S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/03/2016 - 06:53

ముషీరాబాద్/హైదరాబాద్, ఆగస్టు 2: ప్రభుత్వ రంగ సంస్థల విభజన సంపూర్ణంగా జరగాలని తెలంగాణ రాజకీయ జెఏసి చైర్మన్ ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల మనుగడతోనే కులవృత్తులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిలకడ సాధ్యమని తేల్చి చెప్పారు.

08/03/2016 - 06:52

హైదరాబాద్, ఆగస్టు 2: ఎమ్సెట్-2 నిర్వహణలో రోజురోజుకూ అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఎమ్సెట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు రిజిస్టర్డ్ బిడ్డర్ల మధ్య పోటీతో ఈ అక్రమాలు ఒకొక్కటీ బయటపడుతున్నాయి. ప్రధానంగా డేటామెథడెక్స్, మాగ్నటిక్ ఇన్ఫోటెక్ లిమిటెడ్‌ల మధ్య పోరుతో పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉన్నత విద్యా మండలికి అనేక ఫిర్యాదులు వచ్చాయి.

08/03/2016 - 06:51

హైదరాబాద్, ఆగస్టు 2: నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసిని లాభాల బాటలో నడిపించేందుకు కృషి సల్పుతున్నామని, రూ. 5 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా సంస్థను పటిష్టం చేయనున్నట్టు టిఎస్‌ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం బస్‌భవన్‌లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రీజినల్ మేనేజర్లతో కలసి సమావేశమైన చైర్మన్ ఆర్టీసి పురోభివృద్ధిపై చర్చించారు.

08/03/2016 - 06:51

హైదరాబాద్, ఆగస్టు 2: అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్), జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సెర్ఫ్ సిఇఓ పౌసమిబసుతో వేతనాల పెంపుపై క్యాంపు కార్యాలయం మంగళవారం ముఖ్యమంత్రి సమీక్షించారు.

08/03/2016 - 06:50

హైదరాబాద్, ఆగస్టు 2: గిరిజన తండాలు, గూడెంలలో వైద్య సేవలను మరింతగా విస్తృత పరచాలని గిరిజనాభివృద్ధి, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం తన చాంబర్‌లో అధికారులతో వైద్య సహాయంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో మలేరియా, ఇతర విష జ్వరాలు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

08/03/2016 - 06:49

హైదరాబాద్, ఆగస్టు 2: మూడు తెలంగాణ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో 125 ఆరోగ్య ఉపకేంద్రాలకు భవనాలను నిర్మించేందుకు అవసరమైన నిధులను కేంద్రం విడుదల చేసింది. వీటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులను మంగళవారం ఇచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.

08/03/2016 - 06:54

హైదరాబాద్, ఆగస్టు 2: తెలంగాణ ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రం లీకేజిపై దర్యాప్తు చేస్తున్న సిఐడి తీరును పర్యవేక్షించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎమ్సెట్ ప్రశ్నాపత్రం లీకైనందువల్ల తాజాగా నోటిఫికేషన్‌ను ఆదేశించాలని, సిఐడి దర్యాప్తును పర్యవేక్షించాలని కోరుతూ ఎస్ మహేందర్ రాజు అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను హైకోర్టు మంగళవారం విచారించింది.

08/03/2016 - 06:30

హైదరాబాద్, ఆగస్టు 2: ఈ నగరానికి ఏమైంది. రికార్డుల్లో దూసుకుపోతోంది. కండల వీరుడు రోహిత్ ఖండేల్వాల్ మిస్టర్ వరల్డ్‌గా ఎంపికైతే, పారిశుద్ధ్య కార్మికుడు టి వెంకటయ్య ఒకే ఒక్కడిగా నిలిచాడు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు వారధిగా నిలిచి, జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడు పురస్కారానికి ఎంపికయ్యాడు.

08/03/2016 - 06:25

హైదరాబాద్, కెపిహెచ్‌బి కాలనీ, ఆగస్టు 2: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి నిర్మాణంలోవున్న కమాన్ (ఆర్చ్ గేట్) కుప్పకూలింది. ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

08/03/2016 - 06:22

హైదరాబాద్, ఆగస్టు 2: ఢిల్లీ కేంద్రంగా ఎమ్సెట్ ప్రశ్నాపత్రాల లీకేజి రాకెట్ పని చేసిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. లీకుకు ముకుల్ జైన్, మయాంక్ శర్మ, సునీల్‌సింగ్, ఇక్బాల్‌లు ప్రధాన సూత్రధారులుగా తేలిందన్నారు.

Pages