S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/31/2016 - 07:01

హైదరాబాద్, జూలై 30: ఎంసెట్-2 లీకేజీకి అసలు కారకులైన వారిని వదిలేసి మధ్యలో వచ్చిన బ్రోకర్లపై ప్రభుత్వం కేసులు పెట్టిస్తున్నదని బిజెపి నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. ఎంసెట్-2 లీకేజిపై సిఐడి ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతృప్తిగా ఉన్నారా? అని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు.

07/31/2016 - 07:00

హైదరాబాద్/గచ్చిబౌలి, జూలై 30: మద్యం ప్రాణాంతకమని, మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమనే నినాదాలు మద్యం బాటిళ్లపై ముద్రించే యోచనలో ఉన్నామని ఎక్సైజ్ కమిషనర్ ఆర్.చంద్రవదన్ తెలిపారు. శనివారం సైబరాబాద్ కమిషనరేట్‌లో ‘అండర్ ఏజ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్’పై అవగాహన సదస్సు జరిగింది.

07/30/2016 - 18:48

ఆదిలాబాద్‌: రేపట్నుంచి వచ్చే నెల 11 వరకు ఆదిలాబాద్‌ జిల్లా బాసరలో గోదావరి అంత్యపుష్కరాలు జరుగుతాయి. ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఈ పుష్కరాలను దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

07/30/2016 - 17:58

హైదరాబాద్‌: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర తీరం వెంబడి అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉపరిత ఆవర్తనం నెలకొని ఉందని తెలిపారు. రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, అనంతపురం, కడప జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

07/30/2016 - 17:02

ఖమ్మం: రెజోనెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ వాసిరెడ్డి నాగేంద్రకుమార్‌పై ఎంసెట్‌-2 పేపర్‌ లీక్‌ కేసులో సీఐడీ అధికారులు అరెస్ట్‌వారెంట్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లోని రెజోనెన్స్‌ వి క్యాంపస్‌లో విద్యార్థులకు నాగేంద్రకుమార్‌ శిక్షణ ఇస్తున్నట్లు అరెస్ట్‌ వారెంట్‌లో పేర్కొన్నారు.

07/30/2016 - 16:20

మెదక్‌: ప్రధాని నరేంద్రమోదీ మెదక్‌ జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. గజ్వేల్‌ మండలం కోమటిబండ వద్ద హెలిప్యాడ్‌, సభాస్థలి ప్రాంగణాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 7న ‘మిషన్‌ భగీరథ’ తొలిదశను ప్రధాని ప్రారంభిస్తారు.

07/30/2016 - 14:48

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీలో నేరమంతా బ్రోకర్లపై నెట్టివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బిజెపి నేత నాగం జనార్ధనరెడ్డి ఆరోపించారు. లీకేజీకి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఎంసెట్ కన్వీనర్‌పైనా కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలన్నారు. సంబంధిత మంత్రులను క్యాబినెట్ నుంచి బర్త్ఫ్ చేయాలన్నారు.

07/30/2016 - 14:47

మెదక్: మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను పరామర్శించేందుకు వెళుతున్న న్యాయవాదులను ఒంటిమామిడి వద్ద శనివారం నాడు పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా లాయర్లు, పోలీసుల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఓ న్యాయవాదికి గాయం కావడంతో లాయర్లు నిరసనకు దిగారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

07/30/2016 - 13:55

నల్గొండ : పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని పాముకాటుకు గురైంది. అనాజిపురం ఆదర్శ పాఠశాలలో శనివారం పాముకాటుకు గురైన విద్యార్థిని స్వప్నను సూర్యాపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

07/30/2016 - 12:27

మహబూబ్‌నగర్‌ : అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను పోలీసులు గృహ నిర్భందంలో ఉంచారు. శుక్రవారం రాత్రి ఐజ పట్టణంలో జరిగిన ఆందోళనలో ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను అరెస్టు చేయగా, శనివారం ఉదయం స్టేషన్‌ నుంచి క్యాంపు కార్యాలయానికి తరలించి గృహనిర్భందంలో ఉంచారు. శుక్రవారం రాత్రంతా శాంతినగర్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే ఎమ్మెల్యే ఆందోళన చేపట్టారు.

Pages