S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/02/2016 - 06:10

నల్లగొండ, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మంగా విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టిందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

08/02/2016 - 06:08

నవాబుపేట/జడ్చర్ల, ఆగస్టు 1: ఎన్నికలకు ముందు సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు అనుభవ లేమితో పరిపాలించి అప్పుల పాలు చేశారని టిడిపి రాష్ట్ర అద్యక్షుడు ఎల్. రమణ ధ్వజమెత్తారు. సోమవారం మహ బూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

08/02/2016 - 06:04

తొగుట, ఆగస్టు 1: మల్లన్నసాగర్ భూనిర్వాసిత గ్రామం వేములఘాట్‌లో లాఠీచార్జీ బాధితులను పరామర్శించేందుకు హైకోర్టు అనుమతితో మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి సునితారెడ్డి ఆధ్వర్యంలో నాయకుల బృందం సోమవారం సందర్శించింది.

08/02/2016 - 06:01

ఆదిలాబాద్, ఆగస్టు 1: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మావోయిస్టు పార్టీ దళసభ్యుడు టేకం రవి ఆలియాస్ రవీందర్‌ను సోమవారం తాండూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన టేకం రవిని సోమవారం జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మీడియా సమావేశంలో ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు.

08/02/2016 - 06:01

నారాయణఖేడ్ జూలై 1: అమాయకులైన తల్లిదండ్రులను మోసగించి శ మైనర్ బాలికను డబ్బులకు కక్కుర్తిపడి అమ్మేసిన ఘటన నారాయణఖేడ్ సంచలనం సృష్టించింది. కొండాపూర్ తండాకు చెందిన ముగ్గురు యువకులు అదే తండాకు చెందిన బాలికను లక్ష రూపాయలకు పుణెలో తెగనమ్మేశారు.

08/02/2016 - 05:08

హైదరాబాద్, ఆగస్టు 1: మహిళలు చైతన్యవంతులైతే సమాజం ప్రగతి పథంలో నడుస్తుందని అయితే మతం మహిళల ఎదుగుదలకు ఆటంకం అవుతుందని ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యాయుల వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ‘నాయకత్వ కార్యశాల’ రెండోరోజు కార్యక్రమంలో ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే పాల్గొన్నారు. మహిళలు నాయకత్వంలోకి రావాలంటే ఇంట్లో కూడా పోరాటం చేయాలని అన్నారు.

08/02/2016 - 05:07

హైదరాబాద్, ఆగస్టు 1: హైదరాబాద్‌లో ఓ లారీ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం మియాపూర్ వద్ద జాతీయ రహదారిపై సంఘటన చోటుచేసుకుంది. భారీ లోడ్‌తో లారీ జనంపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. కూకట్‌పల్లి నుంచి బిహెచ్‌ఇఎల్ వైపు వెళ్తున్న లారీ మదీనగూడ వద్ద రోడ్డు పక్కనే ఉన్న ఓ నర్సరీలోకి దూసుకెళ్లింది.

08/02/2016 - 05:07

హైదరాబాద్, ఆగస్టు 1:అక్రమ మైనింగ్‌ను నివారించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అకస్మిక తనిఖీలు జరపనున్నట్టు ఐటి, మైనింగ్ శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. రెవెన్యూ, గనులు, విజిలెన్స్, పోలీసు అధికారులతో ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కరీంనగర్ పర్యటనలో ఉన్న కెటిఆర్ జిల్లా యంత్రాంగానికి, స్థానిక గనుల శాఖ యంత్రాంగానికి ఎలాంటి సమాచారం లేకుండా కొత్తపల్లి ఇసుక రీచ్‌ను సందర్శించారు.

08/01/2016 - 18:09

హైదరాబాద్: ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఎంసెట్-2ను రద్దు చేసేందుకు నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్-3 నిర్వహణకు సంబంధించి షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. ఆగస్టు మూడో వారంలోగా పరీక్షను నిర్వహించి సెప్టెంబర్ నెలాఖరుకు అడ్మిషన్ల కౌనె్సలింగ్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

08/01/2016 - 18:02

హైదరాబాద్‌: పాతబస్తీలోని అక్కన్న మాదన్న ఆలయం వద్ద అమ్మవారి వూరేగింపు సోమవారం ప్రారంభమైంది. వూరేగింపును నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.లాల్‌దర్వాజలోని సింహవాహిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం ప్రారంభమైంది. అమ్మవారి భక్తురాలు అనురాధ పచ్చికుండపై నిల్చుని భవిష్యవాణిని విన్పించనున్నారు.

Pages