S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/30/2016 - 12:02

హైదరాబాద్: అర్ధరాత్రి వేళ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పోలీసులపై దొంగలు కాల్పులు జరిపిన ఘటన రంగారెడ్డి జిల్లా పరిగిలో జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పరిగిలో ఓ బ్యాంకు వద్ద ఆగి ఉన్న కారును తనిఖీ చేసేందుకు పెట్రోలింగ్ పోలీసులు వచ్చారు. ఈ విషయం గమనించి దొంగలు వెంటనే పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు.

07/30/2016 - 12:02

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పలువురు విద్యార్థులకు పేపర్ విక్రయించిన రామకృష్ణ అనే బ్రోకర్‌ను తెలంగాణ సిఐడి పోలీసులు పంజాబ్‌లో అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. మరికొంత మంది కీలక నిందితుల కోసం ముంబయి, భువనేశ్వర్ నగరాల్లో సిఐడి బృందాలు గాలిస్తున్నాయి.

07/30/2016 - 12:01

హైదరాబాద్: ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్‌కేసర్ మండలం అంకుషాపూర్ వద్ద శనివారం తెల్లవారు జామున వెలుగు చూసింది. ఆదిలాబాద్ జిల్లాలో హౌసింగ్ శాఖలో డి.ఇగా పనిచేస్తున్న సత్యనారాయణ (53) మృతదేహాన్ని పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఓ కారులో కనుగొన్నారు.

07/30/2016 - 12:05

హైదరాబాద్‌ : గంజాయి రవాణ కేసులో పట్టుపడ్డ ప్రధాన నిందితుల ఆస్తులను పోలీసులు జప్తుచేస్తున్నారు. హయత్‌నగర్‌ పోలీసులు మూడు బృందాలుగా వెళ్లి నిందితుల ఇళ్లలో శనివారం సోదాలు చేపట్టారు. చింతల్‌లో పసుపులేటి శివ, రాంపల్లిలో పురమని శ్రీనివాసరెడ్డి , నాగారంలో వక్కంటి శ్రీనివాసరావు ఇళ్లపై పోలీసులు దాడిచేసి స్థిర, చరాస్థులను స్వాధీనం చేసుకుంటున్నారు.

07/30/2016 - 07:28

హైదరాబాద్, జూలై 29: కరీంనగర్ జిల్లా రామగుండం రసాయనాలు, ఎరువుల కర్మాగారం పునరుద్ధరణతో తెలంగాణలో సుమారు 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు.

07/30/2016 - 07:27

హైదరాబాద్, జూలై 29: వచ్చే నెల ఏడవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటిస్తారని, ఈ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్షించారు.

07/30/2016 - 07:26

హైదరాబాద్, జూలై 29: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు భూ సేకరణ త్వరలోనే పూర్తవుతుందని, ప్రస్తుతం ఇది చివరి దశకు చేరుకుందని అధికారులు వెల్లడించారు. 12 లక్షల ఎకరాలకు నీటిని అందించే ఈ ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

07/30/2016 - 07:26

హైదరాబాద్, జూలై 29: మల్లన్న సాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలను, రైతులను కలిసి పరామర్శించేందుకు వెళ్ళి తీరాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నిర్ణయించారు. శుక్రవారం టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అధ్యక్షతన గాంధీ భవన్‌లో అత్యవసరంగా జరిగిన సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు డికె అరుణ, జి. చిన్నారెడ్డి, టి.

07/30/2016 - 07:25

హైదరాబాద్, జూలై 29: మల్లన్న సాగర్ ప్రాజెక్టు పరిథిలోని మూడు గ్రామాలను సందర్శించేందుకు ఇద్దరు కాంగ్రెస్ నేతలను అనుమతించాలని హైదరాబాద్ హైకోర్టు శుక్రవారం మెదక్ జిల్లా ఎస్‌పిని ఆదేశించింది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని అనుమతించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

07/30/2016 - 07:25

హైదరాబాద్, జూలై 29: రాజ్యసభలో ప్రైవేటు బిల్లుపై జరిగిన చర్చలో తెలంగాణ సమస్యలపై ఏ పార్టీ మాట్లాడలేదని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. టిఆర్‌ఎస్ ఎంపి కేశవరావు మినహా మరే పార్టీ ఎంపి కూడా తెలంగాణ సమస్యలు ప్రస్తావించలేదని అన్నారు. సిపిఎం నాయకులు సీతారాం ఏచూరికి, బిజెపి, కాంగ్రెస్ నాయకులకు తెలంగాణలో సమస్యలే కనిపించలేదా? అని ప్రశ్నించారు.

Pages