత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. ప్రస్తుతం బాధితులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. స్థానికుల కధనం ప్రకారం... ఐడిఎ బొల్లారం గ్రామానికి చెందిన సుంకయ్య కుటుంబం బొల్లారం నివాసం వుంటున్నారు.

08/05/2016 - 03:45

న్యూఢిల్లీ, ఆగస్టు4: తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని టిఆర్‌ఎస్ ఎంపీ కవిత వెల్లడించారు. గురువారం పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీని ఆమె కలిశారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ పసుపుబోర్డు కోసం ఎంతోకాలంగా రైతులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. దీనిపై తాను ఇంతకు ముందే కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే ఉన్నతాధికారులతోనూ పలు దఫాలుగా చర్చించినట్టు కవిత వెల్లడించారు.

08/04/2016 - 18:24

హైదరాబాద్: ఈనెల 7న నగరంలోని ఎల్‌బి స్టేడియంలో బిజెపి కార్యకర్తల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నందున కొన్ని ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆరోజు ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కును మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

08/04/2016 - 18:24

హైదరాబాద్: తెలంగాణ పర్యటన సందర్భంగా మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రారంభించవద్దని కోరుతూ టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రధాని మోదీకి గురువారం బహిరంగ లేఖ రాశారు. గతంలో ప్రారంభించిన ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించడం సరికాదన్నారు.

Pages